"ముగ్ధమోహనం"
విసురజ డైలీ సీరియల్
(Chapter---44) (10-03-2013)
............
"స్వాగతం విద్యారణ్య గారూ....మీ గురించి వినడమే తప్ప చూడడం కుదరలేదు..."విద్యారణ్యకు ఎదురువెళ్ళి అంది.
"ముందు మా అమ్మాయిని,అల్లుడిని చూపించండి" సూటిగా అన్నాడు.
"అలాగే చూడండి" అంటూ ఎదురుగా స్క్రీన్ మీద కనిపిస్తోన్న దృశ్యాన్ని చూపించింది.
ఒక్క క్షణం విల విల్లాడి పోయాడు. కోపంగా మోహన వైపు చూసి "ఏమిటిదంతా ...ఎందుకు చేస్తున్నారు...అసలు మీకేం కావాలి..." అడిగాడు.
"కూల్ మిస్టర్ విద్యారణ్య ..ముందు కూల్ గా కూల్ డ్రింక్ తాగండి..." టీపాయ్ మీద వున్న కూల్ డ్రింక్ తీసి అతనికి ఇచ్చింది.
"ప్లీజ్ ఈ మర్యాదలు ఆపండి...విషయానికి రండి" సోఫాలో కూచుంటూ అన్నాడు విద్యారణ్య.
"మీరు ఎవరి గొంతునైనా యిట్టె అనుకరిస్తారు...మిమిక్రీకి సంబంధించిన యూనివర్సిటీ కూడా పెట్టాలని అనుకుంటున్నారు"
"అవును ..అయితే దానికీ, మా అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ఏమిటి సంబంధం?
"నేను ఓ గొంతును అనుకరించాలి...అచ్చుగుద్దినట్టు...హావభావాలతో సహా...అందుకు మీరు సహకరించాలి...దానికి సంబంధించిన మెలుకువలు...శిక్షణ కావాలి"
"ఎందుకు? అనుమానంగా అడిగాడు విద్యారణ్య .
"నేను మీ అమ్మాయిని, అల్లుడిని చంపేయకుండా వదిలి పెట్టేందుకు ..." సీరియస్ గా అంది మోహన.
విద్యారణ్యకు కొంత అర్ధమైంది. ఆమె చెప్పినట్టు చేయకపోతే....తన కూతురిని, అల్లుడిని చంపేస్తుంది.
"మీరు ఎవరి గొంతును అనుకరించాలి? విద్యారణ్య అడిగాడు.
"ఒకమ్మాయి గొంతును..."విద్యారణ్యలా మాట్లాడింది. షాకయ్యాడు విద్యారణ్య" నా గొంతును అనుకరించారు..."
"అవును...కానీ మీలా పర్ఫెక్ట్ గా మాట్లాడలేను...ఎనీ వే....ముందు నేను చెప్పింది వినండి...మోహన మాట్లాడుతుంది..ముగ్ధ క్లిప్పింగ్ చూపించింది... ముగ్ధ ఆడియో వినిపించింది...మోహన మాట్లాడుతుంటే....విద్యారణ్యకు చెమటలు పడుతున్నాయి. ఇలాంటి క్రిమినల్ బ్రెయిన్ ఎక్కడా చూడలేదు....
తను మోహన చెప్పినట్టు నడుచుకోక తప్పదు....తన బిడ్డను మాత్రమే కాదు...ఈ దేశాన్ని రక్షించుకోవాలన్నా..
ఇక మిగిలి వుంది ముగ్దాపహరణమే ....
ఇప్పుడామె టార్గెట్ శ్రీనివాస్ ....హైదరాబాద్ లో తన మీద నిఘా పెట్టిన మాజీ సిట్ ఆఫీసర్...
అతడిని ఫినిష్ చేయాలంటే ఎర వేయాలి...ఆ ఎర ....?
****************** ************************** ******************************
పింక్ కలర్ చీరలో అప్పుడే ఆకాశం నుంచి భూమ్మీదికి వచ్చిన దేవకన్యలా వుంది...పూర్ణిమ, ముగ్ధ వంకే చూస్తోంది....అమ్మాయిలకే ఈర్ష పుట్టించే అందం....ఓ రచయితా రాసిన రొమాంటిక్ కథలోని ఓ వాక్యం గుర్తొచ్చింది పూర్ణిమకు..
"ప్రకృతిని స్త్రీగా మార్చి, ఆమె ఎద సంపదను హిమవన్నగాలతో తీర్చిదిద్ది, నయగారా జలపాతం హోరులతో నాభిని అయస్కాంత క్షేత్రంగా మార్చి..నడుం వంపును నక్షత్రాలతో అలంకరించి...గులాబీ రేకులతో పెదవులను....తీర్చిదిద్దినట్టు..."
"ఏయ్ ముగ్దా ఇంతందంగా ఎలా పుట్టావే? అడిగింది పూర్ణిమ...
"నా కార్తికేయ కోసం" టక్కున చెప్పింది..
"అబ్బ ఈ కార్తికేయ జపం వదలవు కదా..." విసుగు నటిస్తూ అంది పూర్ణిమ...
"నా శ్వాస వదిలే వరకూ వదలను" ముగ్ధ చెప్పింది....
పూర్ణిమకు మాటలు కరువయ్యాయి..కన్నీళ్లు చిట్లి, బుగ్గలను ముద్దాడాయి.
"ఇప్పుడు మన ప్రోగ్రాం ఏమిటి?
"లక్ష్మీ మేడంని కలవాలి..అతి కొద్ది సమయంలో వీణ నేర్పిన వాగ్దేవి...పట్టుచీర...పండ్లు...ఇద్దాం..." ముగ్ధ చెప్పింది.
"మంచి ఆలోచన...ఈ రోజే వెళ్దాం" అంది.
వాళ్ళు ఆ మహా సంగీత సామ్రాజ్ఞిని చూడడం అదే ఆఖరు సారని తెలియదు".
******************** *************************** ********************************
శ్రీనివాస్ లేచి అద్దంలో మొహం చూసుకున్నాడు...గత మూడు రోజులుగా నిద్రలేదు...మోహనకు సంబంధించిన చాలా సమాచారం సేకరించాడు. ఈ రోజు తన చిన్నప్పటి నేస్తం లక్ష్మిని కలవాలి...
ఎందుకో తెలియదు భార్యా బిడ్డలు గుర్తొచ్చారు...
ఒక కన్నీటి మేఘం జ్ఞాపకాల ఆకాశంలో ఒంటరిగా తిరుగాడుతోంది.
ఒక మృత్యు విహంగం ఆ ఆకాశంలోనే రాబందుగా మారి దూసుకు వస్తోంది..
**************** ********************* ************************************
(ఏం జరుగబోతోంది...రేపటి సంచికలో)

No comments:
Post a Comment