ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 29 June 2013

1) జీవితంలో తప్పులు జరుగుతూ వుంటాయి, కొన్నీ తెలియక మరికొన్నిమన అతితెలివితో అవుతూ వుంటాయి. అలాగే జీవితంలో ఎప్పుడోకప్పుడు పొరపాటునో, మన గ్రహపాటునో మరి లేక కావాలనో అవతలివాళ్ళ వల్ల మనకు అన్యాయం జరుగుతు వుంటుంది. జీవనం సజావుగా సాగాలంటే అటువంటివి మన్నించడం మంచింది మరచిపోవడం మరీ మంచిది.
2) కాలగమనంలో బ్రతుకు పోరాటంలో అధర్మంగా పోకు, అన్యాయం సహింపకు, న్యాయాన్ని మీరకు అని దక్షుడైనవాడు నొక్కి పలుమార్లు నొక్కి వక్కాణిస్తాడు. మరి చెవులతో విన్నవాడు విమర్శిస్తాడు, కళ్ళతో చూచినవాడు వివరిస్తాడు..
(PS... ప్రేమించడంలో, ప్రేమించబడడంలో బ్రతుకు పరమానందం ఇమిడి వుంది)

No comments: