"ముగ్ధమోహనం" (38th chapter)
(04-03-2013)
..........................................................
(ఒక అక్షరం కాగితం మీద ఊపిరి పోసుకుని కంప్యూటర్ కీ బోర్డు మీద నడక నేర్చుకుని వీక్షకుల హృదయాల్లో స్థిరనివాసం ఏర్పర్చుకోవాలంటే...అక్షర తపస్సు...ఉషోదయ కాంతులతో వీక్షకుల మస్తిష్కం పొరల్లో వెలుగులీనాలి. నిన్నటి అధ్యాయం నా ఆలోచనల స్థావరాన్ని చిందర వందర చేసింది. రాష్ట్రపతికి, కార్తికేయకు మధ్య జరిగిన సంభాషణ, కథనం...స్టొరీ బోర్డులో వున్న, పదాల కరచాలనం కష్టమైంది. కథలో కీలకమైన ఈ సంఘటన ఎలా కథనకుతూహలంగా అందించాలి అనే సంశయం. కధలో రాష్ట్రపతి మన తెలుగువాడు. కార్తికేయలో నాటి తోటరాముడి సాహసాన్ని చూసాడు...మానవత్వాన్ని బ్రతికించడం కోసం తన ప్రాణాలను రిస్క్ లో పెట్టాడు.
వాళ్ళిద్దరి మధ్య హృద్యమైన సంభాషణ. తొంభై నిమిషాల సమయం పట్టింది ఈ కింది మాటలు అక్షరాలుగా మారడానికి.
"ఓ నా దేశ ప్రజలారా...వంద కోట్ల భారతీయుల గుండె చప్పుళ్ల సాక్షిగా అంతా నిజమే చెబుతున్నాను.
నా దేశ ప్రథమ పౌరుడి సంస్కారానికి, సవినయంగా నమస్కరించి చెబుతున్నాను.
నేను చేసింది తప్పయితే...నన్ను సగౌరవంగా ఇక్కడికి తీసుకురారు.
"దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారి లాటీ దెబ్బలు తిన్న మీరు...ఉప్పు సత్యాగ్రహంలో మహాత్ముడి ప్రశంసలు అందుకున్న మీరు...
మీ ఆంతరంగిక మందిరంలో నన్ను "మీరు" అని సంస్కారంగా సంభోదించే మీరు..."
"నేను చేసింది తప్పని భావిస్తే, మానవత్వాన్ని బ్రతికించడం కోసం..."..మిలార్డ్ మీ ముందు దోషిని అవుతా..."
ఈ సంభాషణ రాసాక రాష్ట్రపతి స్పందన అద్భత రసమవ్వాలి. ఒకే ఒక వాక్యంలో కార్తికేయ వ్యక్తిత్వాన్ని, రాష్ట్రపతి ఔన్నత్యాన్ని చెప్పాలి.
ఎలా? కాగితాల మీద అక్షరాలూ ఆత్మార్పణ చేసుకుంటున్నాయి....ఒకే ఒక వాక్యం....
మానవత్వాన్ని బ్రతికించడం కోసం...
తల వంచిన సింహాన్ని చూసాడు రాష్ట్రపతి.
దాదాపు నలభై నిమిషాల తర్వాత రాసిన వాక్యం.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రచయిత అక్షర సృజన కోసం ఎలాంటి వేదన అనుభవిస్తాడో...చెప్పడానికి....
మూడు వెర్షన్లు రాసాను.. అర్హరాత్రి రెండున్నరకు...తర్వాత మూడున్నరకు...ఎడిటర్ గారికి ఫోన్ చేసాను...ఈ అధ్యాయం వెనుక వున్న కథ, వ్యథ చెప్పాను...
తెల్లవారు ఝాము నాలుగులోగా ఎటువంటి పరిస్థితిలోనూ సీరియల్ తాలూకు అధ్యాయం సిద్ధంగా వుండాలి.
రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుఝాము మూడూ నలభై అయిదు వరకు కొనసాగిన అధ్యాయ రచన...
మీరు చూపించే ఒకే ఒక అభినందన వాక్యంతో ధన్యమవుతుంది.---మీ రచయిత ...విసురజ )
****************
.
ఎనభై-తొంభై పడిలో వున్న కురు వృద్దుడు....భీష్మాపితామహుడే....దేశభక్తి, సంస్కారం ఉట్టిపడే దివ్య తేజస్సు.
రాష్ట్రపతి కార్తికేయను చేరాడు. అతని భుజం మీద చేయివేసాడు.
