ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

"ముగ్ధమోహనం" (Chapter---40)
(06-03-2013)
.......................... అటెన్షన్ ప్లీజ్.........................
(మీ అనూహ్యమైన స్పందనలో తడిసి ముద్దవుతోన్న ""ముగ్ధమోహనం"" మార్చి చివరి వారంలో పుస్తక రూపంలో మీ ముందుకు వస్తుంది. ఈసీరియల్ ముగింపు ఎలా వుంటుంది...? ఆ ముగింపు మీరే రచయిత స్థానంలో వుండి రాయండి. మీ ముగింపు రచయిత విసురజ ముగింపు ఒకటే అయితే "అక్షరాల వెయ్యి నూట పదహార్లు " (Rs 1116/-.) బహుమతి ప్లస్ రచయిత ఆటోగ్రాఫ్ తో కూడిన పుస్తకం. రచయిత ముగింపుకు దగ్గరగా వున్న వాటికి ముగ్ధమోహనం పుస్తకాలు గిఫ్ట్ గా అందించబడుతాయి.
మీ ముగింపు చేరవలిసిన చివరి తేదీ మార్చ్ 15,2013...మా మెయిల్ ఐడి..manrobocreations@gmail.com)
******************************************************* *********************************
దేవుడు మనిషికి ఇచ్చిన ఆయుష్షు వందేళ్ళు. ప్రపంచ జనాభాలో పది శాతం మంది కూడా వందేళ్ళు దాటి, కనీసం
వందేళ్ళు బ్రతికిన దాఖలాలు లేవు. అనారోగ్యం, ప్రమాదం, హత్యలు...ఇలా ఏవో కారణాలతో చిన్న వయసులోనే చస్తున్నారు.
ఒత్తిడి, డబ్బు మీద ఆశతో రాత్రింబవళ్ళు కష్టపడి జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోతున్నారు.
కొందరు స్వార్ధపరులు డబ్బు కోసం ఇతరులకు హాని చేయడానికి కూడ సిద్ధపడుతున్నారు. మోహనకు, వారికి తేడా లేదు.
ఈ మనుష్యులు ఎటు పోతున్నారు. వీళ్ళు ఎంత కాలం బ్రతుకుతారు?
రాధారాణి ఆ డాక్టర్స్ వంక చూసింది. ఆమె వైపు చూసే ధైర్యం లేని ఆ డాక్టర్స్ తలలు వంచుకున్నారు.
*********************** ***************************** ************************
మోహన ఆ డాక్టర్స్ ని వెళ్ళమన్నట్టు సైగ చేసింది. వాళ్ళు వెళ్ళిపోయారు.
"థాంక్యూ రాధారాణి గారు...నాకు పెద్ద శ్రమ లేకుండా చేసారు. మరో విషయం..మీరు మీ వాళ్లకు ఫోన్ చేసి మీ గురించి కంగారు పడవద్దని చెప్పండి " మోహన చెప్పింది.
అప్పుడే మోహన సెల్ రింగ్ అయింది.
"మామిడి పళ్లు ఈ సీజన్లో దొరుకుతాయా?
అటువైపు నుంచి వినిపించింది.
"ఈ సీజన్లోనే దొరుకుతాయి" మోహన చెప్పింది.
"మోహనా జీ నేను ఢిల్లీ వచ్చాను. కార్తికేయ మన కోసం పులిలా మీద పడడానికి సిద్ధంగా వున్నాడు "
"ఖాసింజీ మీరు కంగారు పడకండి. ప్రపంచంలోనే టాప్ ఫైవ్ తీవ్రవాద సంస్థల్లో ఒకటైన ముఖైదా సంస్థకు మీరు సుప్రీం...మీరిలా కంగారుపడితే ఎలా? కూల్ గా అంది మోహన.
కార్తికేయ గురించి మీకు బాగా తెలుసు....మరో పక్క రాబర్ట్ మీ కోసం వేట కుక్కలా తిరుగుతున్నాడు." ఖాసిం చెప్పాడు.
"రాబర్ట్ ఈ లోకం నుంచి నిష్క్రమించి ఇరవై నాలు గంటలు అయింది. గుర్తుపట్టడానికి వీల్లేకుండా కాలిపోయింది. మార్చురీలో వుంది...రాబర్ట్ డెడ్ బాడీ కార్తికేయకు వార్నింగ్ లాంటిది ..
నేను త్వరలో ఢిల్లీ వస్తాను...మోహనగా కాదు...ముగ్ధగా బై ఖాసిం జీ" ఫోన్ కట్ చేసింది.
మోహనకు రాబర్ట్ గుర్తొచ్చాడు...అతడిని తనెలా ట్రాప్ చేసిందో గుర్తొచ్చింది. ఇరవై అయిదు గంటల క్రితం...
************************** ************************* **************************
హోటల్ వ్యూ ....
థర్డ్ ఫ్లోర్ లో సూట్ నంబర్ ఫైవ్...
గ్లాసెస్ నుంచి సిటీ కనిపిస్తుంది. అంత కన్నా మోహన వుండే బిల్డింగ్ కనిపిస్తుంది. మొహనను వెతుక్కుంటూ వచ్చిన రాబర్ట్ కు ఓ దశలో మోహనను దగ్గరి నుంచి షూట్ చేసే అవకాశం వచ్చింది.
కానీ మోహనను బంధించి, తానేమిటో చెప్పి, తమ ఏజెంట్స్ ని చంపినందుకు చిత్రహింసలు పెట్టి చంపాలి...దాన్ని వీడియో తీయాలి....అంత కసిగా వున్నాడు.
రెండు రోజులుగా మోహనను గమనిస్తున్నాడు. మోహన ఓ డాక్టర్ ని కిడ్నాప్ చేయడం చూసాడు..మోహనకి ఆ అవసరం ఎందుకు వచ్చిందో అర్ధం కాలేదు.
ముందు ఫ్రెష్ అవ్వాలి...బాత్ రూం వైపు నడిచాడు. నైట్ డ్రెస్ విప్పాడు..అప్పటికే టబ్ లో నీళ్ళు ముప్పావు వంతు వచ్చేసాయి....సన్నగా పొగలు కక్కుతున్న నీళ్ళు...టబ్ లో పడుకున్నాడు....క్షణం లో వెయ్యో వంతు ...అరవడానికి కూడా అవకాశం లేనంత ....రాబర్ట్ శరీరం నిప్పుల్లో కాలిపోతున్నట్టు...
టబ్ లో వున్నవి వేడి నీళ్ళు కాదని యాసిడ్ అని అతనికి అర్ధమయ్యేలోగా శరీరం కాలిపోయింది.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగాక బిన్ లాడెన్ ని వెంటాడి, బిన్ లాడెన్ చేసిన తప్పుకు ఏ తప్పూ చేయని అతని అనుచరుల భార్యలను, తీవ్రవాదులను ఘోరంగా టార్చర్ చేసి, వారిని నగ్నంగా హింసించిన రాబర్ట్ చరిత్ర ఆ విధంగా ముగిసిపోయింది.
ఆ సూట్ లో వున్నా మరో ద్వారం గుండా వచ్చింది మోహన. ఆమె చేతిలో బొకే...బాత్ టబ్ లో కాలిన రాబర్ట్ దేహం వైపు చూసి టబ్ కు తల వైపు బొకే పెట్టి, శత్రువు దొరకగానే చంపేయక కాలయాపన చేయడం నువ్వు చేసిన పెద్ద మిస్టేక్ మిస్టర్ రాబర్ట్, గుడ్ భై..." వెనుతిరిగింది మోహన.
ఆ హోటల్ లో ఈ పనికి సహకరించి..టబ్ లో యాసిడ్ వచ్చేలా ప్లాన్ చేసిన, ఈ పనికి సహకరించిన వారికి భారీగా డబ్బు ముట్టజేప్పింది. వేరే దేశానికి పంపేసింది.
రాబర్ట్ డెడ్ బాడీ
అన్ ఐడెంటిఫైడ్ బాడీగా ఢిల్లీ చేరింది ...
**************** ************************** **************************
రాష్ట్రపతి భవన్...కార్తికేయ, రాష్ట్రపతి ఇద్దరు మాత్రమే అక్కడ వున్నారు.
అమెరికా నుంచి వచ్చిన రాబర్ట్ ని మోహన చంపేసింది....ఆతను రహస్యంగా ఇండియా వచ్చాడు మోహన కోసం...తనే మోహనను పట్టుకోవాలని ఆ క్రెడిట్ తనకే దక్కాలని, మనకు సమాచారం కూడా ఇవ్వలేదు. అతని డెడ్ బాడీ మార్చూరిలో వుంది.
మరో ముఖ్యమైన విషయం...అంతర్జాతీయ తీవ్రవాది ఖాసిం ఇండియా వచ్చాడు...రాష్ట్రపతి తెలిపారు.
ఖాసిం ఇక్కడికి వచ్చాడంటే పెద్ద ప్లాన్ తోటే వచ్చి ఉంటాడు, కార్తికేయ అన్నాడు.
ఆ సమయంలో ఖాసిం ఢిల్లీ లోని ఓ మామూలు హోటల్ లో రామ్ గోపాల్ వర్మ 26/11 సినిమా పైరేటెడ్ కాసేట్ డి వి డి ప్లేయర్ లో చూస్తున్నాడు.
(వాట్ నెక్స్ట్..రేపటి సంచికలో)

No comments: