ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 30 March 2013

కవిత; మనసు
.................
మండుటెండలో శీతల పానీయమే మనసు
గడ్డకట్టే చలిలో వేడి రగిలించేదే మనసు
పవనప్రకోపంలో గట్టి వూతమిచ్చేదే మనసు
కుంభవృష్టిలో ఛత్రపు నీడనిచ్చేదే మనసు
ఆనంద జలధిలో సంతోషామృతమిచ్చేదే మనసు
వేదనవరద ప్రవాహంలో ఉతమిచ్చేదే మనసు
వలపు ప్రసాదాలకై వేగిరం చేసేదే మనసు
తలపు తరువుల మరుల ఫలాలిచ్చేదే మనసు
ప్రేమదీక్షాద్వారాలను నవ్యరంజితం చేసిందే మనసు
సుఖమోక్షమార్గాలను భవ్యపూజితం చేసేదే మనసు
నల్లని మేఘాలలోను సూర్య కాంతిని చూసేదే మనసు
అమావాస్య నిశిలోను వెన్నెలవెలుగులను చూసేదే మనసు
మరో మనసుని చూసి ముచ్చటపడి ఆత్రపడేదే మనసు
తన మనిషిని చూసి నిలువెల్ల తపిస్తూ నిబ్బరపడేదే మనసు
..........
విసురజ

No comments: