ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 29 June 2013

జై షిర్డీ సాయినాధ 
 ఆరో అంకం..

శ్రీ సాయిసత్చరిత్ర వ్రాయుటకై హేమాద్రిపంత్ కి సాయిబాబా ఒసిగిన అనుమతి మరియు వాగ్దానం

శ్రీ సాయిసత్చరిత్ర వ్రాయుటకై హేమాద్రిపంత్ సాయిబాబ అనుమతి కోరగా సాయిబాబా యిట్లంటిరి.. "సత్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతినిస్తా.. నీ పనిని నీవు నిర్వర్తించు, భయపడకు, మనస్సు నిలకడగా ఉంచు. నా మాటపై విశ్వాసముంచు. నా లీలలు వ్రాసినచో చదువురానితనం నిష్క్రమించు. అలాగే సాయి సత్చరిత్ర భావ విషయాలను శ్రద్ధాభక్తులతో ఎవరైతే వింటారో వారికి ప్రపంచమందు మొహం తగ్గు, మమత క్షీణించు. బలమైన భక్తితో కూడిన ప్రేమ కెరటాలు లేచే. ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞాన రత్నములు లభించును."
ఇది విన్న రచయిత హేమాద్రి పంత్ మిక్కిలి ఆనందం చెంది వెంటనే ధైర్యస్తుడయ్యే. ఆ రచయత తలపెట్టిన వ్రాత కార్యము జయప్రదంగా సాగునని ధైర్యము కలిగే. ఆనాడు సాయిబాబా చెప్పిన మాటలు భావాలే ఆశీర్వాదాలుగా తలచి నేను కూడా ఈ సత్చరిత్ర తెలుగులో వాడుక బాషలో వ్రాయ సంకల్పించి, ముందుగా సాయిబాబా గుడికెళ్ళి వారిని ఈ నా సత్చరిత్ర జై షిర్డీ సాయినాధ పేరుతో వ్రాసే ప్రయత్నంలో పూర్తీ సహకారం, ధైర్యం, తెగువా ఓపిక ఇవ్వమని ప్రార్ధించా. వారినే నన్ను గమనించి ఆవహించి నాలోకి చేరి తమ కధను మరింత రమ్యంగా అలంకరించాలని విన్నపం సాయిబాబా..

మాధవరావు దేశపాండే అనే భక్తుడితో సాయిబాబా యిట్లనెను.
"నా నామము ప్రేమతో నుచ్చరిస్తే వారి కోరిక లన్నియు తీరుస్తా. వారి భక్తిని హెచ్చించెద. వారిని అన్ని దిశలందు, అవస్థలందు తప్పక కాపాడుతా. ఏ భక్తులయితే మనఃపూర్వకముగా నాపై అధారపడియున్నారో వారీ కథలు వింటుంటే మిక్కిలి సంతోషం కలిగే. నా లీలలు పాడే వాళ్ళకి అంతులేని ఆనందం శాశ్వతమైన తృప్తిని ఇస్తుందని నమ్ము. ఎవరయితే శరణాగతంటూ వేడెదరో మరి నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా ఆకారమును మనస్సున నిలిపెదరో వారిని బంధనాల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము. ప్రపంచములోని వాటిన్నటిని మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా కథలను జీవితమున మననం చేయుచు, ఎల్లప్పుడు నన్ను జ్ఞప్తికి వుంచుకునే వాళ్ళు ప్రపంచ విషయాలను ఎందుకు తగులుకొందురు? వారిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథలే వినినచో అది సకల రోగములు నివారించును. కాబట్టి భక్తిశ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనస్సున నిలుపుము. ఆనందంనకు తృప్తికి నిదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వ అహంకారులు తొలిగిపోవును. వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధచైతన్యంతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి యను నామమును జ్ఞప్తికి వుంచుకున్న మాత్ర వుంటే, చెడు పలుకుట వలన, వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును."

బాబా కథలు దీపస్తంభములు
సముద్ర మధ్య భాగమందు దీపస్తంభములుండు. నావలపై, పడవలపై వెళ్ళేవారు ఆ దీపపు వెలుతురు వల్ల సముద్రంలో వుండే రాళ్ళు రప్పల వల్ల కలుగు హానిని తప్పించుకొని సురక్షితముగా పోవుదురు. ప్రపంచమను మహాసముద్రంలో సాయిబాబా కధలు దీపాలై దారిచూపు. అవి అమృతం కంటే తియ్యగా వుండి ప్రపంచయాత్ర చేయు మార్గం సులభమవ్వే, అలాగే మంచి మార్గం చూపే. యోగీశ్వరుల కధలు పవిత్రాలు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించునపుడు శరీర స్పృహ, అహంకారం, ద్వంద్వభావాలు నిష్క్రమించు. అటువంటి సాయిబాబా కధలను మనం కూడా మన హృదయమందు నిల్వచేసినచో పలు సందేహాలు పటాపంచలవ్వు. శరీరగర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వచేయబడు. శ్రీ సాయిబాబా కీర్తి, వర్ణనలు ప్రేమతో పాడినగాని వినిన గాని భక్తుని పాపాలు పటాపంచలవ్వవు. కాబట్టి సాయిబాబా కధలే మోక్షానికి సులభసాధనం. కృతయుగంలో శమదమములు (అనగా నిశ్చలమనస్సు, శరీరము), త్రేతాయుగంలో యాగము, ద్వాపరయుగంలో పూజ, కలియుగంలో భగవన్నామ నామాలమాలను పాడుట, మోక్షమార్గములు. నాలుగు వర్ణములవారు ఈ చివరి సాధనాన్ని అవలంబించవచ్చు. తక్కిన సాధనములు అనగా యోగం, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని, మహిమలను పాడుట అతిసులభము. మనమనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలె. భగవత్ కధలను వినుట వలన పాడుట వలన మనకు శరీరమందు గల అభిమానము పోవును. అది భక్తులను నిర్మోహులుగా జేసి, తుదకు ఆత్మసాక్షాత్కారము పొందునట్లు చేయు. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సత్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సులభముగ చదువగలరు; వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు సాయిబాబాను ధ్యానించు. వారి స్వరూపమును మనస్సునందు మననము చేసికొ. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు నిజభక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సత్చరితామృతంను వ్రాయుట సాయి బాబాయొక్క కటాక్షముచే సిద్ధించే. నేను నిమిత్త మాత్రుడిని సాయిబాబా నేను నీ మిత్రుడిని కాదల్చా .

బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు
ఒకనాడు మధ్యాహ్నహారతైన తరువాత పిమ్మట భక్తులందరు తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు సాయిబాబా యీ క్రింది చక్కని యుపదేశమిచ్చిరి.
“మీ రెక్కడ నున్నప్పటికి నేమి చేసినప్పటికి నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయాలను పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. ప్రపంచమందు గల చరాచర జీవకోటి నావరించి యున్నాను. ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే. నేనే, జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టి స్థితిలయకారకుడను నేనే. ఎవరయితే తమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారిని మాయ శిక్షించదు. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచరజీవకోటి యంతయు నా శరీరమే, నా రూపమే.”
సాయిబాబా కధను చదివే వాళ్ళకు బద్ధకము, నిద్ర, చంచలమనస్సు, శరీరమందలభిమానము మొదలగునవి వుండవు, వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలే. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలిసికొందురు గాక. ఇతర మార్గములవలంబించి నలసిపోవద్దు. అందరు నొకే మార్గమును త్రొక్కుదురు గాక. అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి యజ్ఞానమును నశింపజేయును; మోక్షమును సంపాదించి పెట్టును. లోభియెక్కడ నున్నప్పటికిని వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు, సాయిబాబాను కూడ నెల్లూరు వాళ్ళు తమ హృదయమందు స్థాపించుకొందురుగాక.
(మరికొంత రేపు.. సశేషం)

శాంతి శాంతి శాంతి హిం.. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
ఓం నమో సాయినాథాయ నమః
శుభం భవతు

No comments: