
కవితా: మీరు కాదంటారా..
............................
సన్నిహితుడైన అత్మీయుని పరిచయంతో
ఎద తప్పక పరిపూర్ణుత చెందదా
శ్వాసగ మారిన స్నేహితుని పలకరింపుతో
మది ఆనంద పరవశం చెందదా
తొలకరి జల్లులకై వేచే పుడమిలా
ఆమని చివురులకై వేచే కోకిలలా
పూతేనెల గ్రోలుటకై వేచే భ్రమరములా
ఎడదదాహం తీర్చుటకై వేచే ప్రణయంలా
వేచి చూస్తున్నా నేస్తమా
వేదనతీరం ఆవలకు చేరాలని
చూసి వస్తున్నా ప్రియాతమా
మనసైననేస్తం ప్రేమగుణ రుచులుని
అందచేయనా ఎద తాంబులాన్ని
అలవోకగా వొద్దికిగా ఆర్ధతగా
ఆలపిస్తున్నా ఎద గాయగేయాన్ని
శాస్త్రీయంగ సాక్ష్యంగ సుస్వరాలుగా
తడిమే స్వరమే వరమై
ఎదను పలకరించే ప్రేమై
తలపే తొలిచే గతమై
మదిని పిలిచే గీతమై
సుందర తలుపులే సజీవ చిత్రరూపమై
చెలిని రూపమే అవధరించే మురిపించే
ముందర బంధాలే మధుర స్నేహదీపాలై వెలిగే
చింతని చిత్తమే సుదూరతీరాలకు త్రోసేసి మురిసే
చక్కని చిక్కని మనసుకే
మనసారా వేనవేల నమస్సులు
వలపు తలుపు తెరుచుటకే
తొందరపడే మనసుకు జోహార్లు
.......
No comments:
Post a Comment