"ముగ్ధమోహనం" (39th chapter)
..............................
(05-03-2013)
అటెన్షన్ ప్లీజ్....
(మీ అనూహ్యమైన స్పందనలో తడిసి ముద్దవుతోన్న " ముగ్ధమోహనం" మార్చి చివరి వారంలో పుస్తక రూపంలో మీ ముందుకు వస్తుంది. ఈసీరియల్ ముగింపు ఎలా వుంటుంది...? ఆ ముగింపు మీరే రచయిత స్థానంలో వుండి రాయండి. మీ ముగింపు, రచయిత విసురజ ముగింపు ఒకటే అయితే "అక్షరాల వెయ్యి నూట పదహార్లు" (Rs 1116/-.) బహుమతి ప్లస్ రచయిత ఆటోగ్రాఫ్ తో కూడిన పుస్తకం. అలాగే మీరు రాసిన ముగింపు రచయిత ముగింపుకు దగ్గరగా వుంటే వాటికి రచయిత ఆటోగ్రాఫ్ తో కూడిన ముగ్ధమోహనం పుస్తకాలు గిఫ్ట్ గా అందించబడుతాయి.
మీ ముగింపు చేరవలిసిన చివరి తేదీ, మార్చ్ 15, 2013.....)
మా మెయిల్ ఐ డి
manrobocreations@gmail.com
******************************************************* ********************************* ******************************************
ఒక్క క్షణం....ఒళ్ళు గగుర్పొడిచింది. ఇది కలా? కల లాంటి నిజమా? రాష్ట్రపతి కొనసాగించాడు.
ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం కథ. కొన్ని తరాల వెనక్కి వెళ్ళాలి.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని అవతారాన్ని ఓ రాక్షసుడు అవహేళన చేస్తూ, శిలలా వున్న నువ్వు "ఆపద మొక్కులవాడివా? అంటూ దూషించాడు. అయినా దేవుడు కాబట్టి సహించాడు. అక్కడితో ఆ రాక్షసుడు...ఆగక తిరుపతిని దర్శించే భక్తులను హింసించడం మొదలు పెట్టాడు...భక్తజన ప్రియుడైన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు తన భక్తులను హింసించడం చూసి ఆగ్రహించి ఉగ్రనరసింహుడుగా మారి...పర్వత ప్రాంతంలో వున్న వేల సంవత్సరాల నాటి ఓ మహా వృక్షాన్ని పెకిలించాడు. భూమి దద్ద్దరిల్లింది. ఆకాశము ఉరిమింది...సమస్త ప్రాణులు మూర్చిల్లాయి. ఆ మహా వృక్షాన్ని ఖడ్గంగా మార్చి....ఆ రాక్షసుడిని సంహరించాడు.
మాహామాన్వి అనే మహా వృక్షం, మహా విష్ణువు చేతిలో ఖడ్గమైంది. ఆ పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకునే మునికి ఆ ఖడ్గం కాపాడే భాద్యత అప్పగించాడు. అది తరాలు మారి, మా వంశానికి ఆ దేవుడి ప్రసాదంగా లభించింది.
తాళపత్ర గ్రంథాల ద్వారా తెలిసిన విషయాలు. ఈ ఖడ్గం ధరించు...ఈ దేశాన్ని, దేశద్రోహ అసురులను సంహరించడాని ఈ ఖడ్గాన్ని ఉపయోగించు, ఈ ఖడ్గాన్ని ముందు ఆ తిరుపతి వెంకటేశ్వరుడి పాదాల ముందు ఉంచాలని అనుకున్నాను. నీతో దుష్ట శిక్షణ చేయించడానికే అది వాయిదా పడింది." అంటూ ఖడ్గాన్ని కార్తికేయ చేతిలో పెట్టాడు.
ఒక్కసారిగా కార్తికేయ ఒళ్ళు జలదరించింది.
శరీరంలో వేన వేల మెరుపులు ప్రవేశించిన భావం. ఏదో దివ్యశక్తి తన శరీరాన్ని కవచంలా మార్చిన అనుభూతి. ఆ ఖడ్గం చేతిలోకి తీసుకోగానే తానో రాకుమారుడిగా మారినట్టు....
"కార్తికేయ...ప్రతీ యుగంలో దేవుడు దుష్టశిక్షణ కోసం ఓ అవతారం ఎత్తుతాడు...ఒక్కో ఆయుధాన్ని చేపడతాడు. ఆ దైవాంశ నీలో వుందని నమ్ముతున్నాను...వెళ్ళు కార్తికేయ, రాజ్యలక్ష్మిని కాపాడే తోట రాముడివి నువ్వే..,విజయోస్తు...దీవించాడా కురువృద్ధుడు...
మంత్ర ముగ్దుడిలా....ఆ ఖడ్గాన్ని చేత ధరించాడు.
***************** ********************** ************************************
ఆ క్షణమే కార్తికేయ రంగంలోకి దిగాడు. మోహనకు సంబంధించిన వివరాలు సేకరించడం మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నం లోనే సిక్వీని వెంబడించాడు...అదే సమయంలో సి బి ఐ చీఫ్ ని యాద్రిచ్చికంగా కాపాడాడు. రాష్ట్రపతికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.
