ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 27 September 2013

కవిత: నాడు....నేడు
........................
నాటి మొగ్గలే నేడు పూలయ్యే
నాటి భావరేఖలే నేటి ప్రేమలేఖలయ్యే

నాటి పరువాల పరుగులే
నేటికి ప్రణయరాగాల పదనిసలయ్యే

నాటి తలపులే తీర్ధాలయ్యే
నేడు వలపులే తలుపు తీసి పిలిచేలే

నాడు పలుకులే అరుదయ్యే
నేడు వద్దన్నా తీపిమాటల ఊటలయ్యే

నాడు స్నేహితాలే ముద్దు ముద్దు
నేడు వరస మారే మంచి స్నేహాలు అరుదు

No comments: