కవిత: ఎద మెరుపు
.................
నీ రూపాన్ని చూసి వెలుతురు నొచ్చుకునే గిచ్చుకునే
తనకు దక్కిన అందమంతా మరొకరు దక్కించుకున్నారని
నీ సౌకమార్యాన్ని చూసి పూబాల ఈర్ష్యపడే బాధపడే
తనకు అద్దిన సోకుల కన్నా నీవు అందంగా వున్నావని
నీ మధుర పలుకు విని కోయిల బెంగపడే
తనతో పోటీకి నీవు నిలుస్తావని నీవస్తావని
నీ సన్నని నడుం చూసి పూలతిక బెంబేలు చెందే
తనకు మారుగా అందరు నీతో పోలుస్తారని
నీ అధరాల ఎరుపును చూసి దివాకరుడు సిగ్గుపడే
తన ఎర్రని అరుణిమ నీముందు దిగదుడుపని
నీ నడకలను చూసి నెమలి బ్రహ్మదేవునితో గొడవపడే
నీ నాజూకు నడకల అందాలు తనకివ్వలేదని

No comments:
Post a Comment