దీక్షిత రామాయణం
(4వ భాగం )
************
దివ్యమైన రామ కథా శ్రవణంతో ఆ ప్రాంతమంతా హరితార్ణవమైంది. రామ కథను చెబుతున్న నారదుని నేత్రాలు ఆనంద పరవశంతో చెమర్చాయి. నారదుడి హృదయం పరిపూర్ణమైన ఆనందంతో నిండిపోయింది.అక్కడే పుట్టల మధ్య తపస్సులో మునిగి ఉన్నఅతడు కూడా ఈ కథను లీలగా విన్నాడు. ఈశ్వరమంత్ర ధ్యానంతో మొదలైన అతడి వ్యక్తిత్వ సంస్కరణ పర్వానికి ఈ రామ కథా శ్రవణంతో పరిపూర్ణత చేకూరింది..
ఏదో ఒక దివ్యానందభరితమైన అనుభవసారాన్ని అందిపుచ్చుకున్న అనుభూతి కలిగింది అతడికి.. మహోధృతమైన తపస్సుకు తోడు మహాద్భుతమైన రామచరిత అతడ్ని మహర్షిని చేసింది.. కానీ అతడికి తపోదీక్షలో ఉన్నపుడు విన్న విషయాలు పూర్తి స్థాయిలో జ్ఞాపకం లేవు. కానీ ఏదో ఒక పరమ రహస్యాన్ని తను విన్న అనుభూతి మాత్రం మనసంతా ఆవరించింది. తనువంతా నిండి పోయింది. ఇందుకు ఒక కారణం లేకపోలేదు.. విధాత ఆనాడు సత్యలోకంలో నారదునికి రామకథ చెప్పినప్పుడే ఇది దేవ రహస్యమని నొక్కి వక్కాణించాడు. అన్యులకు ఈ రహస్యాన్ని చెప్పరాదని ఆదేశించాడు.
కానీ లోక బాంధవుడైన నారదుడు ఆ మాట మరచి అరణ్య మధ్యాన కథా గానం చేసాడు.
ఇదంతా చూస్తూనే ఉన్నాడు పైనుంచి బ్రహ్మ దేవుడు. ఆయన మోముపై చిరునగవు పూచింది.
జరగబోయే చమత్కారం తన సృష్టి వైచిత్రిని మించిన విచిత్రమని తలచి ఆయన బహు సంతసించాడు ఆ క్షణంలో..
ఇక పుట్టలోని తపస్వి విషయానికి వస్తే.. ఏ క్షణంలో అయితే దివ్య కథాగానాన్ని విన్నాడో.. ఆ క్షణం నుంచే స్థిమితం లోపించింది. ఇక తపస్సు చాలనుకున్నాడు. అమితానందమూర్తిగా ఆ పుట్టల నుంచి బయటికి వచ్చాడు. పుట్ట (వాల్మీకం) నుంచి బయటకు వచ్చిన ఆ మహాత్ముడు అటుపై వాల్మీకి అని పిలువబడ్డాడు.
ఈ వాల్మీకి అక్కడే ఆశ్రమ జీవనం ప్రారంభించాడు. శిష్యులకు ఉత్తమ ధర్మాలను బోధిస్తూ, మంచి చెడుల విశ్లేషణలో, ధర్మాధర్మ విచక్షణలో జ్ఞానిగా మన్ననలను అందుకుంటూ వాల్మీకి వెలుగొందుతున్నాడు.
అన్నీ బాగానే ఉన్నా వాల్మీకి హృదయంలో మాత్రం ఏదో చింత మెదులుతూనే ఉంది. ఎవరో ఒక సచ్చిదానంద సత్పురుషుని గురించి ఏదో ఒక సుషుప్తావస్థలో విన్నట్టుగా ఒక చిన్న జ్ఞాపకం ఆయనను వీడడంలేదు. అయితే అది ఏ జన్మలో.. ఎక్కడ.. ఎవరి ద్వారా.. ఎవరి గురించి అనే సంగతి మాత్రం ఆ మహర్షికి స్ఫురణకు రావడం లేదు. భౌతిక విధులు నిర్వర్తిస్తూనే ఆ చిదాత్మ స్వరూపుని గురించి అంతర్లీనంగా సదా చింతన గావిస్తున్నాడు వాల్మీకి.
ఇలా ఉండగా ఒక నాడు ఒక సంఘటన జరిగింది. నారద మహర్షి ఏదో కార్యార్థమై వెళుతూ మార్గమధ్యాన వాల్మీకి ఆశ్రమం చెంత ఆగాడు.
తన ఆశ్రమానికి వచ్చిన ఆ దేవర్షిని వాల్మీకి అర్ఘ్య పాద్యాదులతో భక్తితో అర్చించాడు. అతిథి పూజ అనంతరం సద్గోష్టి మొదలైంది.
ఎంతో కాలంగా తనను వేధిస్తున్న ప్రశ్నకు, తన చింతకు త్రికాలవేది, త్రిభువన సంచారి అయిన నారదుడే సరైన పరిష్కారం చూపగలడని వాల్మీకికి తోచింది. వెంటనే జాగు చేయక తన మనసులోని సందేహాన్ని సముచిత రీతిలో ఆ మహనీయుడి ముందు ఉంచాలని తలచాడు వాల్మీకి.
(రమణీయం,కమనీయం,పరమ పావన రామాయణం..ఇంకా వుంది .రేపటి వరకూ చదివిన భాగాన్ని పదిల పర్చుకోండి )

No comments:
Post a Comment