ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 29 June 2013

 దీక్షిత రామాయణం

(9వ భాగం )
 Photo

ఎందరో ఉత్తములు రామాయణాన్ని తిరిగి చెప్పగా, మరెందరో వ్యాఖ్యానాలు రాశారు. సంస్కృతంలో వశిష్ట రామాయణం, ఆనంద రామాయణం, అగస్త్య రామాయణం, ఆధ్యాత్మ రామాయణం (వ్యాస విరచిత బ్రహ్మాండ పురాణాంతర్గతం) ఉంటే, తెలుగులో మొల్ల రామాయణం, భాస్కర రామాయణం, రంగనాథరామాయణం వంటివి ఉన్నాయి. అవధీ భాషలో తులసీదాస విరచిత రామచరిత మానస్ సుప్రసిద్ధం. ఇవే కాకుండా బెంగాలీ, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ తదితర భాషల్లోనూ, ఆంగ్ల భాషలోనూ రామాయణాన్ని పలువురు రచించారు.ఆధునిక కాలంలో కూడా రామాయణ కథను పలువురు మళ్ళీ చెప్పారు. మన దేశంలోనే కాదు పలు విదేశాల్లో కూడా రామకథ పలు కళారూపాలుగా, సాహిత్యంగా బహుళ ప్రాచుర్యం పొందినది. ప్రజల నాల్కలపై నానుతున్నది. వారి జీవన విధానాలపై విశిష్ట ప్రభావం చూపుతున్నది.ఎలా, ఎపుడు, ఎవరు చెప్పినా రామాయణానికి మాతృక వాల్మీకిదే. ఆయన చెప్పినదే రామకథ. ఇది మానవ చరిత్రలోనే ఒక అపురూపం. ఈ కథ పౌరాణికమే కాదు ఇతిహాసం కూడా. ధార్మిక జీవనం ఎలా ఉంటుందనేది రామాయణాన్ని చదివిన వారికి ప్రత్యక్షంగా అవగతం అవుతుంది.

No comments: