ఆగష్టు1...(టాగ్ లైను....డేట్ తో డిష్యుం...డిష్యుం)
29-04-2013 (19th Chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
****
ఎదురుగా వున్నది పోలీసులు..వచ్చింది తన భర్తని హత్య కేసులో అరెస్ట్ చేయడానికేనా? ఇప్పుడు తనేం చేయాలి? తన సాక్ష్యం కూడా అడుగుతారా? తను తెచ్చిన పర్స్ గురించి ఆరా తీస్తారా? పర్స్ తన దగ్గరే వుంది.
సంతోషం... బాధ..ఈ రెండింట్లో తన ఫీలింగ్ ఎటువైపు? అసలు తనెలాంటి ఫీలింగ్ లో వుంది? రెండు రోజులుగా భర్తకు, తనకు మధ్య మాటలు లేవు...ముక్తసరిగా అంతే...అయినా ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని తనని అడగడం లేదంటే...తను చేసిన తప్పు తనకు తెలుసననేగా....మనస్ఫూర్తిగా ప్రేమించిన భార్యను మోసం చేసాడన్న ఫీలింగ్ కన్నా ఒక అమాయకురాలిని లేదా ఒకమ్మాయిని చంపేసాడన్న కోపం ఎక్కువ కలుగుతుంది.
"ఎక్స్ క్యూజ్ మీ మేడం..." ఓ కానిస్టేబుల్ పిలవడంతో తన ఆలోచనల నుంచి బయటకు వచ్చింది. "మేడం సర్ వున్నారా? ఒక కానిస్టేబుల్ మర్యాదగా అడిగాడు.
"లేరు..." అని ఇంకా చెప్పబోతుండగా .."సర్ తన పర్స్ పోయిందని కంప్లయింట్ ఇచ్చారు.. గంటకోసారి ఫోన్ చేసారు..ఆ పర్స్ చాలా ముఖ్యమైనదని.. అందులో డబ్బులు క్రెడిట్ కార్డ్స్ పోయినా ఫోటో చాల ఇంపార్టెంట్ అన్నారు...కొంత మంది పిక్ పాకెటర్స్ ని పట్టుకున్నాం.. ఐడెంటిఫికేషన్ పెరేడ్ పెట్టాం...సర్ ఓ సారి వస్తారేమోనని..."
రాధాచంద్రిక అలానే వింటూ వుండి పోయింది .
ఆనందం ఆర్ణవం అవ్వడం ఆంటే ఇదేనా? ఏంటిది భర్త పర్స్ పోగొట్టుకున్నాడా? ఆంటే ఆ హత్య ...?
"మేడం...సర్ వచ్చాక చెబుతారా? కానిస్టేబుల్ అనడంతో అలాగే అన్నట్టు తలూపింది ,
వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు.
****** ****** ******
పోలీసులు వెళ్ళిపోగానే తలుపులు వేసేసి తన గదిలోకి వచ్చి చేసిన మొట్ట మొదటి పని భర్త ఫోటోని తన చేతుల్లోకి తీసుకుని, గుండెలకు హత్తుకోవడం. రెండు రోజుల వేదన మంత్రం వేసినట్టు మాయం అయినట్టు అనిపించింది. తను తన భర్తని తన ప్రాణాన్ని అనుమానించి, అపార్థం చేసుకుందా? ఒక చిన్న తొందరపాటు, తను తొందరపడి భర్తను హత్య విషయం అడిగివుంటే ఎంత ఘోరంగా వుండేది? ఇప్పుడు తనేం చేయాలి...? మెలోడ్రామాగా అనిపించినా సరే తన కన్నీళ్ళతో భర్త పాదాలు కడగాలి. నలభై ఎనిమిది గంటలు తను తన భర్తని బాధ పెట్టింది...దీనికి నష్ట పరిహారం ఏమిటి?
వార్డ్ రోబ్ దగ్గరికి వెళ్లి అందులో నుంచి గెస్ట్ హౌస్ నుంచి తను తీసుకు వచ్చిన భర్త పర్స్ ని ఓపెన్ చేసింది.అందులో తన ఫోటో...ఈ ఫోటో చాలా ముఖ్యమని...ఏది పోయిన ఆ ఫోటో పోకూడదని చెప్పాడు. ఇంత గొప్పగా ప్రేమించే భర్త ను తనెంత తెలివితక్కువగా అపార్థం చేసుకుంది.
రెండు రోజుల తర్వాత ప్రశాంతంగా అనిపించింది.
భర్త వచ్చేసరికి ఫ్రెష్ గా తయారవ్వాలి...అతనికి ఇష్టమైన చీర కట్టుకోవాలి..లేచి బాత్ రూంవైపు నడిచింది.
****************
రాత్రి పది దాటింది. ఉదయం నుంచి ఏమీ తినలేదు, భర్త కోసం ఎదురుచూస్తోంది. సెల్ స్విచ్చాఫ్ లో ఉంది. పదిన్నర ప్రాంతంలో వచ్చాడు. మొహం అంతా అలిసిపోయినట్టు ఉంది. పీక్కుపోయి ఉంది. వస్తూనే బెడ్ రూంలోకి వెళ్ళిపోయి పడుకున్నాడు. రాధాచంద్రిక భర్త దగ్గరికి వెళ్ళింది. అతను రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకున్నాడు. అతని తల మీద చేయి వేసింది. అతని తలను తన గుండెలకు ఆసరా చేసింది.
అతను రెండు చేతులతో ఆమెను చుట్టేసాడు. అతని కన్నీటి తడి ఆమె పొట్ట భాగానికి తగులుతోంది. అతను మంచం మీద కూచోని వున్నాడు. ఆమె నిలబడి ఉంది.
" ఎందుకిలా వున్నారు ?" ఆమె అడిగింది..అతని ద్వారా తెలుసుకోవాలని...
"నేను ఓ తప్పు చేసాను...నీ దగ్గర ఓ నిజం దాచిపెట్టాను...ఆ నిజం నిన్ను ఎంత బాధిస్తుందోనని భయం వేస్తోంది. ఈ రెండు రోజులు
ఆ నిజం చెప్పకుండా బాధ పెట్టాను. నేను చేసిన తప్పుకు నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను...
"నీ స్పర్శను మిస్ చేస్తే..భరించలేను.నీకు తెలుసు ...నీ స్పర్శ నాకు ప్రాణసమానం " అంటూ రెండు చేతులూ ఆమె నడుంను చుట్టేసాయి.
"మీరు ...తప్పు చేసారా?.ఏమిటా తప్పు...? అడిగింది.
"నేను...నేను ఒక హత్య చేసాను" అతను చెప్పాడు.
అతని తల మీద వేసిన తన రెండు చేతులను వెనక్కి తీసుకుంది అప్రయత్నంగా...

No comments:
Post a Comment