ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 28 April 2013

కవిత: హృదయరాగం
 
Photo: కవిత: హృదయరాగం
..... ,,,,,,,,,,,,............. 
మనసైన సుందరి మోహనంగా నవ్వేలే 
తలపు ఒత్తుతో వలపు దివ్వె వెలిగేలే
అనురాగపు బాటలో ప్రేమగా సాగుదాములే
వెన్నెలసోనలో వలపుల ఊయాల ఊగుదాములే

తీర్చిదిద్దిన మోములో సురీడల్లే వెలిగే నుదిటిబొట్టు
చక్రాల్లాంటి కళ్ళకు దిద్దుకునే నల్లనికాటుక నప్పేట్టు
మిసిమి పరువాల మేనివిరుపుతో నడయాడే కవ్వించేట్టు
హృదిగదిలో వెలగదా సింగారదీపిక తలపు పరిమిళించేట్టు

సన్నజాజి పందిరి నీడలో పక్కవేసి వుంటే 
జడలో మల్లెలు తురిమిన నీవు ప్రక్కనుంటే
నింగిలో పండు వెన్నెల నిండుగా వెలుగుతుంటే 
చెరుకువింటి మొనగాడు ఎదను గిల్లడా గిచ్చడెంటే 
.....
విసురజ

No comments: