1) మనిషిలో
సేవా భావం వుండడం వల్ల పరోపకారం చేసే భాగ్యం కలుగు. సేవా భావానికి పర
హితానికై తపన పడే మంచి మనసు వుండడం ముఖ్యం. చేసిన సేవను చేసానన్న భావంతో
కాక మరింత చెయ్యాలన్న ఫీల్ తో నెరపాలి.. అప్పుడే జన్మ ధన్యత చెందే. నిజమే
కదా!
2) జన బాహుళ్యాన్ని నిత్యం పలకరించే తీరులోనే నీ జయాపజయాలు
పల్లవిస్తాయి. నవ్వుకు ప్రతినవ్వు బహుమతిగా తప్పక అందుతుంది. చల్లని మాట
చల్లని దీవెనలను మూటకట్టి తెస్తుంది.. ఔనంటారు కదూ....
(PS...త్యాగాన్ని మించిన ధనం, ఆనందం ఈ లోకంలో మరోటి లేదు)
No comments:
Post a Comment