ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 20 June 2013

1) ప్రతిరోజూ నిద్రలేచిన వెంటనే మొదట మీరు మీ రూపాన్ని, మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చిన పెద్దలను ఇష్టపడడం నేర్వండి. అలాగే మీరు తలపెట్టిన పనిని, మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని ప్రేమించండి. మీరు మిమ్మల్ని ప్రేమిస్తే ముందు మీకు మిగిలిన వారు మెచ్చాలి మీరు అవతల వాళ్లకు నచ్చుతారా అన్న మీమాంశ వుండదు. అప్పుడు రోజంతా నిత్యం సంతోషంగా వీటినే స్వాసిస్తూ, రేయంతా నిద్రలో కూడా వాటినే ధ్యానిస్తూ గడుపుతారు. అప్పుడు మీ లక్ష్యం పట్ల మీకు అనురాగం, నమ్మకం ఏర్పడి వాటిని పొందడంలో విజయం సాధిస్తారు.

2) పడిలేచే కడలి తరంగం, ఉరకలు వేసే వయసు, మదిలో విరిసే ఆలోచనలు, వీచే గాలి, ఉదయ కిరణాలు, చంద్రకాంతి, నక్షత్ర వెలుగులు, నింగిలో మబ్బుల పహారా యివన్నీ వద్దన్నా తమ పని మానవు. అలాగే తమ పని చేయడం వల్ల వీటికి స్వంతానికి ఏమి లాభం లేదు. మరలాంటిది నీవు బుర్ర పెట్టి మనసార పనిచేయడం వల్ల స్వంతానికి లాభం వుండీ కూడా మనం మన పనులని వాయదాలు వేయడం ఏమాత్రం సబబు కాదు. అందువల్ల నష్టమే తప్ప స్వలాభం వుండదు. కనుక మనం కష్టించి పనిచేసి విజయం సాధిద్దాం. కొత్త ఒరవడి సృష్టిద్దాం.

(P.S. చేతి రేఖల కన్నా, నుదిటి గీతల కన్నా మనిషి క్రియ కర్మలే ముఖ్యమని 'గీత' లో చెప్పేగా.. ఆలోచించు, ఆచరించు)

No comments: