ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 April 2013

కవిత: కృష్ణప్రేమ ముచ్చట
................
ఊరు పేరులో పెన్నిధి ఏమున్నది
ఉన్న మర్మమేదో మనసులోనే వున్నది
చెలి పేరు చెప్పేటందుకు అసలు ఏమున్నది
చెబితే మటుకు ఎవరికీ ఏమి లాభామున్నది
ఐనా పేరు చెప్పినా, దానిలో ఏమున్నది
ఉన్నదేదో గుండెలోనే గుట్టుగా గూడుకట్టుకుని వున్నది
సిగ్గుతెరల మాటున నల్లని కల్లకాటుక చాటున దాగిన కళ్ళు
తన పేరు బయటపడితే కళ్ళు సిగ్గుతో క్రిందకు వాలవూ, నేలచూపులు చూడవూ
తన కళ్ళను కాచే కనురప్పలు నేలచూపులకై క్రిందకు వాలితే
లోకాన ఉదయపు వేళైన సాయంసంధ్యగా మారదా
జగం చీకటిమయం కాదా
మాధవుడు ఎందరివాడైన గోపికలకు ఇష్టుడైన గోపలుడు
రాధికా రమణుడే కాదా
....
విసురజ

No comments: