"ముగ్ధమోహనం" (37th chapter )
.......................................................
ప్రాణాలతో పందెం...రెండు ప్రాణాలను కాపాడడానికి, తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించాడు. వెనుక సీట్లో కూచొన్న మహిళా ప్రసవవేదనతో విలవిలలాడి పోతోంది.
ఆవిడ భర్త దిక్కు తోచని స్థితిలో వున్నాడు. వెనుక నుంచి పోలీస్ వెహికల్స్.. ఆ ఏరియాని మిలిటరీ ఆధీనంలోకి తీసుకుంది.
కార్తికేయ కారు వేగాన్ని అందుకోవడం వాళ్లకు సాధ్యపడలేదు. సరిగ్గా పదిహేను నిమిషాల్లో కారు స్టార్ హాస్పిటల్ ముందు ఆగింది.
క్షణాల్లో స్ట్రెచర్ వచ్చింది. కారు వెనుక సీట్ లో వున్న మహిళను లోపలి తీసుకువెళ్ళడం....పోలీసులు కార్తికేయను చుట్టుముట్టడం ఒకేసారి జరిగింది.
అదే సమయంలో ఆ మహిళ పండంటి బిడ్డను ప్రసవించింది.
****************************
రాష్ట్రపతి...దేశ ప్రథమ పౌరుడు. త్రివిధ దళాలకు అధిపతి. స్వాతంత్ర సమర యోథుడు.
చిన్ననాడే మహాత్మాగాంధీతో పాటు స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తీ. కురు వృద్ధుడు. దేశ భక్తి రంగరించిన వ్యక్తి..
పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి....మరో తెలుగువాడు ...ప్రెసిడెంట్ అఫ్ ఇండియా...వెలిదిమళ్ళ లక్ష్మీ నరసింహారావ్ ....
రాష్ట్రపతి అంటే కేవలం రబ్బర్ స్టాంప్ మాత్రమే అన్న అపవాదును తుడిచివేసిన వ్యక్తి.
న్యాయ సమ్మతం కాని ఫైల్ ని నిర్ద్వందంగా తోసిపుచ్చిన సంఘటనలు వున్నాయి.
ఎన్నో కష్టాలకోర్చి సాధించుకున్న స్వరాజ్యం కాపాడుకోవడం మన విధి అని త్రికరణ శుద్దిగా నమ్మిన వ్యక్తి.
నిఘా విభాగం నుంచి వచ్చిన సమాచారం రాష్ట్రపతిని ఆందోళనకు గురి చేసింది. దేశ రక్షణకు విఘాతం కలిగించే విషయం మాత్రమే కాదు...
ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసే కుట్ర. ఒక అంతర్జాతీయ నేరస్తురాలు....తీవ్రవాద సంస్థలతో చేతులు కలిపి....దేశంలో విధ్వంసం సృష్టించే కుట్ర...
ఆ కుట్ర ఎంత భయంకరమైనదంటే...దేశాన్ని అల్లకల్లోలం చేసి, ప్రభుత్వాన్ని కూలదోసి, రాజరికం వైపు దాన్ని తీసుకువెళ్ళే కుట్ర.
ఒకప్పుడు రజాకార్లు చేసిన కుట్ర కన్నా భయంకరమైన కుట్ర...చిన్ననాడే సర్దార్ వల్లభభాయి పటేల్ తో వారి ఆలోచనలతో సహచర్యం చేసిన రాష్ట్రపతి...
ఆ రోజు సర్దార్ వల్లభభాయి పటేల్ సైనిక చర్య రాష్ట్రంలోని నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పింది...మరి ఇప్పుడు..?
***************************
హోం శాఖ లోనూ, నిఘా వర్గాలలోనూ...చివరి సి బి ఐ లాంటి సంస్థలలోనూ ఆగంతకులు ప్రవేశించారు...
ఎవరిని నమ్మాలి...ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి...రాష్ట్రపతి ప్రత్యేక భద్రతాధికారి, నిఘా వర్గాల చీఫ్...రాష్ట్రపతితో పాటు బులెట్ ప్రూఫ్ వాహనంలో వున్నారు.
సరిగ్గా అప్పుడే కల కలం...కాన్వాయ్ ని చేదించుకుని వెళ్ళిన కార్తికేయ కారు....అరెస్ట్ చేసిన పోలీసులు...ఈ సమాచారం రాష్ట్రపతికి చేరింది. కార్తికేయ గురించి క్షణాల్లో ఎంక్వయిరీ ప్రారంభం అయింది.
కార్తికేయ కస్టమ్స్ అధికారి అని, డ్యూటీ మైండెడ్ అని రిపోర్ట్...పైగా తెలుగు వాడు...ఆతను కాపాడింది ఒక తల్లిని, బిడ్డనీ...అంత కన్నా, కోమాలోకి వెళ్ళిపోతున్న మానవత్వాన్ని....
అతడిని తన దగ్గరికి సగౌరవంగా తీసుకురమ్మన్నాడు ప్రెసిడెంట్....ఈ విషయం ఏ మాత్రం బయటకు పొక్కకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి.
****************************
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కార్తికేయను రాష్ట్రపతి భవన్ కు తీసుకువచ్చారు. ఒక దేశాద్యక్షుడికి ఇచ్చే గౌరవం కార్తికేయకు లభించింది.
రాష్ట్రపతి ఆంతరంగిక గది. ఆ గది వైశాల్యం ఒక పెద్ద భవన సముదాయం అంత. ఆ గది చుట్టూ పదుల సంఖ్యలో కెమెరాలు...సెక్యూరిటీ చీఫ్ ఆఫీసులో ఆ గదిలో జరిగే ప్రతీ సంఘటన, చిన్న శబ్దం కూడా రికార్డు అవుతుంది. మొట్ట మొదటి సారి...ఆ ఏర్పాటుకు విరామం...ఆ గదిలో జరిగే సంఘటన రికార్డు కావడం లేదు.
రాష్ట్రపతి కార్తికేయ వైపు చూసాడు. చేతులు కట్టుకుని నిలబడి వున్నాడు. చేతులు కట్టుకోవడంలో సంస్కార వినయమే తప్ప భయం కనపడడం లేదు.
తెలుగు వాడైన రాష్ట్రపతికి..దాదాపు నలభై ఏళ్ళ క్రితం చూసిన పాతాళభైరవి సినిమాలోని 'తోటరాముడు' గుర్తొచ్చాడు. రాజు ముందు నిలబడ్డ రాజసం...
******************************
"ప్రభుత్వ ఉద్యోగంలో వున్న మీరు ప్రోటో కాల్ ని కాదని నేరం చేసారు" ప్రెసిడెంట్ అన్నాడు.
"ప్రజలు లేకుండా ప్రభుత్వం లేదు...ప్రథమ పౌరులు అయిన మీరు లేరు...ఇలా అన్నందుకు క్షమించండి.నా దృష్టిలో ప్రాణం విలువైనది...అదీ తల్లీ, బిడ్డ ప్రాణం...అందుకే ఆ సాహసం చేసాను."
"కానీ అ సాహసానికి శిక్ష ఏమిటో తెలుసా? రాష్ట్రపతి అడిగాడు .
"భారత శిక్షా స్మృతి...లోని సెక్షన్ 302 కింద మరణ శిక్ష విధించినా ఆ మరణానికి నేను సిద్ధం. ఆగిపోయే నా ఊపిరి ఇద్దరికీ ఊపిరి పోసిందని సంతోషపడుతాను."
"చావంటే భయం లేదా?
"మానవత్వాన్ని బ్రతికించే ప్రయత్నంలో చావును వెంట్రుక సమానంగా భావిస్తాను. నేను వ్యక్తిని..మానవత్వం వ్యవస్థ.."
"ఏం చూసుకుని ఆ ధైర్యం?
"ఈ దేశాధ్యక్షుడి నిజాయితీ చూసుకుని "
రాష్ట్రపతి విస్మయంగా చూసాడు.
"ఓ నా దేశ ప్రజలారా...వంద కోట్ల భారతీయుల గుండె చప్పుళ్ల సాక్షిగా అంతా నిజమే చెబుతున్నాను.
నా దేశ ప్రథమ పౌరుడి సంస్కారానికి, సవినయంగా నమస్కరించి చెబుతున్నాను.
నేను చేసింది తప్పయితే...నన్ను సగౌరవంగా ఇక్కడికి తీసుకురారు.
"దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారి లాటీ దెబ్బలు తిన్న మీరు...ఉప్పు సత్యాగ్రహంలో మహాత్ముడి ప్రశంసలు అందుకున్న మీరు...
మీ ఆంతరంగిక మందిరంలో నన్ను "మీరు" అని సంస్కారంగా సంభోదించే మీరు..."
"నేను చేసింది తప్పని భావిస్తే...మానవత్వాన్ని బ్రతికించడం కోసం...మిలార్డ్ మీ ముందు దోషిని అవుతా..."
తల వంచిన సింహాన్ని చూసాడు రాష్ట్రపతి.
తన ఆసనం నుంచి లేచాడు. బులెట్ ప్రూఫ్ గ్లాస్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి కారికేయను ఆలింగనం చేసుకున్నాడు.
ఓ అద్భుతం అక్కడ ఊపిరి పోసుకుంది. ఆ క్షణమే రాష్ట్రపతి నిర్ణయించుకున్నాడు.
కార్తికేయే ఈ దేశ రక్షకుడు.
*************************
(ఈ అధ్యాయం రాయడానికి నాకు పట్టిన సమయం...ఆరున్నర గంటలు. మూడు వందల తొంబై నిమిషాలు. కాగితం మీద అక్షరాలు పడ్డ పురిటి నొప్పి, జనని ఓ ప్రాణికి జన్మము ఇవ్వడానికి ఎంత ప్రసవవేదన అనుభవిస్తుందో చెప్పింది...ఈ నా వేదన మీతో పంచుకుంటాను...అక్షర సృష్టికి ఒక రచయిత పడే తపన మీతో చెప్పుకుంటాను...రేపటి సంచికలో...మీ ...విసురజ)

No comments:
Post a Comment