ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 23 June 2013

కవిత: కల కంటినే ప్రియ
......


Photo: కవిత: కల కంటినే ప్రియ 
......
మనసుతో నీ రూపమే కన్నాను చెలి
పెదాలతో నీ నామమే పలికాను నెచ్చెలి

వలపులో తలపువై వున్నావు
మదిలో మమతవై నిలిచావు

ఎదలో ప్రేమరవమై వినవచ్చావు
కధలో కావ్యనాయకివై కనవచ్చావు

గల గల నవ్వులతో నాగవల్లిగా మారేవు
బిర బిర నడకలతో వంశధారగా సాగేవు  

నగుమోములో విరిసే పున్నమి జాబిల్లి
నయనాలలో మెరిసే మెరుపువెలుగుల లోగిలి

తొట్రు పడే మనసు జరంత జాగ్రత్తంటోంది
తుళ్ళి పడే వయసు సౌక్యాలకై తొందరపెడుతోంది

తోడిన వలపునీళ్ళు తలపు గుండిగలో పోసా 
మ్రోగిన మనసునగారా ప్రేమరాగంలో పాట పాడే 
...
విసురజ 
మనసుతో నీ రూపమే కన్నాను చెలి
పెదాలతో నీ నామమే పలికాను నెచ్చెలి

వలపులో తలపువై వున్నావు
మదిలో మమతవై నిలిచావు

ఎదలో ప్రేమరవమై వినవచ్చావు
కధలో కావ్యనాయకివై కనవచ్చావు

గల గల నవ్వులతో నాగవల్లిగా మారేవు
బిర బిర నడకలతో వంశధారగా సాగేవు

నగుమోములో విరిసే పున్నమి జాబిల్లి
నయనాలలో మెరిసే మెరుపువెలుగుల లోగిలి

తొట్రు పడే మనసు జరంత జాగ్రత్తంటోంది
తుళ్ళి పడే వయసు సౌక్యాలకై తొందరపెడుతోంది

తోడిన వలపునీళ్ళు తలపు గుండిగలో పోసా
మ్రోగిన మనసునగారా ప్రేమరాగంలో పాట పాడే
...
విసురజ

No comments: