దీక్షిత రామాయణం
(8వ భాగం )

బ్రహ్మదేవుని వర ప్రభావంతో రామాయణ కథను దర్శించిన ఆత్మ జ్ఞాని వాల్మీకి మహర్షి ఐదు వందల సర్గలతో. ఇరవై నాలుగు వేల శ్లోకాల సముచ్చయంగా రామాయణ మహా గ్రంథాన్ని జగజ్జన తారకంగా అందించాడు.ఇది బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ కాండలనే ఆరు విభాగాలుగా ఆవిష్కృతం అయింది.
గొప్ప గొప్ప వృత్తాలు, రమణీయ ఉపమానాలు, ఉత్కృష్ట పదజాలాలతో కూడిన వేలాది శ్లోకాలను రామకథా నిర్మాణానికి వాల్మీకి మహర్షి సృష్టించాడు. ఇవన్నీ కేవలం సాహిత్య పరంగా ప్రాధాన్యమైనవే కావు. వీటిలో ఎంతో ఆధ్యాత్మిక మహత్తు దాగి ఉంది. అద్భుత శక్తిదాయకాలైన బీజాక్షర సహిత శ్లోకాలు కూడా వీటిలో ఉన్నాయి. మహామహిమాన్వితాలైన వృత్తాంతాలు, ఉప కథలు కూడా ఈ రచనలో చోటు చేసుకున్నాయి.
అందుకే రామాయణం లోని ప్రత్యక్షరం ఒక శక్తి బీజం. ఏది చదివినా, ఏ శ్లోకం విన్నా, ఏ కాండను పారాయణ చేసినా కూడా మనో ఈప్సితాలు నెరవేరతాయి.
శ్రీరామ చంద్రుని సంతానం కుశలవులతో సహా అనేకమందికి వాల్మీకి రామకథను బోధించాడు. ఆ విధంగా పురుషోత్తమ చరితను లోకానికి వినిపిస్తూ ఆ మహర్షి తన జన్మను చరితార్థం చేసుకున్నాడు.
యుగ యుగాలుగా, తర తరాలుగా వాల్మీకి విరచిత రామ కథను లోకులు చదువుతూనే ఉన్నారు.. వింటూనే ఉన్నారు... తరిస్తూనే ఉన్నారు.
వాల్మీకి చెప్పిన రామకథ ఆద్యంతం మహాద్భుతం... అలౌకికానంద దాయకం.. అత్యంత మహిమాన్వితం...!
ఈ రామాయణ మహా గ్రంథం సనాతన ధర్మానికి, భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మగా భాసిస్తోంది. సద్గ్రంథ లక్షణాలు, కావ్య వైశిష్ట్యం, పుష్కలమై గోచరించడంతో పాటు నవరసాల మేలిమి మేళవింపు ఈ కథా సంవిధానంలో కనిపిస్తుంది. మానవ జాతిని యుగాయుగాలూ సమూలంగా సముద్ధరించే సమున్నత విలువల ఆవిష్కరణ ఇందు ద్యోతకం అవుతుంది.
రామ కథను తన అపూర్వ తపోశక్తి ఫలితంగా.. భగవదనుగ్రహంతో మానవాళికి అందించిన రామకథా సుధాస్రవంతి అక్కడితో ఆగిపోలేదు. ఆ మహనీయుని వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న అనేక మంది మహర్షులు, మహాత్ములు, పుణ్యాత్ములు ఈ కథను చెప్పారు. ఎవరు చెప్పినా.. ఎన్ని సార్లు.. ఎన్ని విధాలుగా చెప్పినా వాసి తరగని అద్భుత గాధ ఇది. అందుకే చెప్పిన కొలదీ... వింటున్న కొలదీ కొత్తగా, మధురంగా, రసభరితంగా, మనోహరంగా, జన తారకంగా, జ్ఞాన దాయకంగా, అద్భుత ఫలభరితమై ఒప్పుతూ ఈ దివ్య గాధ అందరినీ అలరిస్తోంది. ఎందరినో తరింప జేస్తోంది.

No comments:
Post a Comment