ఆగష్టు1(టాగ్ లైను ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
04-05-2013 (24th Chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
++++++++
భయం రెండు రకాలు...సడెన్ గా కలిగేది...శాశ్వతంగా మన వెంట వుండేది.
సంధ్యాజ్యోతి ఒక్క సారిగా ఆ వాతావరణాన్ని చూసి భయపడిపోయింది. సినిమాల్లో
చూసే వాతావరణం ప్రత్యక్ష్యంగా చూస్తోంది. తను సినిమాటిక్ సాహసం చేస్తోందా?
దెయ్యాలు, ఆత్మలు, ముంబాయిలో ఆత్మతో సంభాషించే మహిళ....చాలా కాలం క్రితం
ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం గుర్తొచ్చింది.
బాబాలు, క్షుద్ర మాంత్రికులు...చేతబడులు, బాణామతి, చిల్లంగి ఇవ్వన్నీ నిజమా?
ఒక తర్కం ఎన్నో మూడనమ్మకాలకు సమాధానం చెబుతుంది.
ఒక వితర్కం ఎన్నో అంధ విశ్వాసాలకు దారి చూపుతుంది,...
ఒక సినిమా చూస్తున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్....మ్యూజిక్...పెద్ద తెర...చీకట్లో ఆ సినిమా మనలోని భయాన్ని మేల్కొలుపుతుంది.
ఇక్కడ ప్రత్యక్ష్యంగా చూసిన అనుభవం ఎన్నో భావాలను వ్యక్తం చేస్తుంది.
సంధ్యాజ్యోతి బటన్ కెమెరా సరి చేసుకుంది. ఆమెను తాకుతూ, రాసుకుంటూ గాలి వెళ్లినట్టు ...
తలుపు దగ్గరికి వెళ్ళగానే దానంతటదే తెరుచుకుంది.
*********************
స్కోడా కారు స్పీడ్ గా వెళ్తోంది. కారు చంద్రహాసే డ్రైవ్ చేస్తున్నాడు.
పదుల సంఖ్యలో కార్లున్నా, డ్రైవర్లు వున్నా తనే స్వయంగా కారు
నడుపుతున్నాడు. కారు ఎయిర్ ఫోర్ట్ వైపు వెళ్తోంది. యాక్సిలేటర్మీద కాలు
బిగుసుకుంది. అతని మనసులో చిన్న అలజడి...తన పక్కనే ప్రణవి కూచోన్న ఫీలింగ్.
తను డ్రైవ్ చేస్తున్నప్పుడు తన భుజం మీద తల వాల్చి కళ్ళు మూసుకుని "మీ
స్పర్శని అనుభూతిస్తున్నాను" అనే ప్రణవి మాటలు గుర్తొచ్చాయి.
జీరోతో
మొదలైన జీవితం...ఎన్నో జీరోలను సృష్టించిన జీవితం...తన పక్కన తన జీరోలకు
ముందు ఒకటి అంకెగా చేరి తనను మిలినియర్, మల్టీ మిలియనీర్...అత్యంత
సంపన్నమైన వ్యక్తిగా మార్చిన ప్రణవి...డబ్బు తను సంపాదిస్తే...అంత కన్నా
విలువైన ప్రేమను, తన స్వార్జితమైన, వ్యక్తిత్వాన్ని తనకు ధారపోసిన
ప్రణవి....
"ఈ మనసు, శరీరం, ఇందులోని భావాలు, అనుభూతులు మీ పరం
చేసేసాను ...జీవితం చివరి క్షణం వరకూ మీ పక్కనే, మీ స్పర్శలోనే గడిపే
వరమివ్వు ప్రభూ.." అంటూ మోకాళ్ళ మీద కూచోని తన ఒడిలో తల పెట్టి అన్న ప్రణవి
మాటలు...కన్నీటి చరణాలా? తన జీవితపు పాటకు ప్రణవి పల్లవి తోడు....
చంద్రహాస్ ఆలోచనలు, అనుభూతులు వేగవంతమైన క్షణాన..అతని కారు మూల మలుపు
తిరుగుతుండగా...ఎదురుగా లారీ...రాంగ్ రూట్ లో వస్తోన్న లారీ....చంద్రహాస్
క్షణంలో ప్రమాదాన్ని ఊహించాడు..కానీ లారీ అరక్షణంలో దూసుకు వచ్చింది.
*****************
సుకన్య ఆ ఇంటి ముందు నిలబడి చూస్తోంది, గత రెండు రోజులుగా అది ఆమె దిన
చర్య. ఆ ఇల్లు రాధాచంద్రికది...ఆ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు...ఎవరెవరు
వెళ్తున్నారు...లాంటి విషయాలు అబ్జర్వ్ చేస్తోంది. సుకన్య చిన్న కన్
ఫ్యూజన్ లో వుంది. రాధాచంద్రిక కాల్ లిస్టు సంపాదించింది. ఆమె భర్త కాల్
లిస్టు సంపాదించింది. ఓ విస్మయకర విషయం తెలిసింది.
తనకు తెలిసిన
విషయాన్ని ఒకటికి పది సార్లు కన్ ఫర్మ్ చేసుకుంది. రాధాచంద్రిక ల్యాండ్
ఫోన్ కు వచ్చిన కాల్స్ లిస్టు లో వున్న ఒకే ఒక నంబర్ ఆమె భర్తది.
(ఈ సస్పెన్స్ రేపటి వరకూ)
No comments:
Post a Comment