ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 29 June 2013

1) పదాల పల్లకీలో ఊరేగినాక, ప్రజల గుండెలలో కొలువున్నాక, జీవితంలో మెప్పు హాయి పొందినాక తెలిసేది ఒకటే.... పరుల మెప్పు వల్ల కలిగే మానసిక సౌఖ్యం, ఆహ్లాదం నోట్ల వేడితో అందేది కాదని అర్ధం అవుతుంది.

2) ధనం జీవితానికి సరియైన ఇంధనం కాదని అక్షరమ్మ లక్ష్మమ్మ ఒకేచోట వుండటం అరుదని అలాగే జీవనంలో ధనమే ప్రప్రధమం కాదని సులువుగా అర్ధమవుతుంది.


(PS.... తరుచుగా ఆత్మావలోకనం, అంతర్ముఖదర్శనం చేసుకుంటే మన నడవడికను సమీక్షుంచుకునే అవకాశముంటుంది.)

No comments: