ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం
16-06-2013 (chapter-67)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
చంద్రహాస్ చిన్నపాటి ఉద్వేగానికి లోనయ్యాడు.దానికి రెండు కారణాలు
వున్నాయి.మొదటి కారణం ముక్కలైన మొబైల్ పనిచేయడం...రెండు ఎవరికైతే తను
ఫోన్ చేయాలని అనుకున్నాడో ఆ వ్యక్తే ఫోన్ చేయడం .
కార్తికేయ ...ఒక్క
సారి మాట ఇస్తే మాట తప్పని,మడమ తిప్పని వ్యక్తి...ఆన్ బటన్ ప్రెస్ చేసి
"చెప్పండి కార్తికేయ గారు...ఎలా వున్నారు ?మీ నుంచి ఫోన్ రావడం సంతోషంగా
వుంది.ఎంత సంతోషం అంటే ప్రణవి దొరికినంత సంతోషం...అంత పెద్ద బిజినెస్
టైకూన్ ఆ క్షణం ఒక మామూలు భర్త గా ,భార్యను అమితంగా, తన ప్రాణంగా ప్రేమించే
భర్తగా ఎక్సయిట్ అయిపోతూ మాట్లాడుతున్నాడు.
"ప్రణవి గారు దొరికినంత సంతోషంగా కాదు...దొరికిన సంతోషమే..."కార్తికేయ చెప్పాడు.
ఒక్క సారి వేన వేల మలయా మారుతాలు తనని చుట్టుముట్టినట్టుగా ...ఎడారిలో మంచు వర్షం
కురిసినట్టుగా....వేల కోట్ల బిజినెస్ డీల్ ఓకే అయినా కలుగని సంతోషం...
కార్తికేయ మరియప్ప గురించి చెప్పలేదు..తను ప్రణవి,చంద్రహాస్ ని కాపాడడానికి చేసిన ప్రయత్నం,పోరాటం గురించి చెప్పలేదు.
"థాంక్యూ కార్తికేయ గారూ..నాకు తెలుసు..నా ప్రణవి ని కాపాడగలిగిన ఒకే ఒక
వ్యక్తి మీరని....నేను వెంటనే వస్తున్నాను..ఇక్కడ నేను తేల్చవలిసిన బాకీ
వుంది ."తనను పిచ్చాసుపత్రి సెట్ వేసి ఎలా బంధించారో క్లుప్తంగా
చెప్పాడు.తను రాత్రి ఎదుర్కున్న విచిత్రమైన అనుభవం గురించి చెప్పలేదు.
"మీరు ఆ బాకీ తేల్చి వచ్చేయండి..ఇక్కడ బాకీ ఏమైనా మిగిలి వుంటే నేను చూసుకుంటాను."
చెప్పాడు కార్తికేయ.
***********************
తన వైపు గురిపెట్టిన రివాల్వర్ వైపు చూసి నవ్వింది సంధ్యాజ్యోతి. స్టీఫెన్ కోపంగా ,ఆశ్చర్యంగా సంధ్య వంక చూసాడు.
"ఒరేయ్ పిచ్చి కుంజా...నిన్ను చూస్తే జాలేస్తుంది.నీ చిన్న మెదడు...మాఫియ
వాళ్ళ మోకాల్లో వుందనిపిస్తుంది. అసలు నాకు తెలియక అడుగుతాను...ఈ డబ్బంతా
ఏం చెసుకుంటావ్ ? నీకు ఒక్కరు కాదు ఇద్దరు మొగుళ్ళు ...అనవసరం గా నాతొ
సెన్సార్ మాటలు మాట్లాడించకు ..నన్ను కాల్చేసి బ్రతుకుదామనే...నువ్వు
నన్ను పేలిస్తే నా బాడీ లో సీక్రెట్ గా నేను దాచుకున్న బాంబ్
పేలుతుంది.కావాలంటే ట్రై చేసి చూడు. ఇన్ కేస్..నువ్వు తప్పించుకునా
కార్తికేయ,చంద్రహాస్ నిన్ను కుక్కను కొట్టినట్టు...వద్దులే నిను కుక్కతో
పోలిస్తే కుక్క ఫీల్ అవుతుంది.బురదలో పందిని కొట్టినట్టు కొడతారు...
తర్వాత నీ ఇష్టం " చెప్పి కళ్ళు మూసుకుని .క్షణం తర్వాత ఓరకంటితో స్టీఫెన్
రియాక్షన్ చూస్తోంది.
బలవంతంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు
స్టీఫెన్...సంధ్య కాన్ఫిడెంట్ గా మాట్లాడ్డం తో అతనిలో చిన్న
సందిగ్ధం...ఆమె ఏ ధైర్యంతో అలా మాట్లాడుతుంది ? ఇపుడే తను తొందర పాడడం
కన్నా,ప్రణవి,ముగ్ధ వచ్చే వరకూ వెయిట్ చేసి అప్పుడు అందరినీ ఒకే సారి
ఫినిష్ చేస్తే...?ఆ ఆలోచన అతని ఈగో ని సంతృప్తి పరచింది.
కానీ ఆ ఆలోచనే అతన ప్రాణాన్ని తీసుకుంటుందని ఆ క్షణం తెలియదు.
********************
ముగ్ధ ఇంట్లోకి ప్రవేశించాడు నాంపల్లి ...అతని వెంట మాఫియా గ్యాంగ్
వుంది.కైకేయ ఇంట్లోకి ఒంటరిగా ప్రవేశించే ధైర్యం అతనికి లేదు.వాళ్ళు లోపలి
వెళ్ళే సరికి ముగ్ధ,ప్రణవి మాట్లాడుకుంటున్నారు.చంద్రహాస్ గురించి,అతను
తనను ఎంతగా ప్రేమిస్తాడో మురిసిపోతూ చెబుతోంది.
ముగ్ధ ప్రణవి మాటలు
వింటోంది.భర్త గురించి భార్య చెప్పే మాటలు ఎంత అందంగా వుంటాయి.ఒకప్పుడు తను
కార్తికేయ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఫీలింగే కలిగేది.చంద్రహాస్
బయల్దేరాడు అన్న విషయం కార్తికేయ ఫోన్ చేసి ముగ్ధకు చెప్పాడు.ముగ్ధ ప్రణవి
కి చెప్పింది.
ఆ క్షణమే భర్తకి ఫోన్ చేద్దామని అనుకుంది.ప్రణవి కానీ
అతని గొంతు వినడానికి ముందు అతడిని చూడాలి.అతని స్పర్శలో
కరిగిపోవాలి.అందుకే అతడి కోసం ఎదురుచూస్తుంది. ఆ సమయంలో వచ్చాడు నాంపల్లి.
ముగ్ధ వాళ్ళని చూడగానే బెదిరిపోలేదు...ఇలాంటివి చాలా చూసింది. మాఫియా వాళ్ళని చుట్టుముటింది.
"ఏంటి కిడ్నాపా ? ఓకే "అని ప్రణవి వైపు తిరిగి "మీరు ఫ్రెషప్ అవుతారా
?కాసేపు వాళ్ళ గెస్ట్ లుగా వందాం. యాక్షన్ మూవీస్ చూసి చాలా కాలం అయింది
...వీళ్ళు తమ ప్రతాపం ఇంటి మీద చూపించడం...మళ్ళీ సామాను
సర్దుకోవడం...వేస్ట్...ఏమంటారు అంది "
ప్రణవికి సీన్ అర్ధమైంది.ఆమెకూ
ఉత్సాహమానె వుంది...ఎందుకంటే చంద్రహాస్ రాబోతున్నాడు.ఇప్పుడు తనని,తమని
ఎకారూ ఏమీ చేయలేరు. కార్తికేయ,చంద్రహాస్ ఇద్దరూ కలిస్తే..ఈ ప్రపంచంలో
మాఫియా వచ్చినా ఏమీ కాదు.
ప్రణవి,ముగ్ధ కామ్ గా లేచి వాళ్ళ వెంట నడిచారు.షాకవ్వడం వాళ్ళ వంతయింది.
********************
ఎనిమిది దేశాల నుబ్చి వచ్చిన మాఫియా మూడు గ్రూపులుగా చీలింది. బ్లాక్
క్యాట్ కమెండో శిక్షణ పొందిన వాళ్ళు...మనుష్యులను అతి కిరాతకంగా
చంపేవాళ్ళు...ఈ గ్రూపులలో వున్నారు.ఒక గ్రూప్ వైజాగ్ లో చంద్రహాస్ ని
ఫినిష్ చేయడానికి,మరో గ్రూప్ కార్తికేయను ,ఇంకో గ్రూప్ ఒక వేళ వాళ్ళిద్దరూ
తప్పించుకుని వస్తే,ముగ్ధ,ప్రణవి లను అడ్డం పెటుకుని అందరినీ ఫినిష్
చేయడానికి.
********************
(ఈ క్లయిమాక్స్ ని మీరు గెస్ చేయగలరా ? గెస్ చేయగలిగితే మాకు ఈ రోజు
అర్ధరాత్రి పన్నెండు లోగా మెయిల్ చేయండి. మీరూహించని ముగింపును రచయిత
విసురజ మీ కోసం రాసారు..గెస్ చేయగలరా ?
)
No comments:
Post a Comment