ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 23 March 2013

కవిత: మతమా..మతిలేనితనమా
.............
ఉన్మాదుల దాడిలో భీతిల్లే భాగ్యనగరం
ఛాంధసుల చేష్టలతో విస్తుపోయే జనం
...............................................
మతదురాభిమానమే మతమై అభిమతమై
సావాసమే బరువై సహనమే కరువై
ప్రాణమే ఖర్చై రుధిరమే ప్రియమై
ముష్కురులు తెగపడి అసురులైనవేళ
మానవత్వాన్నికసి తీరా నరికిన వేళ
....................................
ఉన్మాదుల దాడిలో భీతిల్లే భాగ్యనగరం
ఛాంధసుల చేష్టలతో విస్తుపోయే వెర్రి జనం
..............................................
క్షతగాత్రుల వైద్యంకై అర్దింపు ఆర్తనాదాలక్కడే
విగతజీవుల తెగిపడిన శరీర విడి భాగాలక్కడే
వ్యధచెందిన హృదయంతో రోధించే వారక్కడే
కష్టాలలో మేమున్నామంటూ తోడ్పడే వాళ్ళక్కడే
....................................................
ఉన్మాదుల దాడిలో భీతిల్లే భాగ్యనగరం
ఛాంధసుల చేష్టలతో విస్తుపోయే వెర్రి జనం
.................................
సమాజ సైతానుల్లార సద్బుద్ధికి శత్రువులార
మతసామరస్య పల్లకీకి మీ వల్ల హానీ నష్టం జరగదురా
అందమైన జీవితాన్ని అజ్ఞ్యానుల్లారా అన్యాయం చేసుకోకురా
భావితరం భాగ్యంగా నిన్ను తలచుకుని నీ పేరు చెప్పుకోవాలిరా
...
విసురజ

No comments: