ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 23 June 2013

1) మేలు జరగాలి భవిత బంగారం కావాలి అంటూ చేతిలో చెయ్యివేసుకుని కూర్చుంటే తలపెట్టిన కార్యం సఫలమవుతుందా... .నొప్పి కాకుండా సూది పొడవబడుతుందా.. అందుకే అంటారు కష్టే ఫలి ని.

2) నవ్వులాటకు కూడా జీవితం నగుబాటని, బాలేదని అనరాదు. సత్యం, అన్నం, జీవితం, జీవం ఆ పరంధాముని ప్రసాదం. ఈవ్వీటితో పరాచికాల ప్రహసనాలుకి కూడా దూరంగా వుండాలి. విజ్ఞానం మనిషి వికాసానికి తోడ్పడి జీవితాలు సఖమయం చేసుకోవాలి.


(P.S>>>జగడాలాడే వాళ్ల జీవితం జగత్తునా 'జస్ట్ ఏవరేజ్ 'గా అటుఇటుగా, ఆటుపోటుగా సాగుతుంది)

No comments: