దీక్షిత రామాయణం...దీక్షిత విరచిత రామాయణం ఆ శ్రీరామునికే అర్పణం అదే శ్రీరామార్పణం .
శైలి : దీక్షితుల సుబ్రహ్మణ్యం
(ప్రముఖ రచయిత విసురజ సమర్పణలో, ప్రత్యక్ష నిత్య ప్రర్యవేక్షణలో...)
............................................................................................................................

జగతికి ఆదర్శం...దేశ ప్రగతికి దిశానిర్దేశం, సమాజ హితానికి సౌలభ్య సందేశం, మాటకి, మైత్రికి, తృష్ణకి సముచిత సమాహారమే శ్రీ రామాయాణం. ఈ జగాన రామనామ గానం...సుమధురం మరియు పరమ పవిత్రం...ఏక పత్నీవ్రతానికి, ఆడి తప్పని మాటకు, పితృవాక్య పరిపాలనకు, సమస్త ప్రజల మనోభీష్టసిద్ధి సంరక్షణకు... శ్రీ రామాయణం ప్రామాణికం, జనులకు పరమపద సోపాన సుమార్గం, అజరామర అనురాగానికి అక్షరామృతం.. శ్రీ రామాయణం. అలాంటి శ్రీ రామాయణాన్ని తేట తెనుగులో, సులభ శైలిలో, అలతి అలతి పదాల కూర్పుతో, పండిత-పామరులకు, నేటి వర్తమనానికి, రేపటి భవిష్యత్తుకు, దిక్సూచిగా, ఆదర్శనీయంగా, తమ్ముడు/ఇష్టుడు సవ్యసాచైనా దీక్షితులు సుబ్రహ్మణ్యం అందిస్తున్నాడు.
నేటి ఆధునికంలో, త్వరపడు ప్రజానిక గమనంలో నిత్యం మనం విస్మరింస్తున్న ఎన్నో జీవిత సత్యాలను, ఆవిష్కరిస్తూ, మీ ముందుకు త్వరలో వస్తోంది. ఇలాంటి రచన చేయడానికి విద్వత్తు ఒక్కటే సరిపోదు, పరిశీలన, భక్తిభావం, నిజాయితీ కావాలి. కాల్పనిక విషయాల జోలికి వెళ్ళకుండా, భక్తీ భావంతో రామాయణ ప్రాశస్త్యాన్ని తెలియజేయాలి. ఈ ప్రయత్నంలో తమ్మ్డుడు దీక్షితులు సుబ్రహ్మణ్యం సఫలీకృతుడు అయ్యాడని చెప్పగలను. ఆ శ్రీ రాముడి ...సాకేత సార్వభౌముడి కృపకు పాత్రుడయ్యాడు కనుకనే...ఈ రోజు ఈ మహాద్గ్రంధం మీ ముందు డైలీ ధారావాహికగా వస్తోంది. మనమందరం ఈ శ్రీరాముని కధకు మన పురాణ ఇతిహాసానికి మనస్ఫూర్తిగా స్వాగతిద్దాం, తమ్ముడు దీక్షితుల సుబ్రమణ్యంని నిండుమనసుతో అభినందిద్దాం.
ఈ సమయంలో మరొకర్ని స్మరించుకోవాలి, మరో విషయం చెప్పుకోవాలి. అర్దవిహీన, అర్ధనగ్న, బూతుసాహిత్యాలు పట్టు, పెట్టని కోటలా, గోల గోషాలు రాజ్యమేలుతున్న తరుణాన ఈ శ్రీ రామాయణానికి చేయూతనిచ్చి అన్ని పత్రికలు ఒక్కటి కావు, అందరు చీఫ్ ఎడిటర్ లు ఒక్కలా వుండరు అని ప్రత్యక్షంగా నిరూపించిన మన 'మాన్ రోబో మాగ్ జైన్' మరియు 'ది గ్రేట్' విజయార్కే గురించి ఈ సమయంలో ఎంత చెప్పిన తక్కువే అని మీరందరూ ఒప్పుకుంటారుగా...
ఈ శ్రీ రామాయాణం ఆసాంతం అద్భుతంగా పసిబాలలు సైతం అర్ధం చేసుకునే విధంగా సరళమైన రీతిలో రంజించే విధంగా వుంటుంది. నాకు ఈ మహత్తర అవకాశాన్ని అందించిన తమ్ముడు దీక్షితులు సుబ్రహ్మణ్యంకి అలాగే నాచే ప్రేమగా అన్నయ్య అని పిలుపించుకునే శ్రీ విజయార్కే గారికి అన్నిటికి మించి నాకు అద్భుత విషయాన్ని/శ్రీ రామాయణాన్ని ముందు మాట, సమర్పణ, పర్యవేక్షణ అదృష్టాన్ని కలిగించిన నా దేవదేవుడు..శిర్ది సాయినాధునికి నమోవాక్కములతో....
నా సమర్పణలో, ప్రత్యక్ష నిత్య ప్రర్యవేక్షణలో ఈ శ్రీ రామాయణం ప్రతి ఎపిసోడ్ తగిన బొమ్మలతో మిమ్మల్ని కలుస్తుంది, తప్పక అలరిస్తుంది అని నమ్ముతూ...
మీ
విసురజ (జగన్నాధ్ వెళిదిమళ్ళ)

1)
మానిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీ: సమాః
యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్
అంటూ మహర్షి వాల్మీకి నోటి వెంట అప్రయత్నంగా వెలువడిన అద్భుత చందోబద్ధ శ్లోకం రామాయణానికి నాంది పలికింది.
ఈ శ్లోకమందలి చందో వైభవం చాల విశిష్టమైనది.
ఆ చంద్ర తారార్కమూ శ్రీరామ కథను సజీవంగా జనం నోటి వెంట పలికించడమే గాక వారి మనో ఫలకాల పై ఆ దివ్య గాధను సుప్రతిష్టితం చేసిందీ రచనా వైశిష్ట్యం.వాల్మీకిని ఆది కవిగా జగత్ ప్రసిద్ధం చేసిన ఈ శ్లోకం నేపథ్యం కడు విచిత్రం. అసలు వాల్మీకి చరితమే అత్యంత అబ్బురం. ఆయన ఈ జగతికి అందించిన రామకథా సారమే ఒక మహాద్భుతం...మహిమాన్వితం...!
పూర్వాశ్రమంలో వాల్మీకి మహర్షి కాదు కదా కనీసం సజ్జనుడు కూడా కాదు. అడవి దారుల వెంట సాగే పుణ్యాత్ములను దారి కాచి దోచుకుని ఆ పాపపు సొమ్ముతో బతికే దుష్టుడు. గుణముచేత మహా క్రూరుడైన ఈ చోరుడు పురాకృత పుణ్య పాప సంచిత కర్మలు రెంటినీ ఘన రాశిగా కలిగిన వాడు. ఆ పాప వశాన అలా ఎన్నో ఏండ్లు అడవి దారులలో దొంగ గా నిస్సారమైన జీవనంగడిపాడు. వక్రమార్గాన సంపాదిస్తూ కుటుంబ పోషణ గావించే వాడు.అయితే పురాకృత పుణ్య వశాన ఒకనాడు అతడికి సప్తర్షులు తారసపడ్డారు.అది ఒక గొప్ప ఉదయం.... ధార్మిక జగతికి మహోదయం.
ఆనాడు శుద్ధులై హరిస్మరణ మగ్నమైన విశుద్దాంతరంగులై ఒక కీకారణ్యం మీదుగా పయనిస్తున్నారు సప్తర్షులు.వారి దివ్య తపోశక్తి ప్రభావం అనన్యమైనది.. వారు సాగుతున్న బాట మొత్తం దివ్య కాంతులీను తున్నది. క్రూర జంతువులు, సహజ జాతివైరులు కూడా దుష్ట స్వభావం మరచి శాంతులైసంచరిస్తున్నాయి. ఓం నమో నారాయణాయ.. ఓం నమఃశివాయ.. మంత్ర ధ్వనులు మంద్రమై ఆపరిసరాలలో వ్యాపిస్తూ అలౌకిక అవ్యక్త ఆనందాన్ని నింపుతున్నాయి.సమస్తమూ ఇంతటి అద్భుతానికి లోనవుతున్న వేళ ఏ ప్రభావమూ పడని శుద్ధ లౌకికుడు ఆ చోరుడు ఒక్కడే...భువి సమస్తానికి అమృత ధార అనదగ్గ రామకథా దివ్య ఔషధాన్ని పంచే ఒక దివ్య ప్రణాళికకు ఆ క్షణం తెర లేచింది.
సప్తర్షులు చోరునికి ఎదురయ్యారు...పశు ప్రవృత్తి కలిగిన మనిషికి సంస్కారం ఏముంటుంది? ఎదుటి వారి గొప్పదనంతో నిమిత్తం మాత్రం ఏముంది గనుక.. ? సప్తర్షుల వద్ద ఉన్న సంపదను దోచుకోవాలని సంకల్పించాడు ఆ చోరుడు..వారిని అటకాయించాడు. కత్తి చూపి బెదిరించాడు. తన పూర్వ నేరాలు, ఘోరాలను చెప్పి వారిని భయపెట్టే ప్రయత్నం గావించాడు.కమండలంతో సహా ఉన్నదంతా అక్కడ పెట్టి వెళ్ళమని హుంకరించాడు.అడవిలో నివసిస్తూ ఇంద్రియాలను నిగ్రహించి తపస్సు చేసుకునే తమ వద్ద భౌతిక సంపదలు ఉండవని వారెంత చెప్పినా వినలేదు. అయితే మహర్షులు మహిమాన్వితులు.. లోకోద్ధరణ మాత్రమే వారికి తెలిసిన విద్య.. ఆ చోరునిలో వారికి క్రౌర్యం మాత్రమే కనిపించలేదు. ఏ మూలనో అతడి పూర్వ సంస్కారాలు గోచరించాయి. అతడు సాధారణ వ్యక్తి కాదని.. చిన్న సంఘర్షణ కల్పించి సంస్కరిస్తే గొప్ప సంస్కర్తకాగలడని, మహర్షిగా మానవజాతికి మహోపకారం చేస్తాడని వారు గ్రహించారు.
(సశేషం, రేపు మరికొంత)

No comments:
Post a Comment