
కవిత: సోయగాల ఘంటికలు
..................................
సోగకన్నుల మిసిమి ప్రాయాల సొగసుకత్తే
కుండలతో నీరుకై కోనలోని సరసుకొచ్చే
నెలవంక అందాలు ధరణిపై రమణి అందే
వాగూవంకల మెలికలు సుకుమారి నడుంలో తొంగిచూసే
విరిసిన పున్నమి వెన్నెలలో కోమలి అందాలు
కొండాకోనల రమణీయతతో పొటీపడే వైనాలు
ఉరికేటి వాగులో పారేటి తెల్లటి నురుగే
కులుకు నడకల సుందరి అనుపమాన సౌందర్యమే
పచ్చని బయళ్ళపై వెనకకు చూస్తూ ఇంతి నడిచే తీరులు
వెనకెనకే వచ్చే ప్రియునికై అత్రుతతో ఎదురుచూసే వైనాలు
వన్నెలచిన్నెల వాలుజడతో పాదమంజీరాలతో మనస్విని నడకలు
ఆకుపచ్చని నెమళ్ళ తెల్లని బాతుల వన్నెలకు సిగ్గిచ్చే చేతలు
No comments:
Post a Comment