ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 29 June 2013


జై షిర్డీ సాయినాధ

(అయిదవ అంకం )
 
చిన్ననాడు వెళ్ళిపోయి బాబా పెండ్లివారితో తిరిగి షిరిడీ వచ్చుట......
మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ గ్రామంలో నివసించే చాంద్ పాటీలు, ధనికుడు, ఇస్లాం మతస్తుడు. ఒకనాడు గుర్రంపై ఔరంగాబాద్ పోవ అది తప్పిపోయే. రెండు నెలల పాటు వెతికినా దొరకక నిరాశతో భుజంపై గుర్రపు జీను వేసుకొని ఔరంగాబాద్ నుండి తన గ్రామానికి పోచుండే. సుమారు 9 మైళ్ళు నడచిన పిమ్మట, ఒక మామిడిచెట్టు నీడలో నొక తలపై టోపి, పొడుగైన చొక్కా ధరించి వింత పురుషుడు కూర్చొనియుండే. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండే. అట్టా పోతున్న చాంద్ పాటీళ్ ను జూచి చిలుం త్రాగి కొంతసేపు విశ్రాంతి తీసుకోమని పిలిచి ఆ జీను గురించి ప్రశ్నించే. అది తాను పోగొట్టుకున్న గుర్రందని జవాబిచ్చే. అక్కడకు దగ్గరగా నున్న కాలువ వద్ద వెదకుమని, అ వింత పురుషుడు/ఫకీరు చెప్పే. అతడచటకు పోయి చూడ గడ్డి మేస్తున్న తన గుర్రాన్ని చూచి మిక్కిలి యాశ్చర్యపడే. ఈ వింత మనుషుడు/ఫకీరు సామాన్యుడు కాడనియు గొప్ప 'ఔలియా' (యోగిపుంగవుడు) అనుకుని గుర్రంతో ఆ ఫకీరు వద్దకు వచ్చెను. అంత చిలుం తయారైనా కాని నీరు, నిప్పంకా కావాలి ఎందుకంటే చిలుం వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసియుండే. ఫకీరు ఇనుపచువ్వను భూమిలోనికి గ్రుచ్చగా నిప్పు వచ్చే. సటకాతో నేలపై మోదగా నీరు వచ్చే. చప్పిని నీటితో తడిపి, నిప్పుతో చిలుంను వెలిగించెను. అన్నీ తయారవ్వ, ఫకీరు ముందుగా చిలుం పీల్చి చాంద్ పాటీల్ అందించే. అన్నీ చూస్తూన్న చాంద్ పాటీలు ఆశ్చర్యపోయి ఆ ఫకీరును తన గృహమునకు రమ్మని అతిథిగా ఉండమని చాంద్ పాటీలను వేడే. ఫకీరు ఆ మరుసటి దినమే పాటిల్ ఇంటికి పోయే. పాటీల్ ఆ గ్రామమునకు మునసబు. కుటుంబంలో పెళ్ళికి అందరు పెండ్లి కూతురు గ్రామమైన షిర్డీ గ్రామం వెడిలే, పెండ్లి వారితో ఫకీరు కూడా బయలుదేరేను.
పెండ్లి జరిగిన తరువాత పెండ్లి వారు ధూప్ గ్రామము వెళ్ళిపోయిరి గాని ఆ ఫకీరు షిర్డీలో పెర్మనెంట్ గా ఉండిపోయే.
ఫకీరుకు సాయి అన్న పేరు వచ్చిన తీరు
పెండ్లివారు షిర్డీ చేరగానే, ఖండోబా మందిరం ఆనుకుని నున్నమహాళ్సాపతిగారి పొలములోని మఱ్ఱిచెట్టు క్రింద బండి దిగేరు. అందిరితో పాటు ఫకీరు కూడ అక్కడే దిగేను. ఖండోబా మందిర పూజారైన మహాళ్సాపతి "దయచేయి సాయీ" యని ఫకీరును స్వాగతించేను. మిగిలిన వారు కూడ ఫకీరును 'సాయి' యని పిలువసాగిరి. అదిమొదలు ఆ ఫకీరు 'సాయిబాబా' గా పేరు చెందేరు.
............................ ..............
ఇతరయోగులతో సహవాసము
షిర్డీలో సాయిబాబా పాడుపడిన మసీదులో వుంటుండే. షిర్డీలో బాబా రాక పూర్వమే దేవిదాసనే యోగి ఎన్నోఏళ్ళ బట్టి నివసించసాగే. బాబా అతని సాంగత్యంను యిష్టపడే. అతనితో కలసి మారుతీ దేవాలయములోను, చావడిలోను అలాగే కొంతకాలం ఒంటిగాను ఉండెను. అంతలో జానకీదాసు అను మరో యోగి యచ్చటకు చేరే. బాబా ఎల్లప్పుడు ఈ యోగితోను మాట్లాడుచు కాలము గడుపుచుండుడివారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీ దాసు పోవుచుండెను. గంగాఘీరనే ఒక వైశ్యయోగి పుణ తాంబే నుంచి వచ్చేవాడు. బాబా స్వయముగా కుండలతో నీళ్లు మోసి పూలచెట్లకు పోయుట జూచి యిట్లనెను. "ఈ మణి యిచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్ళు మోయుచున్నాడు. కాని యితడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల పుణ్యము చేసికొనినది గనుక సాయిబాబా యను నీ మణిని రాబట్టుకొనగలిగెను." యేవలా గ్రామంలో నున్న మఠములో ఆనందనాథుడను యోగిపుంగవుడుండే. అతడు అక్కల్ కోటకర్ మహారాజుగారి శిష్యుడు. అతడొకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను జూచి యిట్లనెను. "ఇది అమూల్యమైన రత్నము. ఈతడు సామాన్య మానవునివలె కనిపించిన యిది మామూలు రాయికాదు యిది మేలిమి రత్నమణి. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు." ఇట్లనుచు యేవలా చేరెను. ఇది శ్రీ సాయిబాబా బాల్యమున జరిగిన సంగతి.
................ ..................................
బాబా దుస్తులు - వారి నిత్యకృత్యములు
బాబా తలవెంట్రుకలు కత్తిరించక జుట్టు పెంచుచుండే. పహిల్వానువలే దుస్తులు వేసికొనిడివారు. షిర్డీ మూడుమైళ్ళదూరములో నున్న రహాతా పోయినపుడు బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసికొనివచ్చి, నేలను చదునుచేసి, వాటిని నాటి నీళ్ళు పోసేవారు. . రోజు బావినుండి నీళ్ళు చేది కుండలు భుజముపై పెట్టుకొని మోసి, నెలలు పోసిన తరువాత సాయంకాలము కుండలను వేపచెట్టు మొదట్లో బోర్లించుచుండిరి. కాల్చనివగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలుగుచుండెడివి. ఆ మరుసటి దినము మరోక రెండు కుండలను పొందేవారు, రోజువారి కార్యక్రమం జరిగిన తరువాత అవి విచ్చిపోయేవి. ఇట్లు మూడు సంవత్సరములు గడచే. సాయిబాబా కృషివలన అచ్చట త్వరలోనే నొక పూలతోట లేచెను. ఆ స్థలములోనే యిప్పుడు బాబా సమాధి యున్నది. దానినే సమాధిమందిర మందురు. ఆ బాబా సమాధిని దర్శించుట కొరకే యనేకమంది భక్తులు విశేషముగా పోవుచున్నారు.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
శుభం భవతు।

No comments: