ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 29 June 2013

1) జీవితపు పరుగు పందెంలో గెలవడం చాల ముఖ్యమే ప్రమాణాలు మరియు విలువలను నిలబెడుతూ గెలిచిన తీరే మహోన్నతమైనది, పది మందికి మార్గదర్శకమైయ్యేది.. విలువలు, ప్రమాణాలు విడిచి గెలిచిన గెలుపు వన్నేలేని వర్ణం లాంటిది, తీపిలేని తేనే వంటిది వంటిది.. చెప్పుకోడానికే తప్ప ఆస్వాదింపవీల్లవ్వనిది.

2) విషయ గ్రహణకి చెవులుండి, చూచేందుకు కళ్ళుండి నిజాల్ని వినలేనివాడు, కనలేనివాడు నిజమైన బధిరుడు, అంధుడు..మనసుండి మమతని గ్రహించనివాడు బండరాయితో సమానుడు.

(PS....విలువ వలువను విప్పరాదు, విడిచినచో ముందైన కాస్త వెనకైనా అభాసుపాలు కాక తప్పదు)

No comments: