Chapter:52
ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలని పరితపించిన వాళ్ళు సమాధుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలని పరితపించిన వాళ్ళు సమాధుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
రాజ్యకాంక్షతో
విర్రవీగిన నియంతలు కాలగర్భం లో కలిసిపోయారు.రక్తపాతాన్ని సృష్టించిన
ముష్కరులు మట్టిలో కలిసిపోయారు..ఆరడుగుల నేలలో...చరిత్ర
హీనులుగా మిగిలి పోయారు.
ఒక విధ్వంస రచనకు పథక రచన మొదలైంది. ఇది సూర్యోదయం తో మొదలై,సూర్యాస్తమయం తో ముగిసే ధర్మయుద్ధం కాదు...రాక్షస యుద్ధం...అసురనీతి
ఇక్కడ వికృత క్రీడ గా మారింది.
కార్తికేయ ...
ఈ యుద్ధంలో ఒకడే ఒక్కడు..వన్ మేన్ ఆర్మీ... అతడే కృష్ణుడు...అతడే అర్జునుడు...భీష్మ,ద్రోణాది వీరులూ అతనే...
అతని చేతిలోని మహామాన్వి ప్రళయకాళ ఘోషతో...పర్జ్యన శంఖం పూరిస్తుంది.
***************************
వాణిజ్య
నగరం...బాలీ వుడ్ బాద్ షాల చిరునామా...డబ్బావాలాల జీవితాల
నుంచి,మురికివాడల బ్రతుకుల నుంచి,నేర ప్రపంచ మాఫియా మహా సామ్రాజ్యాల
నుంచి...బిజినెస్ దిగ్గజాల నుంచి...ఎందరెందరికో చిరునామాగా మారిన ముంబై
నగరం...
అక్కడ సినిమా షూటింగ్...సహజత్వానికి వ్యాపార రంగులు అద్దుతూ పెద్ద హీరో నటించే సినిమాకు క్లయిమాక్స్ సన్నివేశం.
లక్షకు
పైగా జనం...వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్ట్ లు కాదు..కూలి జనం,సినిమాల్లో ఏ
మూలో కనిపించాలని ఆశపడే జనం..ఈ పూటకు ఫుడ్ దొరుకుతుందని అనుకునే
జనం..షూటింగ్ చూడాలని ఆశ పడే జనం...
సినిమాలో
కీలకమైన సన్నివేశం.హీరో ను కోర్ట్ కు తీసుకు రావడం...జనం హీరో కోసం
అక్కడికి రావడం...విలన్ బాంబులతో ఆ జనాన్ని చంపడం..హీరో తిరగబడడం...నాలుగు
వైపులా నాలుగు కెమెరా లు...స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగం రెడీ గా వుంది.
హీరో
వచ్చాడు...అతడిని కోర్ట్ లోపలి తీసుకు వెళ్తున్నారు.విలన్ లు బాంబులు
పెడుతున్నారు.ఈ విలన్ లు మేకప్ లో లేరు...సహజం గానే వున్నారు...విలన్
వేషాలు వేసే ఆర్టిస్ట్ లు ఓ మూలాన స్పృహతప్పి పది వున్నారు...
యాక్షన్....
బాంబులు
పేలాయి...పెద్ద శబ్దం...శరీరాల్లోని భాగాలు గాల్లోకి ఎగిరాయి.మాంసపు
ముద్దలు రక్తం ఒడుతున్నాయి.హాహాకారాలు...షూటింగ్ చూడడానికి వచ్చిన "జనం ఎంత
బాగా వచ్చిందో షాట్
అనుకునేలోగా విషయం అర్ధమైంది.
ఆ
షూటింగ్ స్పాట్ కు కూతవేటు దూరం లో నిజం కోర్ట్ వుంది.అక్కడ బాంబుల దాడి
కేసులోని నిందితుల విచారణ జరుగుతుంది. మరో మార్గం లో తెచ్చుకున్న పర్మిషన్
...
డైరెక్టర్
షాకయ్యాడు...హీరో స్థాణువు అయ్యాడు...ఇది రీల్ లైఫ్ కాదు..రియల్
లైఫ్...రిస్క్ చేసి వాళ్ళను కాపాడలేదు...ఈ లోగా మరో బాంబ్ పేలితే...?
బ్రేకింగ్ న్యూస్...షాకింగ్ న్యూస్...శాడ్ న్యూస్...
*************************
ప్రధాని
హుటాహుటిన ముంబై బయల్గేరాడు..ప్రత్యేక విమానం ప్రధాని నివాసం నుంచి టేకాఫ్
తీసుకునే లోపు ఢిల్లీ విమానాశ్రయం సమీపం లో ఓ బాంబ్ పేలుడు జరిగింది.మరో
ముప్పై క్షణాల వ్యవధిలో ప్రధానికి వచ్చిన అత్యవసర సందేశం...బెంగుళూర్ లో
బాంబ్ పేలుడు...
భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాని పర్యటన తాత్కాలికం గా వాయిదా పడింది.
******************************
కార్తికేయ కిందికి వంగి షూ లేస్ బిగించాడు.హోల్ స్టర్ లో రివాల్వర్ పెట్టుకున్నాడు.
కిచెన్ లో కాఫీ కలుపుతోంది ముగ్ధ.రెండు కప్పుల్లోకి వంపి తీసుకు వచ్చింది.ఒక కప్పు కార్తికేయకు ఇచ్చి మరో కప్పు తను తీసుకుంది.
ఎక్కడికి వెళ్తున్నారు ?అడిగింది ముగ్ధ
"హైదరాబాద్..."చెప్పాడు కార్తికేయ.
"హైదరాబాద్ ? నన్ను ఒంటరిగా వదిలి...దిగులుగా అంది.ముగ్ధ.
"రాత్రి లోగా వస్తాను..."పోనీ మీ ఫ్రెండ్ ని రమ్మని చెప్పనా ?అడిగాడు కార్తికేయ .
"వద్దొద్దు...మీరు లేదా మీ జ్ఞాపకాలు...ఎనఫ్ "అంది ముగ్ధ
"ఓకే ...అని ఆగి తన హోల్ స్టర్ లో వున్నా రివాల్వర్ ముగ్ధ చేతికి ఇచ్చాడు..
భయం గా చేతిని వెనక్కి లాక్కుంది.
"భయపడకు...ఏ క్షణమైనా ఆ మోహన నిన్ను టార్గెట్ చేయవచ్చు...జర్దార్ నీ మీద ఎటాక్ చేయవచ్చు...ఇది కేవలం ఆత్మ రక్షణ కోసమే...
"నాకు రివాల్వర్ పట్టుకోవడమే రాదు...ఎలా నన్ను నేను రక్షించుకోగలను ?
"సింపుల్...నీ దగ్గరికి రాగానే పాయింట్ బ్లాక్ రేంజ్లో ఇలా ట్రిగ్గర్ నొక్కు..."ఎలా ట్రిగ్గర్ నొక్కాలో చూపించాడు.
"ఇవేమీ వద్దు...తలుపులు లాక్ చేసుకుని వుండిపోతాను..."చెప్పిందిముగ్ధ.
"మరేం పర్లేదు...."అని ఆమె చేతిలో రివాల్వర్ పెట్టాడు.
ట్రావెల్ ఆఫీసుకు ఫోన్ చేసి హైదరాబాద్ ప్లయిట్ టికెట్ కన్ఫర్మేషన్ అడిగాడు.
***********************
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి ముంబై వెళ్ళే ప్లయిట్ ఎక్కాడు కార్తికేయ.
ముంబై...
సినిమా హీరో,నిర్మాత,దర్శకుడు...కార్తికేయ...నలుగురు వున్నారు.
అప్పటికే
విచారణ మొదలైంది.ముంబై పోలీసులు రంగం లోకి దిగారు.కార్తికేయ హీరో వైపు
తిరిగాడు.."సర్ మీరంటే నాకూ అభిమానమే...మీ లక్షలాది అభిమానుల్లో నేనూ
ఒకడికి...కానీ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన వారిని కాపాడే ప్రయత్నం
చేయలేకపోయారు.
ఎంత మంది చనిపోయారో లెక్కించడానికి మనుష్యుల శవాలులేవు..విడి భాగాలే వున్నాయి. వేల చేతులు...వందల మొండాలు...కాళ్ళు...
"హీరో తల దించుకున్నాడు...నిజాయితీతో..."
క్షమించండి మిమ్మల్ని హర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు...కానీ ఈ దాడిలో చనిపోయిన వారికి ఎవరు సమాధానం చెబుతారు ?
సమాధానం ఎవరి దగ్గర లేదు.
"ఓకే
...పరిశోధన చేయడానికి రాలేదు...మరో బాంబ్ దాడి జరక్కుండా చూడడానికి
వచ్చాను...ఈ క్లయిమాక్స్ నాలుగు కెమెరా లతో షూట్ చేసారుగా...ఆ పుటేజ్ నాకు
కావాలి..వెంటనే..."
**********************
ప్రివ్యూ థియేటర్ ...
రష్ చెక్ చేస్తున్నారు...కెమెరా క్లోజ్ యాంగిల్లో బాంబులు పెడుతున్న ఆర్టిస్ట్ దగ్గర జూమ్ చేసారు...
ఆ
ఆర్టిస్ట్ కు దూరం లో ఒక కారు...కారు దగ్గర ఓ వ్యక్తి...క్లోజ్ చేసారు...ఆ
వ్యక్తి జర్దార్...కారు మీద స్టిక్కర్....ఇంకా క్లోజ్ చేసారు...హోటల్ రెడ్
వ్యూ ...అన్న
స్టిక్కర్...
*****************************
(ఆ తర్వాత ఏమైంది ? రేపటి సంచికలో )
No comments:
Post a Comment