ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

" ముగ్ధమోహనం " డైలీ సీరియల్(chapter---45 ) (11-03-2013)


శ్రీనివాస్ ఈడూరి....
వృత్తి నిర్వహణలో కాంప్రమైజ్ అనే పదానికి అర్ధం తెలియని మనిషి.కేసు పరోశోదనలో....ఎటువంటి ఒత్తిళ్ళు ఎదురైనా లెక్క చేయని వ్యక్తి.ఓ కేసు పరిశోధనలో హోం మినిస్టర్ కార్యాలయం నుంచి ఒత్తిళ్ళు మొదలయ్యాయి.కేసు విషయం లో జోక్యం చేసుకోకూడదని చెప్పాడు...అయినా ఒత్తిళ్ళు ,బెదిరింపులు ఆగలేదు.
సాక్షాత్తు హోం మినిస్టర్నే అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డాడు.ఫలితం గా అతడి భార్యా బిడ్డలను కిడ్నాప్ చేసారు
అక్కడితో ఆగకుండా వాళ్ళను బాంబ్ బ్లాస్ట్ లో చంపేశారు.
తన భార్యాబిడ్డలను చంపిన వారి మీద .మాత్రమె పగ తీర్చుకోవాలని అనుకోలేదు....దీని వెనుక వున్నా బలమైన వ్యవస్థ ను కూకటి వ్రేళ్ళతో పెకిలించి వేయాలని నిర్ణయించుకున్నాడు.
అదే సమయం లో కార్తికేయ నుంచి ఫోన్...కార్తికేయ చేయబోయే మహా యజ్ఞంలో పాలుపంచుకోవాలని అనుకున్నాడు.అతని వచ్చిన సమాచారం ప్రకారం ముగ్ధ ప్రమాదం లో వుంది.ముగ్ధ వీణ నేర్చుకునే పనిలో హైదరాబాద్ తరచూ రావడం పై రెక్కీ నిర్వహించినట్టు తెలిసింది.ఆ విషయం లో కూడా తన ఫ్రెండ్ లక్ష్మి దగ్గరి నుంచి సమాచారం రాబట్టాలని అనుకున్నాడు.
ఈ కేసులో తనని కూడా టార్గెట్ పెట్టుకున్న విషయాన్ని గమనించలేకపోయాడు.
దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అనుకోలేదు.
****************** ******************** ****************************************
లక్ష్మీ నిలయం...సంగీత సరస్వతి కొలువైన ఆ నిలయం లో నిలువెత్తు సరస్వతీ దేవి ప్రతిమను పాలతో అభిషేకిస్తుంది లక్ష్మి...సిస్టం లో నుంచి సంగీత స్వరాలు మలయ మారుతాలై ఆ పరిసర ప్రాంతాన్ని సంగీత పరిమళాల తో తన్మయులను చేస్తున్నాయి.లక్ష్మి సమకూర్చిన స్వరాలు...
ఒక్క క్షణం లక్ష్మి గొంతు కన్నీటి పర్యంతమైంది. నీటిలోని చేప భూమ్మీద బ్రతకగలదా? సంగీత సముద్రం లో బ్రతికిన తను స్వరాలు ఆలపించకుండా ఉండగలదా? ఓ విధాతా స్వరం లేని ఈ జీవితం వద్దు...నన్ను తీసుకు వెళ్ళు...మరు జన్మలో స్వరం తోనే పుడతాను..మౌనంగా విన్నవించుకుంది.
తథాస్తు దేవతలు అర్ద్రమైన హృదయం తో తథాస్తు అన్నారు.
ఈ లోగా పని అమ్మాయి వచ్చింది.వీణ తీగలు తెగితే బాగు చేయుంచుకు రమ్మని పంపించింది..
"వీణ తీసుకువచ్చావా?అని అడిగింది సైగ చేస్తూ...
"మరో పదిహేను నిమిషాల్లో వస్తుంది...పని కుర్రాడితో పంపిస్తారట మేడం ..."చెప్పింది పనమ్మాయి.
"సరే...ఈ లోగా పెరట్లో మొక్కలకు నీళ్ళు పోయాలి..మనింటికి అతిథులు వస్తున్నారు "
లక్ష్మి భాష ఆమెకు అర్ధమవుతుంది...ఎంతో కాలం గా ఆమెను అంటి పెట్టుకు వుంది.
అలాగే ...అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పి పెరట్లోకి వెళ్ళింది.
సరిగ్గా పదిహేను నిమిషాల తర్వాత...
*********************** ************************** ************************
ఇద్దరు యువకులు వీణ తీసుకుని లక్ష్మీ నిలయం లోకి వచ్చారు...తెల్లటి లాల్చీ,పంచె .నుదిట విభూది...
"మేడం వీణ ను ఎక్కడ పెట్ట మంటారు ? ఆ యువకుల్లో ఒకడు అడిగాడు.
"సరస్వతీదేవి పాదాల దగ్గర పెట్టండి "అన్నట్టు చూపించింది .
"వాళ్ళు వీణను లక్ష్మి చెప్పిన చోట పెట్టారు ...మేము వెళ్తాం మేడం :అంటూ బయటకు వెళ్లబోతుంటే ...లక్ష్మి ఆగనన్నట్టు సైగ చేసింది...పనమ్మాయి వచ్చింది..."వాళ్లకు చల్లటి మజ్జిగ ఇవ్వు ..పాపం ఎండన పడి వచ్చారు..."
పనమ్మాయి మజ్జిగ ఆ ఇద్దరికీ ఇస్తూ "మిమ్మల్ని ఎప్పుడూ చూసినట్టు లేదు "అంది అనుమానంగా..
"కొత్తగా వచ్చాం.."కంగారుగా అని ఒకే ఒక గుటకలో మజ్జిగ తాగేసాడు...ఆ వెంటనే అక్కడ ఒక్క నిమిషం ఉండకుండా వెళ్ళిపోయారు...
లక్ష్మి వీణ వైపే చూస్తూ వుంది...నిన్న మహాశివరాత్రి....రాత్రి జాగారం చేసింది. వీణ మీద తలపెట్టి తీగలు ఆలపించే స్వరాలు వింటుంది.
****************************** ****************** ********************************************
ఆ ఇద్దరు బయటకు రాగానే వారిలో ఒకడు నిక్సన్ కు ఫోన్ చేసాడు..."సర్...అంతా మీరు చెప్పినట్టే చేసాం....షాప్ నుంచి వచ్చే కుర్రాళ్ళను చంపేసాం...వాళ్ళ ప్లేస్ లో మేమే వీణను తీసుకు వెళ్ళాం...అందులో బాంబ్ ఫిక్స్ చేసాం...సిట్ ఆఫీసర్ రాగానే సెల్ రిమోట్ తో..."
"వెరీ గుడ్ ,,,ఆ శ్రీనివాస్ బయల్దేరాడు...జాగ్రత్తగా వాచ్ చేయండి .."చెప్పాడు నిక్సన్ ..."అతనికి తనను శ్రీనివాస్ డ్రగ్స్ కేసులో పట్టుకుని అండర్ వేర్ తో రోడ్డు మీద ఈడ్చుకు వెళ్ళిన దృశ్యం గుర్తొచ్చింది.నిక్సన్ కు ....ఈ విధం గా తన ప్రతీకారం తీరుతుంది.
మోహన తెలివైన ప్లాన్ వేసింది...
శ్రీనివాస్ లోపలికి రాగానే....బ్లాస్ట్ ...వికృతం గా నవ్వుకున్నాడు నిక్సన్.
****************** ****************************** **********************
శ్రీనివాస్ కారు లక్ష్మీ నిలయం ముందు ఆగింది.
ముగ్ధ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగింది పూర్ణిమ తో సహా...
************* ********************** *****************************************
అద్దం ముందు నిలబడింది మోహన..తన ఒరిజినల్ రూపాన్ని చివరిసారిగా అద్దంలో చూసుకోవాలని అనుకుంది...కళ్ళకు వున్న కాంటాక్ట్ లెన్స్ తీసింది...ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోగలనన్న కాన్ఫిడెన్స్ వున్న అందం మోహన ది...ఆ చూపుల్లో మేజిక్ వుంటుంది...ఆ చూపుల్లో చిక్కుకొని విల విలలాడిన వాళ్ళు ఎందరో...
ముగ్దా ఇప్పుడు ఈ రూపం నీ స్వంతం కాబోతుంది...కమాన్ రా...ఆమె గొంతులో హస్కీ నెస్ .
(ఆ తర్వాత ఏమైంది ?)..

No comments: