ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 27 March 2013

Chapter:53

హోటల్ రెడ్ వ్యూ ...
ఆరవ అంతస్థులో రూం నంబర్ ఆరు వందల పదమూడు....
జర్దార్ లిఫ్ట్ ఉందన్న విషయం మర్చిపోయి....మెట్ల మీదుగా పైకి వగరుస్తూ వచ్చాడు.ముంబై పోలీసులు అన్నా భయం లేదు...కానీ కార్తికేయ అంటే అతనికి ఒంట్లో చెమటలు పుడతాయి. మోహన మేడం మరీ మరీ చెప్పింది కార్తికేయ విషయం లో కేర్ ఫుల్ గా ఉండమని.ఇప్పుడు తనేం చేయాలి ?మోహన మేడం కు ఫోన్ చేయడానికి వీల్లేదు...తను చేసే వరకు తనకు ఎవరూ ఫోన్ చేయకూడదని స్ట్రిక్ట్ గా చెప్పింది.కార్తికేయ అసాధ్యుడు...అతను ఇక్కడికి వచ్చేలోగా తను తప్పించుకోవాలి.
                            **********************
కార్తికేయ హోటల్ రెడ్ వ్యూ దగ్గరికి  వచ్చాడు...జర్దార్ తన అసలు  పేరుతొ రూం బుక్ చేయడని తెలుసు.... సింగల్ గా హోటల్ లో దిగిన వారి వివరాలు సేకరించాడు.ఆ హోటల్ లో సి సి కెమెరా లు అడుగడుగునా వున్నాయి. హోటల్ గదుల్లో మినహాయించి.....ఆ విషయాన్ని కార్తికేయ నోటీసు చేసాడు.
హోటల్ చుట్టూ పరిశీలించాడు...జర్దార్ ఎటువైపు నుంచి పారిపోయే అవకాశాలు వున్నాయో చెక్ చేసాడు.
     జర్దార్ ని పట్టుకోవాలంటే ఒకే ఒక మార్గం.హోటల్ లో వున్నా పబ్లిక్ అడ్రెస్ సిస్టం దగ్గరికి వెళ్ళాడు. స్పెషల్ అనౌన్సు మెంట్  చేయించాడు. " ముంబై బాంబ్ బ్లాస్ట్ తో సంబంధం వున్న క్రిమినల్ మన హోటల్ లోకి ప్రవేశించినట్టు నిఘావర్గాలు కనిపెట్టాయి.మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం...దయచేసి ఎవరూ...మీ మీ గదుల్లో నుంచి బయటకు రావద్దు...పోలీసులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సహకరించండి."
హోటల్ మొత్తం మార్మోగింది.పుట్టలో వున్న పామును బయటకు రప్పించే ప్రయత్నం....ఖచ్చితం గా జర్దార్ పుట్టలో (గదిలో ) నుంచి బయటకు రాక తప్పదు.
                                            *******************************************
కార్తికేయ అనుమానం నిజమైంది.హోటల్ లో వున్న జర్దార్ ఈ అనౌన్సు మెంట్ వినగానే ఖంగు తిన్నాడు.ఇప్పుడు కార్తికేయ ప్రతీ గది వెతుకుతాడు....తను దొరుకుతాడు...దానికన్నా ముందే తను పారిపోవాలి.ముఖ్యమైనవి ఎయిర్ బ్యాగ్ లో సర్దుకున్నాడు.అత్యవసర్ సమయం లో మింగాల్సిన సైనేడ్ పిల్ తో సహా....రూం లో నుంచి బయటకు వచ్చాడు.
                                       *****************************
ఎంత తెలివైన నేరస్తుడైనా ఎక్కడో తప్పటడుగు వేస్తాడు. కార్తికేయ సి సి కెమెరాల వైపే చూస్తున్నాడు...చాలా స్క్రీన్స్ వున్నాయి....హోటల్ కు వచ్చిన వాళ్ళు అనౌన్సు మెంట్ తర్వాత బయటకు రాలేదు...అలా వచ్చిన వ్యక్తి జర్దార్ మాత్రమే..ఆరవ అంతస్తులో నుంచి తన గది వెనుక వైపు నుంచి పైపు ద్వారా కిందికి దిగుతున్నాడు.
అటువైపు వెళ్ళాలంటే దారి ఏది ?అడిగాడు కార్తికేయ...
"కిచెన్ సెక్షన్ కు వెళ్తుంది సర్.."అంటూ తను కార్తికేయకు దారి చూపించాడు మేనేజర్.
"థాంక్యూ సర్...మా హోటల్ పరువు పోకుండా ఏ...మాత్రం గొడవ జరక్కుండా డీల్ చేసారు "మేనేజర్ అన్నాడు.
"ఇట్స్ ఓకే...కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి....హోటల్ లో దిగే వారి పట్ల చాలా జాగ్రత్తగా వుండండి.ఏ మాత్రం అనుమానం కలిగినా వాచ్ చేయండి."చెప్పాడు కార్తికేయ .
"తప్పకుండా సర్.."అని కిచెన్ సెక్షన్ దగ్గర ఆగి....దీని వెనుక వైపుకు ఆ పైపు వుంది సర్ "చెప్పాడు.
"ఓకే మీరు వెళ్ళండి ....మీ హోటల్లోని కస్టమర్స్ కు మీరు కలిగించిన స్వల్ప అసౌకర్యానికి సారీ డ్రింక్స్ అందజేయండి.నేరస్తుడు దొరికాడు ."అని చెప్పండి.అంటూ వెనుక వైపుకు నడిచాడు.
                                           *******************************
జర్దార్ జాగ్రత్తగా దిగాడు..చేతులు మంట పుడుతున్నాయి.ఎయిర్ బాగ్ ని భుజం నుంచి మార్చుకున్నాడు.చుట్టూ చూసి ఊపిరి పీల్చుకుని ఒకడుగు ముందుకు వేసాడు...
"హలో ఫ్రెండ్ హౌ ఆర్యూ "
ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు జర్దార్....ఎదురుగా యమపాశానికి బదులు రివాల్వర్ పట్టుకున్న యమధర్మరాజు లా కార్తికేయ...
"అదేంటి ఫ్రెండ్ .లిఫ్ట్ వుంది...మెట్లు వున్నాయి....ఇంత కష్టపడి పైపు ద్వారా పాక్కుంటూ ...మరీ సినిమాలు ఎక్కువగా చూడొద్దు...ఓకే ...మనమలా నడుచుకుంటూ మాట్లాడుకుందామా?రివాల్వర్ని జర్దార్ కణతకు గురి పెట్టి అన్నాడు.
జర్దార్ ఊపిరి బిగపట్టాడు...అయిపొయింది..తను ఏదైతే జరగకూడదని అనుకున్నాడో...అదే జరిగింది.
అతని చేయి సైనేడ్ పిల్ కోసం వెతుకుతుంది.
"ఆగాగు ఫ్రెండ్ సైనేడ్  పిల్ అవసరాన్ నీకు రాదు.."అంటూ అతని మేడలో వున్న దారం లాంటి దాన్ని లాగాడు...దానికి సైనేడ్ పిల్ వుంది.
హోటల్ రిసెప్షన్ కు ఫోన్ చేసాడు."రూం నంబర్ ఆరువందల పదమూడు చెకవుట్ టైం ఎప్పుడు ?అని అడిగాడు.
"ఇంకా వన్ హౌర్ టైం వుంది సర్...గ్రేస్ కూడా వుంటుంది..."కార్తికేయ గొంతు గుర్తు పట్టి చెప్పాడు.
"వెరీ గుడ్...తినడానికి ఏమైనా స్నాక్స్ పంపించండి....ఈ రూం లోని కస్టమర్ ఏం తింటాడో రూం సర్వీస్ కు బాగా తెలుసు...నాకు మాత్రం ఒక వేడి వేడి ఫిల్టర్ కాఫీ ...ఆ బిల్ నాకు సెపరేట్ గా పంపించండి "అని ఫోన్ పెట్టేసాడు.
                                       *******************************************
రూం నంబర్ ఆరు వందల పదమూడు...
"భూమి గుండ్రం గా వుంటుంది జర్దార్...మళ్ళీ నీ గదిలోకే వచ్చావు...సరే...ఇప్పుడు చెప్పు...ఇంకా ఎక్కడెక్కడ బాంబులు పెడుతున్నారు?
"బాంబులా  ? బాంబులేమిటి?? రెక్ లెస్ గా అన్నాడు...జర్దార్.
కార్తికేయ లేచాడు..కుర్చీ కి తాళ్ళతో కట్టేశాడు కార్తికేయ...
టీవీ దగ్గరికి వచ్చాడు...అక్కడ డి వి డి ప్లేయర్ వుంది.తన చేతిలో వున్న డి వి డి ని ఆ ప్లేయర్ లో పెట్టాడు..
"జర్దార్ ఇందాక బాంబ్ బ్లాస్ట్ కేసు లో సినిమా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనో డి వి డి ఇచ్చాడు.మాంచి సినిమా అని చెప్పాడు...సెంటిమెంట్ సినిమా...టైం పాస్ కోసం తీసుకువచ్చాను."
జర్దార్ కు  ఏదో అనుమానం...
                                                 ************************
స్క్రీన్ మీద దృశ్యం  మొదలైంది.ఏడేళ్ళ పిల్లడు .పోలియో తో వున్నాడు..ఆ పిలది వెనుక గోడకు తగిలించిన ఫోటోలో తండ్రీకొడుకుల ఫోటో...తండ్రి స్థానం లో జర్దార్...
"జర్దార్ సెంటిమెంట్ లేని మనిషి,మెదడు లేని రోబో ఒక్కటే....నీకు ఏడేళ్ళ క్రితం పెళ్లయింది.నీ భార్యను అనుమానం తో చంపేసావు...నీకో కొడుకు..వాడంటే ప్రాణం...కాశ్మీర్ లో వుంచి చదివిస్తున్నావ్...నువ్వు చేసిన పాపాలకు వాడికి శిక్ష పడింది.పోలియో తో బాధ పడుతున్నాడు.మరో రెండు రోజుల్లో వాడికి ఆపరేషన్...నాకూ నీలా కొన్ని సార్లు సెంటిమెంట్స్ వుండవు...నువ్వు నిజం చెబితే నీ బిడ్డ ఆపరేషన్ నేను చేయిస్తాను..లేదా నువ్వు ఎక్కడైతే బాంబులు పెడతావో ఆ ప్లేస్ లో నీ బిడ్డను వదిలేస్తాను.సింపుల్ "
"వద్ద్యు..నా బిడ్డను చంపొద్దు...మీకేం కావాలో అడగండి " జర్దార్ భయం తో వణికిపోయాడు.
"గుడ్...బాంబులు ఎక్కడెక్కడ పెట్టారు? మీ స్కెచ్ ఏమిటి ?
జర్దార్ చెప్పడం మొదలు పెట్టాడు....నిమిషాలు గడుస్తున్నాయి.అతను చెబుతోన్న విషయాలు వింటూ వుంటే తల తిరిగిపోతోంది.
"చివరి ప్రశ్న ..ముగ్ధ ను ఎక్కడ బంధించారు?

No comments: