ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 27 March 2013

Chapter:51

పూజగదిలోకి అడుగు పెట్టాడు కార్తికేయ.ఒక దివ్యత్వం ఆ గదిని దేవలోకం గా మార్చినట్టు...మహాద్వారాలు తెరుచుకుంటున్నట్టు .....
శాంతాకారం ,భుజగశయనం....పద్మనాభం...
పూజగదిలో మహా మహిమాన్వితమైన మాన్వి ఖడ్గం ....శత్రు సంహారానికి ఆయత్తమైనట్టు....
రెండు చేతులు జోడించాడు కార్తికేయ.
"దేవుడా...నువ్వున్నావని,నీ ఉనికి నిజమని,శిష్ట రక్షణకు,దుష్ట శిక్షణకు అవతరిస్తావని నమ్మే వారి కోసం...ధర్మ సంస్థాపన కోసం మళ్ళీ  అవతరించు..."
ఆ ఖడ్గం లోని దివ్య శక్తి కార్తికేయలోకి ప్రవేశించినట్టుగా చిన్న గగుర్పాటు.
                              *********************************
పార్లమెంట్ కు కూతవేటు దూరం లో నలుగురు వ్యక్తులు కలుసుకున్నారు.ఒకతను చిత్తుకాగితాలు ఏరుకునేవాడి వేషం లో,మరొకతను ముంతకింద పప్పు అమ్ముకునే వాడు,ఇంకోతను ఫ్లాస్క్ లో టీ అమ్ముకునే వాడు...నాలుగో అతను ముష్టివాడు...
ఈ నలుగురూ ఒక్క దగ్గర చేరారు...అప్పుడప్పుడు ఎవరి పని వారు చేస్తున్నారు.చిత్తూ కాగితాలు ఏరుకుంటూనే మాట్లాడుతున్నాడు.అతని పేరు యాహ్యాఖాన్...భారత భూబాగం లోకి చొచ్చుకు వచ్చి భారత జవానులను దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేసి భారత జవాన్ల విశ్వరూపం చూసి పారిపోయాడు.
కరుడు గట్టిన ఉగ్రవాది....  రెండో అతను ఒకప్పుడు ఉగ్రవాద సంస్థల్లో పనిచేసి...అక్కడ ఆయుధాలు దొంగిలించి పారిపోయాడు. మూడో అతను  బాంబులను అమర్చడం లో ఎక్స్ర్ పర్ట్ ..నాలుగో వ్యక్తీ ఖాసిం...
                                  ***********************************

ముగ్గిరి వంక చూసి చెప్పాడు  .ఖాసిం .."మనం చాలా కేర్ ఫుల్ గా వుండాలి...ఇండియన్ పోలీస్ ని ,ఢిల్లీ పోలీస్ ని తక్కువ అంచనా వేయకూడదు...ఇప్పటి వరకూ అవినీతి పరుల లిస్టు లో వున్న ఎంపీ లు ఎవరనేది ఆరా తీయాలి...డబ్బుతో, వాళ్ళని కోనేయాలి...ఎవరు ఎలా మన దారికి వస్తారో అలా వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి...ఢిల్లీ నగరం బాంబుల మోతతో దద్దరిల్లి పోవాలి...ప్రతి పక్ష ఎంపీలు ప్రభుత్వం మీద విరుచుకు పడాలి...అదే సమయం లో హైదరాబాద్,చెన్నై,ముంబై,బెంగుళూర్ లలో బాంబ్ బ్లాస్ట్ లు జరగాలి...ఒక చోట పరిశోదన పూర్తికాకుండానే పోలీసులను మరో చోటికి పరుగెత్తించెలా  చేయాలి.
దేశం అల్లకల్లోలం కావాలి..రాష్ట్రపతి పాలన వచ్చేలా చేయాలి...
అదే సమయం లో ...
భారత రాష్ట్రపతిని...దేశ ప్రథమ పౌరుడిని...ఇద్దరు దేశప్రధానులను ఎలా ఈ లోకం నుంచి పంపించేసామో...అలా...
మిగితా ముగ్గురు ఒక్క క్షణం వణికిపోయారు....ఇది సాదా సీదా విషయం కాదు...కసబ్ వురి కళ్ళ ముందు కనబడుతూనే వుంది.
"ఇది..ఇది సాధ్యమయ్యే విషయమేనా ? యాహ్యాఖాన్ అడిగాడు తడారిన గొంతును తడుపుకుంటూ...
"సాధ్యం చేయాలి...ఇది మోహన మేడం స్కెచ్...ఎక్కడ ఫెయిల్ అవ్వడానికి అవకాశం లేదు."
అని ఆగి ...
"మనం అనుకున్నది అనుకున్నట్టు పూర్తయితే...ఈ దేశానికి రూలర్  .మో...హ...న...జీ "
మిగితా ముగ్గురు మౌనం గా వుండిపోయారు...కొద్ది సేపు ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నట్టు నటించారు....
"ఇంతకీ  ...మోహన జీ ఢిల్లీ ఎప్పుడొస్తున్నారు ? ముగ్గురూ అడిగారు.
"ఈ పాటికి ఢిల్లీ లో అడుగు పెట్టి వుండాలి."ఖాసిం చెప్పాడు.
                                  *************************
ఢిల్లీ రైల్వే స్టేషన్ ....
హైదరాబాద్ నుంచి  వచ్చిన రైలు ఢిల్లీ స్టేషన్ లో ఆగింది.దిక్కులు చూస్తూ దిగింది ఆ అమ్మాయి.కొంగును భుజాల మీదుగా కప్పుకుంది..మొహమంతా చెమట పట్టి వుంది.చేతిలో ఏమీ లేదు...భయం భయం గా చూస్తుంది.
"ముగ్దా ..."
ఆ పిలుపు వినగానే తల తిప్పి చూసింది...తన వెనుకే కార్తికేయ....కొద్ది క్షణాలు అలానే చూస్తోండిపోయింది. 

తన వైపు పిచ్చి చూపులు చూస్తోన్న ముగ్ధను చూసి షాకయ్యాడు. "ముగ్దా ఆర్యూ ఆల్ రైట్..."ముగ్ధ భుజాలు పట్టుకుని అడిగాడు.వెంటనే కార్తికేయను చుట్టేసి వెక్కి వెక్కి ఏడ్చేసింది.అది రైల్వే స్టేషన్ అన్న విషయం కూడా విస్మరించింది.


కార్తికేయ ఆమె వేదన ను ఆపే ప్రయత్నం చేయలేదు.ముగ్ధ తప్పించుకోవడం...హైదరాబాద్ నుంచి ఫోన్ చేయడం...తను ఢిల్లీ వస్తున్నానని చెప్పడం...అన్నే గుర్తొచ్చాయి.


"మనింటికి వెళ్దాం పద..."ఆమె భుజాల చుట్టూ చేయి వేసి నడిపించుకుంటూ కారు దగ్గరికి తీసుకు వచ్చాడు.


                                       ******************************


సోఫాలో కూచున్నాడు కార్తికేయ...నేల మీద కూచోని తలను కార్తికేయ ఒడిలో పెట్టి అలానే ఉండిపోయింది.

కార్తికేయ ముగ్ధ తల మీద చేయి వేసాడు.

"నాకు నాకెంత భయమేసిందో తెలుసా,,,మిమ్మల్ని చూడకుండానే చచ్చిపోతానేమో అనిపించింది."గట్టిగా పట్టేసుకుంది కార్తికేయను.



అనునయం గా ఆమె తల మీద చేయి వేసి "నేనున్నానుగా "అన్నాడు. ఆ చేతిని అలానే చేతిలోకి తీసుకుని పెదవులకు ఆన్చుకుంది ముగ్ధ.

"నాన్న గారు ఎలా వున్నారో ? అక్కడికి వెళ్ళాలంటేనే భయమేస్తోంది."ముగ్ధ అంది.

"నాన్న గారిని,మీ తమ్ముడిని మీ ఫ్రెండ్ పూర్ణిమ చూసుకుంటుంది.నువ్వేమీ కంగారు పడకు "అన్నాడు కార్తికేయ,

"ఇది ఇదంతా ఏమిటి ?నా మీద ఎవరి పగ ? అసలు నేనేం చేసాను ?

"ఇది యుద్ధం ముగ్దా...ఈ యుద్ధం లో నిన్నో అస్త్రం గా వాడుకోవాలని చూసారు...నువ్వేమీ భయపడకు..మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావా ?

"ఫ్రెండ్ ...ఎవరు ?

"మీ ఢిల్లీ ఫ్రెండ్...నువ్వు...నేను ఈ రోజు ఇలా కలవడానికి కారణమైన ఫ్రెండ్ ...అప్పుడే మర్చిపోయావా ?కార్తికేయ నవ్వుతూ అడిగాడు.

"లేదు..ఇప్పుడు నాకు ఎవరినీ కలవాలని లేదు..."అతని ఒడిలో తల పెట్టి కళ్ళు మూసుకుంది.

                                         ***************************

కార్తికేయ ముగ్ధ ఇంటికి ఫోన్ చేసాడు....తండ్రితో,తమ్ముడితో,పూర్ణిమ తో మాట్లాడింది.

"ముగ్దా నువ్వు కార్తికేయ గారి దగ్గరే వుండు...సమస్యలు సాల్వ్ అయ్యాక వద్దువు కానీ...నాన్న గారి గురించి కంగారుపడకు...నేను చూసుకుంటాను "

"నీకు నీకెలా కృతఙ్ఞతలు చెప్పాలో అర్ధం కావడం లేదు "ముగ్ధ అంది.

"ఏయ్...మన మధ్య కృతఙ్ఞతలు ఏమిటి ? నీకేనా నాకు నాన్న కారా ? పూర్ణిమ అంది.

                                      *********************

శ్రీనివాస్ దగ్గరి నుంచి కార్తికేయ కు ఫోన్ వచ్చింది.

"కార్తికేయ గారు...మోహన హైదరాబాద్ లో లేదు...జర్దార్ కూడా కనిపించడం లేదు...బహుశా ఢిల్లీ కి మకాం మార్చారని డౌట్...."ముగ్ధ తప్పించుకుని ఢిల్లీ వచ్చిన విషయం తెలిసాక చెప్పాడు శ్రీనివాస్.

                                    ******************

పాత ఢిల్లీ లోని జస్పాల్ స్ట్రీట్  లో... ఓ పాడుబడిన భవనం లో ...అలికిడి మొదలైంది.

(ఆ పాడుబడిన భవనం లో ఉంటున్నది ఎవరు ? ఎవరెవరు ?గెస్ చేయగలిగితే...మాకు మెయిల్ చేయండి .ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల లోపు...)

No comments: