ఆకాశాన్ని మబ్బమ్మలు చుట్టేస్తే
నెమలికి ఎందుకంత సంబరం చేసేనేల నాట్యం
ప్రకృతిని పచ్చదనాలు కప్పిస్తే
రాచిలుకకు ఎందుకంత సంబరం కూసేనేల గీతం
కడలిని కెరటాలే కుమ్మేస్తే
తీరానికి ఎందకంత సంబరం మీటినేల నురుగురాగం
మనసుని అనురాగం కమ్మేస్తే
వలపుకు ఎందుకంత సంబరం పొందెనేల పరవశం
.......
విసురజ
No comments:
Post a Comment