ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 27 September 2013

Photo: కవిత: ఎప్పుడు ఏమో తెలిసింది/తెలిసేది 
.............................................
చెలి 
క్షణాల విలువ నీవు దూరమైతే తెలిసింది 
కలల విలువ నీకు దూరమైతే తెలిసింది                 

చెలి 
పలుకు విలువ నీ పిలుపు అందనప్పుడు తెలిసింది
సాన్నిహిత్యం విలువ నీ నీడ దూరమైతే తెలిసింది 

చెలి 
స్నేహం విలువ నీ ఎడబాటు నేర్పింది
మనసు విలువ నీ అనురాగామే నేర్పింది 

చెలి 
తలపు విలువ మరులుపడితినే తెలిసేది   
మనసుకి తలుపు విలువ దోపిడయ్యాకనే తెలిసేది  

చెలి
విశ్రాంతి విలువ అలసినప్పుడే తెలిసేది 
వెన్నెల విలువ అమవాసనాడే తెలిసేది  

చెలి
పొగరు విలువ ఆత్మాభిమానం కరువైతే తెలిసింది 
పౌడరు విలువ చెమటిపట్టి చిరాకైనప్పుడే తెలిసింది  

చెలి
వగలు విలువ సొగసరి సొబగు చూస్తేనే తెలిసేది 
పువ్వులు విలువ సోగ్గాడు సరసన చేరితేనే తెలిసేది 

చెలి
కోరిక విలువ వయసు గగ్గోలు పెట్టినప్పుడే తెలిసేది 
తీరిక విలువ ఖాళీ లేకుండా తిరిగినప్పుడే తెలిసేది 
......
విసురజ

కవిత: ఎప్పుడు ఏమో తెలిసింది/తెలిసేది

No comments: