ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 31 July 2013

పడిలేచిన కెరటమల్లే.. నీ తలపు నన్ను తాకే
గోడదూకి వయసు ..నీ వైపు దౌడు తీసే
ఎండసోకని తనువల్లే .. మిలమిలలాడే నీ మెరుపు
తనివితీరని మమతకై .. తహతహలాడే నా వలపు
వన్నెతగ్గని రూపసికి..వందనాల ఆలింగనాలు అందించా .
వేగిరచేసే ప్రాయానికి ..పరువు ప్రాకారాలలో బంధించా

చెలి చారుశీలి విరివి విరజాజుల ఝారివి నీవు
ప్రియా హృదయేశ్వరి వలపు కెంజాతాల సుమమాలవి నీవు

No comments: