ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 13 December 2013

Photo: కవిత: దీపావళంటే 
..........
మనసునిశిలో వలపు వెలుగులు విరియంగా దీపావళే
అమావాసలో నేలా నింగి కాంతితో నిండంగా దీపావళే 

కావ్యకోమలికి కవితల్నే కళాత్మకంగా అందిస్తే దీపావళే  
వీణాపాణికి స్వరాభిషేకమే మధురంగా చేస్తే దీపావళే  

రాధమ్మకు ప్రియమాధవుడు చేరరావంగా దీపావళే  
మనోరధమ్ముకు ప్రజ్ఞాపాటవం అండగా నిలవంగా దీపావళే 

ఎగిరే పతంగానికి వీచేగాలే తొడ్పాటిస్తే దీపావళే 
కదిలే కాలానికి కొత్తనడకలే సొబగులిస్తే దీపావళే

నలిగిన మనసుకు శాంతి దొరకంగా దీపావళే
బడలిన మేనుకు విశ్రాంతి లభించంగా దీపావళే

తరిమిన తలపే ఎదగదిని తడిమి పారితే దీపావళే 
వలచిన మనసే వేచినజోడు గూటికే చేరితే దీపావళే 
................
విసురజ 

(PS: దీపావళే అంటే స్వచ్చమైన వెలుగులే)

కవిత: దీపావళంటే 

No comments: