ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 27 June 2013

1) సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం ఇవ్వన్నీ ఎప్పుడునుంచో వున్నా ఎప్పుడూ చూడ ముచ్చటగా నిత్య నూతనంగానే కనిపిస్తాయి. అలాగే ప్రకృతి అందాలు, వన సౌరభాలు, సముద్రపు తీరం వెంబడి కెరటాల ఉరుకులు పరుగులు ఎప్పుడూ అలరిస్తూనే వుంటాయి, కారణం అవన్నీ ఎంత పాతవైనా దైవదత్తం/ప్రక్రుతి ప్రసాదించిన వరం. మానవ మేధ చేసిన కట్టడాలు ఎంత అందమైనవైనా అయినా కొంతకాలానికి వాటి వెలుగు నశనమవుతుంది... కారణం మన చేతలలో ఆత్మశుద్ది లోపించడమే..

2) తెలిసినవాడు నసుగుతాడు, తెలియనివాడు అడుగుతాడు విషయ వివరణని మానసద్దాల మేడలో నిజాల దర్బారులో చూచినా పిమ్మట అబద్దం పట్టుబడినపుడు.. తెలియండి

(PS....తెలివి ప్రారంభంలోను వివేకం కాలం గడిచేకా సత్ఫలితాలు ఇస్తాయి)

No comments: