కవిత: తోడైతే
.................
సువాసనల తావి పూచే పువ్వుకి తోడైతే
సువాసనల సంపెంగై భ్రమరాలతో ప్రణయం సాగించే
వచ్చే వాన వీచే గాలికి తోడైతే
గాలివానగ మారి భయంతో గుండె గుభేలనిపించే
పాడే ఆట నడయాడే ఆటకి తోడైతే
ఆటపాటల జోరుహోరులో ఉల్లము ఉర్రూతలూగేలే
తడిమే తలపు తరిమే వలపుకి తోడైతే
తలపువలపుల సాయ్యాతలలో తొలకరిప్రేమ చిగురించే
మెరిసే సౌశీల్యం మురిసే నడతకు తోడైతే
సౌశీల్యపు నడవడికల నజరానా నీకందేగా
పొంగే పరవశం ఉప్పొంగే ఆవేశంకి తోడైతే
అవేశపరవశాల సుందర సంక్రమణం అగుపడేగా
............
విసురజ
.................
సువాసనల తావి పూచే పువ్వుకి తోడైతే
సువాసనల సంపెంగై భ్రమరాలతో ప్రణయం సాగించే
వచ్చే వాన వీచే గాలికి తోడైతే
గాలివానగ మారి భయంతో గుండె గుభేలనిపించే
పాడే ఆట నడయాడే ఆటకి తోడైతే
ఆటపాటల జోరుహోరులో ఉల్లము ఉర్రూతలూగేలే
తడిమే తలపు తరిమే వలపుకి తోడైతే
తలపువలపుల సాయ్యాతలలో తొలకరిప్రేమ చిగురించే
మెరిసే సౌశీల్యం మురిసే నడతకు తోడైతే
సౌశీల్యపు నడవడికల నజరానా నీకందేగా
పొంగే పరవశం ఉప్పొంగే ఆవేశంకి తోడైతే
అవేశపరవశాల సుందర సంక్రమణం అగుపడేగా
............
విసురజ
No comments:
Post a Comment