*********************** ******************* ********************************
రాధారాణి మొహానికి పట్టిన చెమటను కొంగుతో తుడుచుకుంది. ఏ సీ లోనూ చెమటలు. చెమటలు ప్రాణభయంతో కాదు.. మోహన వల్ల ముగ్ధ ప్రాణాలకు ఆపద వాటిల్లుతుందని. అడుగుల శబ్దం...మోహన ఆ గదిలోకి వచ్చింది. రాధారాణి ఎగురుగా కూచుంది .
"చెప్పండి డాక్టర్ ఏం నిర్ణయించుకున్నారు?కోల్ గా అడిగింది.
"ఏం నిర్ణయించుకున్నాను అని చెప్పమంటారు, మిస్ మోహనా? ప్లాస్టిక్ సర్జరీ అంటే మీకు పిల్లలు ఆడుకునే ఆట అనుకుంటున్నారా? రాధారాణి అడిగింది.
"ఆఫ్ కోర్స్ ...కానీ మీ దృష్టిలో ఆదే...మీ ప్రతిభ ప్రపంచానికి తెలుసు...ప్రపంచంలోని టాప్ వన్ హెల్త్ జర్నల్స్ మీ గురించి రాసిన ఆర్టికక్ల్స్... ఆఅని ఆ జర్నల్స్ ను రాధారాణి చేతికి ఇచ్చింది.
"మాకు కొన్ని ఎథిక్స్ వుంటాయి?
"మాకు ఎథిక్స్, మోరల్ వాల్యూస్ ఏమీ వుండవు...నా చేతిలో వుండే రివాల్వర్ కు దయాదాక్షిణ్యాలు అసలే వుండవు..."
" వాడ్డూ యూ మీన్"
"ఐ మీన్ వాట్ ఐ సే"...మీరు ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయకపోతే, నా ప్రాణాలు రక్షించుకోవడం కోసం, ఎందరి ప్రాణాలు అయినా తీస్తాను. ఒక విషయం కన్ ఫర్మ్ గా చెప్పగలను...ఒక అమెచ్యూర్డ్ సర్జన్ తో ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాను...
అని ఆగి నాకు కాదు...ముగ్ధకు..."
"ఆర్యూ మ్యాడ్ ...అలా చేస్తే ఆమె ప్రాణాలకు ముప్పు..." కోపంగా అంది రాధారాణి.
"ఆఫ్ కోర్స్ ...నాకు ఇలాంటివి సరదా...ముప్పు నా ప్రాణాలకు కాదు కదా...ఎడారి ప్రాంతంలో కొందరు షేక్ లు ఒంటెలకు పసిపిల్లలను కట్టేసి, ఒంటెలు పరుగెడుతూ వుంటే పిల్లలు భయంతో ఏడుస్తూ వుంటే వాహ్..వాహ్..అని ఎంజాయ్ చేస్తారు....నేనూ అదే టైపు...."
రాధారాణి మౌనంగా ఉండిపోయింది...మోహన చెప్పినట్టు చేయకపోతే...ముగ్ధ ప్రాణాలకు ముప్పు....మోహనకు మత్తు ఇచ్చి..."
"రాధారాణి గారూ..ఒక వేళ మీరు ఈ సర్జరీకి ఒప్పుకుని, మీ డాక్టర్ తెలివితేటలతో, నన్ను కోమాలోకి పంపించే ప్రయత్నం చేయాలనుకున్నా కుదరదు.... మీ సర్జరీని మత్తు లేకుండా చూస్తాను...ఆపరేషన్ థియేటర్ లోని సర్జరీ సి సి కెమెరాల ద్వారా మా వాళ్ళు వాచ్ చేస్తూనే వుంటారు."
రాధారాణి నిస్తేజమైంది...ఒకే ఒక మార్గం సర్జరీ...
"సర్జరీకి ఇక్కడ సాధ్యపడదు...సర్జరీకి కావలసిన...." ఆమె చెప్పడం పూర్తీ కాక ముందే ..
"సాధ్యపడుతుంది డాక్టర్...
అంటూ ఆమె ఎదురుగా వున్నా కర్టెన్ లాగింది. ఒక స్టార్ హాస్పిటల్ లో వున్న సౌకర్యాలు...
మీ సర్జరీకి కావలసిన సహాయకులు...డాక్టర్స్...అంటూ తల తిప్పి చూసింది. మోహన వెనుక ఇద్దరు డాక్టర్స్...మొహానికి ముసుగులు....
"వీళ్ళని మీలా కిడ్నాప్ చేసి తీసుకు రాలేదు...డబ్బిచ్చి తీసుకు వచ్చాను. ప్రపంచంలో అంతా మీలాంటి మంచివాళ్ళు వుంటే మా లాంటి విలన్స్ పరిస్థితి ఏమిటి? నవ్వి అంది.
ఆ నవ్వులో అతి భయంకరమైన కాలకూట సర్పం బుస వినిపించింది.
(ఆ తర్వాత ఏమైంది? రేపటి సంచికలో)

No comments:
Post a Comment