"స్వాతంత్ర్య పోరాట సమయంలో ఇంకా నూనుగు మీసాల కుర్రాడినే....మహామహులను చూసాను...నా చిన్నతనంలో రజాకార్లను చూసాను...ఎన్నో పోరాటాల ఫలితం మనం అనుభవిస్తోన్న ఈ స్వతంత్ర భారతం...స్వార్ధపర శక్తుల చేతుల్లో చిక్కుకోకూడదు
ఒక తల్లి ప్రాణాన్ని, ఇంకా భూమి మీదికి రాని ఓ పసిబిడ్డను కాపాడడానికి నీ ప్రాణాలను పణంగా పెట్టావు.
ప్రెసిడెంట్ అఫ్ ఇండియాతో తలపడ్డావు. నాకు ప్రోటోకాల్ అక్కర్లేదు...ఇప్పటికే చాలా కాలం బ్రతికాను. ఇంకా బ్రతకాలన్న ఆశ, కోరిక లేవు.
కానీ ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ స్వాతంత్ర్య భారతాన్ని బ్రతికించాలి" అని ఆగి "నువ్వు బ్రతికించాలి" అన్నాడు.
ఒక్క క్షణం భయంకరమైన నిశ్శబ్దం. నేనా "విస్మయానందం...విభ్రమాశ్చర్యం"...కార్తికేయలో.
స్వాంతత్ర్య పోరాటంలో పాల్గొన్న దేశ భక్తుడు, దేశానికి ప్రథమ పౌరుడు,త్ రివిధ దళాలకు అధిపతి...అన్నింటికీ మించి విలువలకు ప్రాణం పోసే వ్యక్తి.
********************* ******************************** **********************************
రాష్ట్రపతి కార్తికేయను డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు. వేడి వేడి వంట పదార్థాలు...తెలుగు రుచుల ఘుమ ఘుమలు...
గోంగూర, ఆవకాయ,వడియాలు, సాంబారు, ముద్దపప్పు...పచ్చళ్ళు...."ఈ పూట నాతో కలిసి భోజనం చేస్తారా?
కార్తికేయ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. రాష్ట్రపతి అన్నాడు...ఈ వయసులో తిని అరాయించుకునే శక్తి లేదు. ఒంటి పూట భోజనమే...ప్రపంచంలో చాలా మంది "ఈ గుప్పెడు అన్నం కోసం కష్టపడుతూ, చివరికి డబ్బు సంపాదనలో కడుపు నిండా తినడమే మర్చిపోతున్నారు కార్తికేయా...ఆకలి అంటే నాకు భయం...గౌరవం...నాతో పాటు కలిసి భోజనం చేయి..." ఆప్యాయంగా అతని చేయి పట్టుకున్నాడు.
ఇది కలా? నిజమా?
"అధికారంలో వుంటే ఎన్నో ఫార్మాల్టీస్ ...నేను తినే ప్రతీ పదార్ధం పరిశీలించవాల్సిందే...నీ కోసం సడలించాను..." అంటూ తనే కార్తికేయకు వడ్డించాడు. తనూ పక్కన కూర్చున్నాడు.
కార్తికేయలో ఒక భావోద్వేగం చిన్నపాటి ప్రకంపనగా మారింది.
కార్తికేయ అన్నం కలుపుతున్నాడు. రాష్ట్రపతి కార్తికేయ వైపు చూసి..."నేను మృత్యువు అంపశయ్య మీద వున్నభీష్ముడిని, నాకు స్వచ్చంద మరణం వరంగా లేదు...అందుకే నిన్నో వరం అడుగుతున్నాను..."
కార్తికేయ వెంటనే అన్నాడు...వరం కాదు, అజ్ఞగా ఇవ్వండి...శిరసావహిస్తాను ..నేను తినే ఈ అన్నం సాక్షిగా "మనస్ఫూర్తి గా" అన్నాడు.
******************* ***************************** *****************************
భోజనం ముగించారు...రాష్ట్రపతి ఉత్తరం వైపు వున్న గోడ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ భరతమాత తైల వర్ణ చిత్రం వుంది. ఆ చిత్రాన్ని పక్కకు జరిపి చిన్న బూడిపే లాంటి దాన్ని ప్రెస్ చేసాడు. రహస్య ద్వారం తెరుచుకుంది. కార్తికేయ రాష్ట్రపతిని అనుసరించాడు. ర్యాక్ లో నుంచి కొన్ని పెన్ డ్రైవ్ తీసాడు...ఫోటోలు వున్న కవర్ తీసాడు. వాటిని కార్తికేయకు ఇచ్చాడు.
"ఈ కవర్ లో వున్న ఫోటోలు "మోహన" అనే కరుడుగట్టిన మహిళా నేరస్తురాలివి. ఎన్నో అంతర్జాతీయ తీవ్రవాద నేరాలతో సంబంధం వున్న వ్యక్తి. పెన్ డ్రైవ్ లో ఆమె సమావేశమైన వీడియో క్లిప్స్ వున్నాయి..ఆల్ ఖైదా, మరికొన్ని ఉగ్రవాద సంస్థలతో ఆమె జరిపిన సంభాషణల క్లిప్స్ వున్నాయి. నిప్పు కన్నా ప్రమాదం...పాదరసం కన్నా జారిపోయే తెలివి, మనుష్యుల బలహీనతలతో ఆడుకుంటుంది. తను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తుంది."
చాలా కాలంగా నిఘావర్గాలు కష్టపడి సంపాదించిన వివరాలు. ఈ ప్రయత్నంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
భారతదేశాన్ని మళ్ళీ రాజరికం వైపు నడిపించే మహాకుట్ర.... తనే నియంతగా పరిపాలించాలన్న దుష్ట ఆలోచన. దీనికి పొరుగుదేశం లోని ఉగ్రవాద సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయి. ఇదే జరిగితే స్వతంత్ర భారతం మళ్ళీ బంధించబడుతుంది. రజాకార్ల దుర్మార్గాలకు నేను ప్రత్యక్ష్య సాక్షిని. మా తాతను చెట్టుకు కట్టేసి తుపాకీతో కాల్చివేశారు. రోడ్డు మీద వెళ్తే....నుదుట వున్న విభూధిని చేరిపెసుకోవల్సి వచ్చేది. మా అన్నయ్యను కాల్చడానికి వచ్చిన రజాకార్ల నుంచి, ఓ ముస్లీం సోదరి కాపాడింది. మా అన్నయ్యను తన సోదరుడు అని చెప్పింది.
అలాంటి పరిణామాలు మళ్ళీ రావద్దు.
సూర్యోదయంతో మొదలై, సూర్యాస్తమయంతో ముగిసే యుద్ధం కాదు..నిరంతరం..శత్రువు నేలకొరిగే వరకు, శత్రువు ఓటమి పాలయ్యేవరకూ ఈ యుద్ధం కొనసాగాలి. ఇది ప్రదానికో, హోం మినిస్టర్ కు చెప్పవచ్చు...ఈ కేసు సి బి ఐ కి అప్పగించవచ్చు...కానీ ప్రతీ చోట మోహనకు నెట్ వర్క్ వుంది. రాష్ట్రపతి కార్యాలయం అలంకారమన్న అపోహతో ఇటువైపు ఎవరూ కన్నెత్తి చూడలేదు.
ఈ యుద్ధానికి నువ్వే సర్వసేనానివి..నువ్వే ఒక సైన్యానివి...ఏకవ్యక్తి సైన్యానివి....వన్ మేన్ ఆర్మీవి.
"కార్తికేయ వైపు తిరిగి సెల్యూట్ చేస్తూ చెప్పాడు రాష్ట్రపతి. అతని చేతిలో రాజపత్రం....తనకున్న విచక్షణాధికారంతో ఇచ్చిన రాజశాసనం.
దేశచరిత్రలో అద్భుత ఘటనకు రాష్ట్రపతి భవన్ వేదిక అయింది.
రాష్ట్రపతి పూజాగది వైపు నడిచాడు. నిలువెత్తు శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం...ఆ విగ్రం పాదాల దగ్గర వజ్రాలు పొదిగిన ఖడ్గం...స్వామికి నమస్కరించి ఆ ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాడు..కార్తికేయ దగ్గరికి వచ్చి....
"ఇది మా వెలిదిమళ్ళ వంశానికి మాత్రమే దక్కిన అపూర్వ నిధి. ఈ ఖడ్గం గురించి తెలుసా? ఆగి కార్తికేయ వైపు చూసాడు.
********************* ****************************** ****************************
(శ్రీవెంకటేశ్వరుడు అద్రహోదగ్రుడై, ఉగ్ర నరసింహుడై మహా వృక్షాన్ని
ఖడ్గంగా చేసుకుని....ఈ విశేషాలు రేపటి సంచికలో)

No comments:
Post a Comment