
కవిత/పాట: తలపు పిలుపు
..............
మనసు పాడ పాట మధురంగా ఈ పూట
బ్రతుకే వో పూలతోట ప్రేమ గెలిచే చోట
...........
ముచ్చటతో మది గిచ్చుటతో
నిన్నే నిన్నే మరీ మరీ కోరేలే తొందరపడే తుంటరి మనసు
........ (మనసు పాడ పాట ......ప్రేమ గెలిచే చోట)
చక్కగను హ్రుది చిక్కగను
కన్ను కన్ను కలబడగా వడివడిగా ఎక్కేగ మనసంతా ప్రేమమైకం
........ (మనసు పాడ పాట ......ప్రేమ గెలిచే చోట)
తలపులతో ఎద తలుపులనే చెలికై తీసేనులే
మురిపెంతో వేచి చూసేనులే అయ్యో నీవు రాక వగచేనులే
......... (మనసు పాడ పాట ......ప్రేమ గెలిచే చోట)
మెరుపులతో సోకు జిలుగులతో వెలిగేవులే
సరాగాల సఖీ అనురాగాల ప్రేమరాణిగా మారేనులే
....... (మనసు పాడ పాట ......ప్రేమ గెలిచే చోట)
పరువాలలో తొలి చూపుల రాపిడి రాగాలలో
ప్రాయాల చెలి కులుకుల నయగారం పిలుపు హేచ్చేనులే
........ (మనసు పాడ పాట ......ప్రేమ గెలిచే చోట)
నల్లని కురుల మబ్బులతో అపరంజి మోమే కప్పబడగా
నేలనున్న జాబిల్లి కనుమరుగై నా బ్రతుకున నిశి కమ్మిందా అనిపించేలే
............
మనసు పాడ పాట మధురంగా ఈ పూట
బ్రతుకే వో పూలతోట ప్రేమ గెలిచే చోట
......................
విసురజ
No comments:
Post a Comment