మాన్ రోబోలో "ముగ్ధమోహనం" విసురజ తొలి డైలీ సీరియల్
(Chapter---47) (13-03-2013)
------------------------------------------------------------------------------------------------------
ఈ సృష్టిలోని ప్రాణులకు చివరిమజిలీ...చితి మంటల్లో...సమాధిలో నిద్రించే మృత్యు ప్రాంగణం ...
చీకటి విషాదానికి గుర్తుగా వుంది...మేఘాలు కన్నీటి చెమ్మతో ఆకాశంలో తిరుగాడుతున్నాయి.
ఒక సంగీత విద్వన్మని నిశ్శబ్ద నిష్క్రమణకు విషాదమే అతిథి ....
***********************
చితిపై ఒక అమరస్వరమ్... అగ్నిలో కలిసి పోతుంది.....ఆ స్మశానం లోని సమాధులు
ఆ దృశ్యాన్ని చూసి కంట తడిపెడుతున్నట్టు వున్నాయి. అలాగే ఆ మంటల వంక
చూస్తున్నాడు శ్రీనివాస్...అతని చితి మంటలు కనిపించడం లేదు....లక్ష్మి
చివరి క్షణాలు గుర్తొస్తున్నాయి.
*************************
వెబ్ కామ్ ద్వారా లక్ష్మి అంత్యక్రియలు చూస్తోన్న కార్తికేయ బుగ్గలపై కన్నీటి ప్రవాహం...
"ఫ్రెండ్...మన చెలిమిని మరిచి తొందరపడి ముందే వెళ్ళిపోయావు...నా సంతోషాలు
ఎవరితో షేర్ చేసుకోను...నీ స్వరాలు వింటూ...మారాం మానివేసిన చిన్నారులకు ఏం
సమాధానం చెబుతావు?
లక్ష్మీ వుయ్ మిస్ యు ..." ఎవరో ఎదను కోసేస్తోన్న ఫీలింగ్...ఒక గాంధర్వ గానాన్ని గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేస్తోన్న ఫీలింగ్ ..."
వెబ్ కామ్ క్లోజ్ చేయబోతూ ఆగాడు...వెబ్ కామ్ లో ఓ మూలగా ఓ అస్పష్ట ఆకారం....చేతిలో రివాల్వర్....
"శ్రీ...గట్టిగా అరిచాడు...ఎలర్ట్..హెడ్ డౌన్...టేక్ పొజిషన్...ఎయిమ్ స్ట్రెయిట్..."
శ్రీ ఒక పోలీస్ అధికారి...కార్తికేయ మాటల్లోని వార్నింగ్ క్షణాల్లో అతని
బ్రెయిన్ క్యాచ్ చేసింది...తల వంచాడు...ఓ బులెట్ అతని తలను రాసుకుంటూ
వెళ్ళింది...వెంట్రుక వాసి..తేడా....తలవంచకపోయి వుంటే బులెట్ కణతలోకి
దూసుకు వెళ్లేదే....
"శ్రీ డోంట్ లీవ్ హిం...కిల్ హిం...వాడు మంటల్లో
మాడి పోవాలి కార్తికేయ మాటలు మంత్రాక్షరాలై వినిపిస్తున్నాయి...అసలే
ఆకలిగొన్న పులి..శ్రీనివాస్...ఓ మూలాన వున్న పెట్రోల్ టిన్ ని కాలితో ఫుట్
బాల్ లా తన్నేసాడు...టిన్ గాలిలోకి లేచింది...ఆ వేగాని మూత
కొండపడింది..టిన్ ఆగంతకుడి తలను తాకి, అందులోని పెట్రోల్ అతడిని
తడిపేసింది.
శ్రీనివాస్ లక్ష్మి చితి మీద మండుతోన్న ఓ కర్రను
తీసాడు..బలంగా విసిరాడు....గాలి సైతం సహకరించింది...ఆ మండుతోన్న కర్ర
ఆగంతకుడి తలను తాకింది...మరుక్షణం మంటల్లో ఆగంతకుడి
శరీరం...అరుస్తున్నాడు...పరుగెడుతున్నాడు...సరిగా కొద్ది నిమిషాల్లోనే
ఆగంతకుడు లక్ష్మి చితికి కాళ్ళ వైపు పడిపోయాడు....మరో కొద్ది సేపటిలో
బూడిదగా మారిపోతాడు.
ఆ ఆగంతకుడు నిక్సన్.....బూడిదగా మారాడు....దుర్మార్గపు ఆలోచనలు చేసిన మెదడు, టపీమని పగిలిపోయింది.
పరాయి దేశం నుంచి వచ్చి, పాడు పనులు చేసి....చివరికి దిక్కులేని చావు
చచ్చి....ఇదే కదా జీవితం.. ఈ రెప్ప పాటే కదా జీవితం...ఎందుకీ
ద్వేషాలు...రక్తపాతాలు.....ఉన్మాదాలు?
*************************************
వెబ్ కామ్ లో ఆ దృశ్యం చూసిన కార్తికేయ మోహంలో సంతృప్తి...
"వెల్ డన్ మిత్రమా...మన స్నేహితురాలి ఆత్మ సంతోషిస్తుంది...ఏంతోమందిని
మత్తుకు బానిసలుగా చేసి వారి జీవితాలతో ఆడుకుని చివరికి నీ చేతిలో
చచ్చాడు...మాట నిలబెట్టుకున్నావు మిత్రమా"
శ్రీనివాస్ ఆ కామెంట్ ని వినమ్రం గా స్వీకరించాడు...తన నెక్ష్ట్ టార్గెట్...హైదరాబాద్ లో మొహనాను ట్రాప్ చేయడం...
*****************************
కళ్ళు మూసుకుంది ముగ్ధ...బస్సు రాజమండ్రి వైపు వెళ్తోంది....నిద్ర
రావడంలేదు...కన్నీళ్లు వస్తున్నాయి...కళ్ళ ముందు లక్ష్మి మేడం
కనిపిస్తుంది. మౌనంతో కూడా సంగీతాన్ని పలికించింది. కార్తికేయ తనకు మంచి
ఫ్రెండ్ అని చెప్పినప్పుడు పొంగిపోయింది. కానీ ఇంతలోనే....ముగ్ధకు భయం
వేసింది...దగ్గరికి ముడుచుకుంది. పూర్ణిమకు దగ్గరగా జరిగింది.
"ముగ్దా ఏమైందే? అడిగింది పూర్ణిమ...
అప్పటికే ముగ్ధ కళ్ళ లో కన్నీళ్లు...
"భయమేస్తుంది పూర్ణిమా..బాధేస్తుంది పూర్ణిమా...కార్తికేయ దగ్గరికి వెళ్లి
అతని దగ్గరే ఉండిపోవాలని అనిపిస్తుంది. నువ్వు, నేను, తమ్ముడు, నాన్న అంతా
వెళ్ళిపోదామా? చిన్న పిల్లలా అడిగింది.
"డేరింగ్, డాషింగ్, డైనమిక్
కార్తికేయకు కాబోయే అర్ధాంగి మాట్లాడే మాటలా? నవ్వుతూ అంది పూర్ణిమ. ఆ
మాటలు వినగానే సిగ్గు, ధైర్యం రెండూ కలిగాయి.
ఆ బస్సును ఫాలో అవుతూ ఓ పోలీస్ జీపు వస్తోంది.
*******************************
అర్ధరాత్రి రెండు గంటలు...ఉలిక్కి పడి లేచాడు ఖాసిం ...టైం చూసుకుంటే
రెండు గంటలు...నోరంతా పిడుచకట్టుకు పోయినట్టు...ఎందుకో ఆ టైంలో విస్కీ
తాగాలని అనిపించింది ఖాసింకు. సోఫా వైపు చూసాడు...సోఫాలో వుండవలిసిన
జర్దార్ లేడు...రాత్రి జరిగిన సంగటన గుర్తొచ్చింది. వద్దంటున్న వినకుండా
జర్దార్ తనతో బీర్ తాగించాడు...బీర్ బాటిల్స్ లాగించినా మత్తు రాని తనకు
నిద్ర ముంచుకు వచ్చింది.
అలానే తినకుండా పడుకున్నాడు.
టీపాయ్ మీద
చూసాడు...చికెన్ పీసెస్ వున్నాయి...చిప్స్ వున్నాయి...విస్కీ వుంది...కానీ
ఇప్పుడు తాగాలని అనిపించడం లేదు...జర్దార్ ఎక్కడికి వెళ్ళాడు... వాడో పెద్ద
బద్మాష్ అన్న ఫీలింగ్ ఖాసింకు..
చిన్న అనుమానం పెనుభూతం అయింది. వెంటనే జర్దార్ గదిలోకి వెళ్ళాడు.
అక్కడ అతని గదిలో జర్దార్ కు సంబంధించిన బట్టలు, వస్తువులు ఏవీ లేవు.
చిన్న కంగారు...కొంపతీసి ఈ జర్దార్ తనని ఢిల్లీ పోలీసులకు పట్టించడు కదా?
గట్టిగా పిలిచాడు ...జర్దార్...జర్దార్...ఉల్లూకే పట్టా...గట్టిగా హిందీలో
అరిచాడు...తన గొంతు తనకే వినిపిస్తుంది.
ఏదో జరిగింది...ఏం జరిగింది? మోహనకు ఫోన్ చేస్తే....?
ఈ అర్ధరాత్రి ...వెంటనే తనలో తనే అనుకున్నాడు...అదో సైతాన్...రాత్రుళ్ళు మేలుకుని ఏవో దుష్ట ఆలోచనలు చేస్తూ వుంటుంది.
వెంటనే మోహనకు ఫోన్ చేసాడు.
*********************************
"యస్...పోలీస్ కంట్రో రూం" వినిపించింది అవతలి వైపు నుంచి.
వెంటనే ఫోన్ కట్ చేసి సెల్ లో వున్న సిమ్ బయటకు తీసాడు.ఖాసిం మొహానికి చెమట పట్టింది.
అంటే మోహనను పోలేసులు? జర్దార్ కనిపించకుండా పోవడం ...మోహనకు ఫోన్ చేస్తే..కంట్రోల్ రూంకు కనెక్ట్ అవ్వడం?
No comments:
Post a Comment