
కవిత: దీపం వెలుగులు
.............
నెత్తురోడే సురీడు సంద్రంలో కలిసేవేళ
స్వేచ్చా విహంగాలు గూటికి చేరే సందేవేళ
రేయిని స్వాగతిస్తూ ఇళ్ళలో దీపం వెలిగిన వేళ
చంద్రుడే నక్షత్రాలతో అవనిపై వెలుగులు విరజిమ్మేవేళ
ప్రియతమా చేరరావా జీవిత ఆశాదీపం వెలిగించవా
మిణుకు మిణుకు మనే మనసుదీపం ఆరకుండ చూడు నేస్తమా
ఇచ్చే మనసుంటే పుచ్చుకునే వయసుంది
కలిసే అద్రుష్టముంటే కలల్ని పండించే తెగువుంది
..........
విసురజ
No comments:
Post a Comment