ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 8 May 2013

ఫెంతోస్ గ్రూపులో అక్షర అంత్యాక్షరి ఆడిన క్రమంలో నిన్న నేను రాసినవి
1)
ఉదయకాంతి హృదికిపాకే
నిశినైరాస్యము వెలుగుపూలుగా మారే
2)
ఉరకలు వేయక వయసు
వలపులు పంచక మనసు మురిసేనా
3)
ఇస్కూలుకి ఇస్త్రీ బట్టలేస్తి
ఐనా పాఠగాళ్ళ మనసు స్వచ్చత నాస్తి
4)
టకటక కళ్ళు కొట్టుకుంటే ( నిను చూసి)
టపీమని వీపుపై విమానం మోత మ్రోగే
5)
ఇద్దరి మధ్య నలిగి క్రుశించా
బన్నుల మధ్యలో నలిగన టోమాటో గోడు
6)
ఉత్తుత్తి అప్పచ్చిలెన్నో తిన్నా
అమ్మా ఆకలే ఇహనైనా నిజం బువ్వేట్టవే
7)
ఇసుకలో గూళ్ళేన్నో కట్టా
బతుకుయానంలో గుడిసైనా కట్టనైతిగా

ఒదిగి ఎదిగితే గొప్పే
ఎదిగి ఒదిగి మలిగితే మరింత గొప్ప
విసురజ
04.05.13

No comments: