దీక్షిత రామాయణం
(7వ భాగం )

ఆ శ్లోకంలో నిండి ఉన్న చందో వైభవం వాల్మీకిని మరింత అబ్బుర పరచింది. ఇది తాను అనుకొని చెప్పిన శ్లోకం కాదని అనుకోకుండా తననుంచి వ్యకమైనదని గ్రహించాడు. అదెలా జరిగినదో తెలియక కలత చెందాడు. తాపసి నైన తాను అరిషడ్వర్గాలకు దూరంగా మెలగ వలసినది పోయి అలవి కాని క్రోధానికి లోనై శపించడం విపరీతంగా తోచింది వాల్మీకికి.పైగా ఆ శాప శ్లోకం సైతం తనకేన్నడూ పరిచయం కూడా లేని చందస్సుతో కూడి ఉండడం చూసి అచ్చెరువొందాడు. ఇది తన ప్రమేయం లేని విషయమని.. ఏదో ఈశ్వర కల్పితమని తుదకు ఆ తపస్వి నిర్ధారణకు వచ్చాడు. కానీ పరితాపం మాత్రం ఆయనను వీడి పోలేదు.
క్రౌంచ పక్షుల మరణం ఒక కారణమైతే... తన శాపం మరో కారణంగా ఆ ఋషి అలా వ్యథ చెందుతూనే ఉన్నాడు.కాలం గడుస్తున్నా వాల్మీకి వేదన తీరడం లేదు.
ఇది చూసిన బ్రహ్మదేవుడు ఆ ఋషి వ్యాకులతను దూరం చేయాలని తలచాడు.అనుకున్నదే తడవుగా ఆ మహర్షి ఎదుట ప్రత్యక్షం అయ్యాడు.
ఈ ఆకస్మిక అనుగ్రహానికి అమితంగా సంతోషించాడు వాల్మీకి. బ్రహ్మదేవుని భక్తితో స్తుతించాడు.
"వాల్మీకీ.. నీవు గొప్ప తపశ్శాలివి. అరిషడ్వర్గాలపై నీవు ఎప్పుడో అదుపు సాధించావు. నీవు ధర్మాధర్మ విచక్షణ, వివేచనా కలిగిన పరిపూర్ణ జ్ఞానివి. నీ మనసులో ఉన్న ఆందోళన, ఆవేదన నాకు తెలుసు. అయితే జరిగిన దానిలో నీ ప్రమేయం లేదు. జరిగినది అంతా లోక కళ్యాణార్థమే.. అది తెలుసుకో.. ఇక శాంతుడవు కా.
మరో ముఖ్య విషయం చెబుతాను విను.. నా అనుగ్రహం వల్లనే సరస్వతి నిన్ను కటాక్షించింది. ఆమె ప్రభావమే నీ నోట అద్భుత శ్లోకమై పలికింది. అంతే తప్ప ఇందులో నీవు శపించావని తలచి పరితపించేందుకు ఏదీ లేదు" అంటూ బ్రహ్మ దేవుడు అనునయించాడు.
సాక్షాత్తు విధాత చెప్పడంతో వాల్మీకి హృదయం కుదుట పడింది. అతడు వేదన నుంచి విముక్తుడవడం చూసిన బ్రహ్మదేవుడు చిరు మందహాసంతో పలికాడు..
నీవు సరస్వతీ అనుగ్రహంతో పలికిన శ్లోకం చూసావు గదా.. అదే చందస్సుతో శ్రీ రామాయణ గ్రంథాన్నిరచించు. అది నారాయణ చరితం. నీవు రచించిన ఆ రామకథ విష్ణు విభూతిగా లోకాలను తరింపజేస్తుంది. సర్వకాల సర్వావస్థలకు తగిన రీతిలో జనులకు సద్గతులను అనుగ్రహిస్తుంది. స్వయం ధర్మ స్వరూపమై భాసిస్తుంది. ఆది కావ్యమై ఆచంద్ర తారార్కం అలరారుతుంది.
సరస్వతీ కటాక్షం చేత ఇందు నీ వాక్యం ఎచ్చటనూ అసత్యం కానేరదు. ఇది సత్యం.
ఇక చింతను వీడి కర్తవ్య బద్ధుడవు కమ్ము. పవిత్రంగా.. రమ్యంగా... అద్భుత శ్లోకబద్ధంగా రామాయణాన్ని రచించు." అంటూ వాల్మీకిని వాత్సల్యంతో ఆశీర్వదించాడు విధాత.
బ్రహ్మ దేవుని ఆదేశం విన్నతోడనే వాల్మీకి బ్రహ్మానందంతో పొంగిపోయాడు.
నారదుడు చెప్పినపుడు రామకథను లీలగా విన్నాడు వాల్మీకి. కానీ ఏదీ గుర్తు లేదాయే..మరెలా?
వాల్మీకి సందేహం అర్థమైనది బ్రహ్మకు.
నారదుడు తొలుత చెప్పిన దానికంటే విశదంగా, విపులంగా... కథలోని ప్రతి పార్శ్వం అర్థం అయ్యేలా..ప్రతి పాత్ర తత్వం పరిపూర్ణంగా అవగతం అయ్యేలా వాల్మీకికి వరాన్ని అనుగ్రహించాడు.
నీవు రచించే ఈ రామకథ భువిని శాశ్వతంగా రంజింప జేస్తుంది. మానవులకు ధర్మార్థ కామ మోక్షాలను సిద్ధింప జేస్తుంది. ధర్మ గ్రంథమై ప్రకాశిస్తుంది.అంతేకాదు నాయనా... ఈ గ్రంథ రాజం భూమిపై నిలిచి ఉన్నంత కాలమూ నీవు నాతొ పాటు సత్యలోకంలో వసిస్తావు... అని ఆశీర్వదించిన బ్రహ్మదేవుడు అంతర్థానం అయ్యాడు.
వాల్మీకి, ఆయన శిష్య బృందం ఇంకా సంభ్రమం నుంచి తేరుకోలేదు...ఆ తదుపరి వాల్మీకి, శిష్య సమూహం పలుమార్లు ఈ శ్లోకాన్నిపఠించారు.
మానిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీ: సమాః
యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్
ఇలా చదివే కొద్దీ చవులూరుతున్న ఆ శ్లోక మహిమను గాంచి వారు అత్యంత ఆశ్చర్యానికి లోనయ్యారు.
లక్షలు, కోట్ల సంవత్సరాల పాటు ఈ దివ్యకథ జనుల నాల్కలపై సజీవంగా అలరారగలదని, ఎన్నెన్నో యుగాలను తరింపజేయగలదని వారికి ఆనాడే తోచింది.
(రమణీయం,కమనీయం,పరమ పావన రామాయణం..ఇంకా వుంది .రేపటి వరకూ చదివిన భాగాన్ని పదిల పర్చుకోండి )

No comments:
Post a Comment