ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 23 June 2013

ఆగష్టు1(టాగ్ లైన్ ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
10-06-2013 (Chapter-61)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనివార్యం...మరియప్ప లాంటి క్షుద్రమాంత్రికుడి ఉనికి ప్రపంచానికి ప్రమాదకరం. మనలోని ఈర్శాసూయ, ద్వేషాలు దుష్టశక్తులతో...మనకు మనమే చేతబడి చేసుకుంటున్నాం. మరియప్పలాంటి వాళ్ళు వీటికి ఆజ్యం పోస్తున్నారు. నిక్శూచిని నిద్రలేపగల ఒకే ఒక క్షుద్రమాంత్రికుడు, ప్రళయాన్ని సృష్టించడానికి, చివరి అంకాన్ని ప్రారంభించాడు. క్షణాల వ్యవధి.
ఒక విషవాయువు కొన్ని వేల ప్రజల జీవితాలను మృత్యువు సరిహద్దుకు చేరుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన విధ్వంసం, బాంబుల మోత..,వాటి ప్రభావం ప్రపంచాన్ని విషాదంలో ముంచింది. భోపాల్ దుర్ఘటన అత్యంత విషాదకరం...సైన్స్ ...మేథస్సు...వక్రమర్గంలోకి వెళ్తే జరిగే ఉత్పాతం ...
ఒక క్షుద్ర ఆలోచన, క్షుద్రప్రయోగం ...గాలిలో కలిసి కలుషితమై, దాడి చేస్తే జరిగేది....నిక్శూచి లాంటి ఒక విష ప్రయోగమే...
(దక్షిణాఫ్రికాలోని ఒక ఆటవిక తెగలోని జాతి, ఒక రకమైన విష వృక్షాలతో తయారు చేసిన రసాయనాన్ని శత్రువుల మీద ప్రయోగిస్తారు. అది సేవించినవారు విపరీత ప్రవర్తనతో ఒకరికొకరి శత్రువులుగా మారిపోతారట....ముసలం కూడా ఇలాంటి కథనాన్ని చెబుతుంది. విపరీత ప్రవర్తన రూపంలో...రచయిత)
నిక్శూచికి ఆకారం వుండదు...ఎప్పుడు ఏ శరీరంలోకి ప్రవేశిస్తుందో...ఏ వస్తువులోకి చేరి విధ్వంసాన్ని సృష్టిస్తుందో తెలియదు.
చివరి క్షణాలు...మరియప్ప పైశాచిక ఆనందంలో వున్నాడు. "తను నిక్శూచిని నిద్రలేపుతున్నాడు...తిరిగి క్షుద్రప్రపంచాన్ని సృష్టించబోతున్నాడు. ఆ ఆనందాన్నినియంత్రిస్తూ గంటారావం... అది మామూలు శబ్దాలు కావు. అతని ఏకాగ్రతను దెబ్బతీసే శబ్దాలు.
కార్తికేయ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అతనికి దైవ సంకల్పం అర్థమైంది, చేతిలో ఆయుధం లేదు...దష్టశక్తిని సంహరించడానికి మనిషి సృష్టించిన ఆయుధం అక్కర్లేదు...వెంకటేశ్వరస్వామి పాదాల చెంత గాలి దుమారానికి విరిగిపడిన కొమ్మ...ఒక్క క్షణం కార్తికేయకు మహామాన్వి ఖడ్గం గుర్తుకు వచ్చింది.
"నా కులదైవమా...నన్ను సదా వెన్నంటి వుండే దేవదేవుడా...ఇదే నీ సంకల్పం అయితే...నేను శిరసు వంచి శిరసావహిస్తున్నాను. నీ నామమే ఆయుధం..." రెండు చేతులు జోడించి ఆ విరిగిన కొమ్మను చేతిలోకి తీసుకున్నాడు. ఆ కొమ్మలోకి ఏదో దివ్యశక్తి వేంకటేశ్వరుడు విగ్రహంలోనుంచి ప్రవేశించినట్టు....
ఆ కొమ్మను చేతిలోకి తీసుకుని స్మశానం వైపు పరుగెత్తాడు.
ప్రణవికి స్పృహ తప్పుతోంది..ఆ స్పృహలో నుంచి..గతం గుర్తుకు వస్తోంది..
నిక్శూచి ఒళ్ళు విరుచుకుంటోంది.
*******************
(ఈ సస్పెన్స్ రేపటి వరకూ...)

No comments: