ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 2 April 2013

కవిత: ఏమైతే...ఏమౌతా
................................
వెలిగే వెన్నెల నీవైతే
మిరుమిట్లాడే తారని నేనౌతా

వీచే పవనం నీవైతే
హాయినిపొందే మేనును నేనౌతా

పారే సెలయేరు నీవైతే
కడమజిలి కడలిని నేనౌతా

పాడే కోయిల నీవైతే
పులకించే వసంతయామిని నేనౌతా

పూచే పున్నాగ నీవైతే
అందంగఅమిరే కొప్పు నేనౌతా

కురిసే వానచినుకు నీవైతే
ఆత్రంగావేచే చకోరం నేనౌతా

సవ్వడి చేసే మువ్వ నీవైతే
లయతాళ భంగిమల నర్తనం నేనౌతా

నింగిన మెరిసే హరివిల్లు నీవైతే
ఇలనుమురిసి నాట్యంచేసే నెమలి నేనౌతా

ప్రాయపుమిసిమి నొసగే వయసు పొగరు నీవైతే
పరువాలను పాలపుంతల తొక్కించే పౌరషం నేనౌతా

నిదురలో కలలో కదలాడే తీయని స్వప్నమే నీవైతే
ఇహలో కలను సాకారం చేసుకునే పనిముట్టు నేనౌతా

అక్షరదీపిక వెలిగించే జ్యోతి నీవైతే
జ్ఞానచక్షువులు చదివే గ్రంధాలయం నేనౌతా
..................
విసురజ

No comments: