ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 23 June 2013

కవిత: పరవశః
............
కలువకు నెలరాజును చూస్తే పరవశం
తుమ్మెదకు నెత్తావులును చూస్తే పరవశం

కోకిలకు తొలకరిని చూస్తే పరవశం
మయురికి నల్లమబ్బులును చూస్తే పరవశం

ప్రాయానికి వయ్యారిని చూస్తే పరవశం
వయసుకు విరిపక్కను చూస్తే పరవశం

కనులకు వెలుగందాలు చూస్తే పరవశం
నాలుకకు మధురరుచులు చూస్తె పరవశం

పలుకుకు ప్రియభాష్యాలే పరవశం
సొబగుకు సుకుమారిసోకే పరవశం

పదాలకు కవితమ్మ చీర చుడితే పరవశం
భావుకతకు 'విసురజ' అక్షరపూలు ముడిస్తే పరవశం
.....

No comments: