ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 25 June 2013

కవిత: ప్రేమ నివేదన
.....................


Photo Photo
ఈ నేల, ఈ ఏరు, ఈ ఊరు, ఈ కొండ గాలి
వీటన్నిటితో పాటు ఈ సమయంలో నీవు వుంటే
యివన్నీ చాల అందంగా వుంటాయి
బాగుంటాయి హాయి గొలుపుతాయి

నువ్వు నేను ఎంత దగ్గరగా వున్నా దూరంగా ఉన్నామో
అంతే దూరంగా వుండీ కూడా దగ్గరగా వున్నాయి జాబిలీ నక్షత్రాలు
నిజం చెప్పాలంటే తారలకు నెలరాజుకు లేని మోమాటాలు నాకేలనో
నీ ముందు మనసు విప్పాలంటే నాకు ఈ జంకు బెరుకు ఎందువలనో

ఏటిలోని చేపని ఒడ్డున పడేస్తే ఎంత కొట్టుకుంటుందో
హృదిలోని మాటని నీతో చెప్పాలని మనసు అంత కొట్టుమిట్టాడే
కళ్ళల్లోకి చూసి నా వలపు చదవలేవా నీపై ప్రేమను తెలియలేవా
మనసు తివాచి నీకై పరచా నడిచి రాలేవా నా ఎదఎడారిని సస్యశ్యామలం చేయవా

ఈ నేల, ఈ ఏరు, ఈ ఊరు, ఈ కొండ గాలి
వీటన్నిటితో పాటు ఈ సమయంలో నీవు నా ప్రేమకు ఊ వుంటే
యివన్నీ చాల అందంగా వుంటాయి మన కోసమే ఉన్నాయనుకుంటా
బాగుంటాయి హాయి గొలుపుతాయి మనకై వేచి వున్నాయి తలపోస్తా
.....
విసురజ
(బాలికా బధు అనే హిందీ సినిమాలోని 'బడే అచ్చే లగ్తే హై" అనే పాట పల్లవిలోని మూలార్ధము తీసుకుని స్వేచ్చగా నా శైలిలో రాసిన కవిత/పాట.. విశేషం ఏమిటంటే ఈ పాటతోనే "కిషోర్ కుమార్" అబ్బాయి అమిత్ కుమార్ సింగర్ గా సినీ రంగ ప్రవేశం చేసాడు.. రాజశ్రీ వారు తమ బ్యానర్ లో చేసిన గొప్ప సినిమాల్లో ఒకటి. ఇందులో సచిన్ బౌమిక్ హెరొ. మరో విశేషం ఏమిటంటే ఇదే సినిమా స్టోరిని రాజశ్రీ వాళ్ళు తమ బ్యానర్ లో తరువాత కొంత మార్పులు చేసి సినిమా చేసి సూపెర్ డూపర్ హిట్ అందించారు, అ సినిమా పేరు "హమ్ ఆప్కి హై కౌన్... సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ ల సినిమా)

No comments: