1) బరువు
బాధ్యతల క్రమంలో జీవితపు సంఘర్షణ రణంలో ఎప్పుడు నీవు వెనకడుగు వేయకు. ఏ
ప్రపంచ చరిత్ర చూసిన రణంలో/యుద్దంలోనైనా లేక జీవన సంగ్రామంలోనైనా వెన్ను
చూపిన వారిని క్షమించలేదు. అటువంటి వారిని పరిహసించి, పరాభవించి,
గౌరవహీనులుగ పరిగణించేరు. వెన్ను చూపే వన్నెకెక్కడు. విజయమో వీరస్వర్గమో
పోరాడి తీరవలసిందే.
2) జీవన తీరంలో చల్లగాలుల వల్ల ఆహ్లాదభరిత
వాతావరణం వున్నట్టుగానే ఆ జీవనపు తీరానికి ఒడిదొడుకుల కెరటాలు కూడా
తాకుతుంటాయి. అలాగే మరెక్కడో కల్లోలం జరిగిన నీ జీవనపు తీరాన్ని ఒకోసారి ఆ
కల్లోలపు తుఫాను కూడా పలకరిస్తుంటుంది. పన్నీరిచ్చినా, కన్నీరిచ్చినా ఆ
జీవనపు తీరంలో దొరికాయి కాబట్టి అన్నిటినీ సమానంగా తీసుకుని మనుగడని
ముందుకు తీసుకెళ్ళాలి.
.........
విసురజ
(P.S....మనిషి ఎల్లవేళలా సకల సుఖాలతో వర్ధిల్లడం దుర్లభం, అత్యాశే అవుతుంది)
No comments:
Post a Comment