ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 16 December 2013

1) అణుకువ చూపడమంటే వంగి వంగి సలాములు చేయడం కాదు. అర్హత వున్నవారికి ఉచితాసనం, బాధ్యతలు తెలిసినవారికి తోడ్పాటుగా వుండడమే. విర్రవీగే వారికి విధేయత చూపాల్సిన అవసరం లేదు.

2) పిల్లలు పెద్దల తరహాగా పెద్దలు పిల్లల తరహాలోను వుంటే అదొలా, అసహజంగా వుంటుంది. వయసుకు తగ్గ వివేకం, పరిణితి చూపిస్తేనే సహజంగా వుంటుంది


PS...(పాట్లు పడిన వారు, కష్టంతో పైకొచ్చినవారు, పొరపాట్లు తక్కువ చేస్తారు, నెమ్మదిగా లక్ష్యం వైపు సాగుతారు.)

No comments: